Home News ‘గో జప’ మహాయజ్ఞం

‘గో జప’ మహాయజ్ఞం

0
SHARE

గోవులు, ప్రజలు, దేశం, ప్రపంచ శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ‘గో సేవా విభాగం’ ఆధ్వర్యంలో 31 మార్చి, 2018 హనుమజ్జయంతి నుండి 15 ఏప్రిల్‌, 2018 ఆదివారం వరకు ‘గో జప’ మహాయజ్ఞం

భారతీయ సంస్కృతి అంటేనే ‘గో సంస్కృతి’. మూపురం, గంగడోలు కలిగి ఉన్న మన దేశవాళీ ఆవు శరీరం ఎంతో పవిత్రమైనది. జీవకోటి మనుగడకు, పాడిపంటలకు, పర్యావరణ సంరక్షణకు, ఇంధన శక్తి ఉత్పాదనకు ఆధారం గోవు. గోవు ఉన్న ఇల్లు, దేవాలయం, పాఠశాల, కార్యాలయం, కర్మాగారం, వ్యవసాయ క్షేత్రం, గ్రామం, నగరం, దేశంలోని ఏ ప్రదేశమైనా శుభప్రదంగా, సకలసిద్ధి ప్రదాయినిగా ఉంటుంది.

కార్యక్రమ ఉద్దేశ్యం

సృష్టి సంరక్షణకు మూలమైన గోవు మహాత్యాన్ని దేశ ప్రజలందరికీ అందించటానికి అఖిల భారత స్థాయిలో ‘గో జప యజ్ఞ’ కార్యక్రమం యోజన జరిగింది. దీనివలన దేశీయ గో సంతతి వృద్ధి అవుతుందనీ, భారతీయులందరికీ సుఖశాంతులు లభిస్తాయనీ, దేశం అన్ని రంగాలలో వృద్ధి సాధిస్తుందనీ, ప్రపంచంలో శాంతి వెల్లివిరుస్తుందని నిర్వాహకుల ఆశిస్తున్నారు.

గో జప మహాయజ్ఞం

దేశమంతటా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, బస్తీలు, విశేషంగా సాధు సంతులు, గోశాలలు, గోవులున్న స్థలాలు, ధార్మిక సంస్థలు, సేవాసంస్థలు, దేవాలయాలు, విద్యాల యాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, వినాయక మంటపాలు, కులసంఘాలు, గో భక్తులందరూ ఈ మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

కార్యక్రమ ప్రారంభం

మార్చి 31న హనుమత్‌ జయంతి పర్వదినం. ఆ రోజున ఏదో ఒక పవిత్ర స్థలంలో సామూహికంగా కలుసుకొని, సంకల్ప కంకణం ధరించి, జప సంకల్పం స్వీకరించాలి. 8 మాలలు (8I108= 864 సార్లు) జపం చేయాలి.

ముగింపు

ఏప్రిల్‌ 15 ఆదివారం నాడు అందరికీ సౌకర్యంగా ఉండే స్థలంలో సామూహికంగా యజ్ఞం నిర్వహించాలి. సామూహికంగా 9 మాలలు (9I108=972 సార్లు) జపం చేయాలి, చేయించాలి. అనంతరం సాధుసంతులు లేదా పెద్దలు లేదా గో మహత్యం తెలిసిన వ్యక్తి గో సంరక్షణ, గో పెంపకం వలన ఉపయోగాల గురించి వివరించాలి. యజ్ఞ తిలకం ధరించడం, శాంతిమంత్రం, గోమాత ప్రసాదంతో కార్యక్రమం ముగించాలి.

సంకల్పం

‘గో, జన, రాష్ట్ర, జగత్‌ హితాయచ

అహం సంకల్పం కరిష్యామి’

ఈ సంకల్ప మంత్రాన్ని మార్చి 31న ప్రారంభం రోజున మాత్రమే 3 సార్లు చదివించాలి.

గో జపం

శ్రీ సురభ్యై నమః అనే మంత్రాన్ని మార్చి 31న సామూహికంగా, ఆ తరువాత ఏప్రిల్‌ 15 వరకు ప్రతి వ్యక్తి, ప్రతిరోజు వ్యక్తిగతంగా లేదా కుటుంబ సహితంగా లేదా సామూహికంగా చేయాలి. ఇలా 108 మాలను రోజుకు 8 సార్లు చేయాలి. చివరి రోజు 9 సార్లు చేయాలి.

గో జప యజ్ఞం చేసే వారు పాటించాల్సిన నియమాలు

స్నానానంతరం నిర్ణీత సమయంలో, పరిశుభ్ర మైన స్థలంలో, తూర్పు లేక ఉత్తర దిశలో, ఏదైనా ఆసనంపై కూర్చోవాలి. అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అనంతరం ప్రశాంతంగా జపమాలతో లేదా వేళ్ళతో లెక్కించుకొంటూ ‘శ్రీ సురభ్యై నమః’ అని జపం చేయాలి. జప సంఖ్యను రాసుకోవాలి. ఒక రోజు జపమాల తగ్గితే, మరొకరోజు పూరిం చాలి. వీరంతా చివరి రోజున జరిగే సామూహిక కార్యక్రమంలో తప్పక పాల్గొనండి.

మీరు చేస్తున్న గో జపయజ్ఞ సమాచారాన్ని వ్యక్తిగతంగా లేదా పోస్ట్‌, వాట్సప్‌ గ్రూప్‌, ఫేస్‌ బుక్‌ ద్వారా తోటివారికి పంపించండి.

సంకల్ప విధి, జపయజ్ఞం నిరాడంబరంగా, తక్కువ ఖర్చుతో జరగాలి. సంఖ్య, వాతావరణమే ముఖ్యమని గమనించాలి.

మీ మండలం, గ్రామం, బస్తీవారిగా గో జపయజ్ఞ నిర్వహణ సమితిని ఏర్పాటు చేసుకుని ప్రాంత కార్యకర్తకు తెలియచేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఇతర వివరాలకు ఈ కింది నంబర్లలో సంప్రదించండి :

గోగూరి నాగేందర్‌రెడ్డి – 9440213236
జగన్‌మోహన్‌ – 7382440729
ఆకుతోట రామారావు – 8985621950
రాజేశ్వర్‌ – 8317555519

ఈ గో జప యజ్ఞానికి సంబంధించిన ప్రతీ సమాచారాన్ని [email protected] కు పంపండి.

(జాగృతి సౌజన్యం తో )