మాతృ భూమి కోసం అద్వితీయ పోరాటం సలిపిన ధీర వనిత రాణి దుర్గావతి

    0
    SHARE

    మెఘల్‌ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహస గుణాలు ప్రదర్శించిన ధీర వనిత రాణి దుర్గావతి. మొఘల్‌ సామ్రాజ్యంపై నిత్యం ధిక్కార స్వరం వినిపిస్తూ… పోరాటం చేసిన ధీర మహిళ. అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తూ.. చివరి వరకూ మొఘల్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ జూన్‌ 24, 1564 రోజున బలిదానం అయియంది. అచంచలమైన ఆత్మ సంకల్పంతో మొఘల్‌ పాలకుడు అక్బర్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాడి.. చరిత్రలో నిలిచిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా సమీపంలో 1524 లో అత్యంత ప్రసిద్ధమైన చండేలా రాజవంశంలో జన్మించింది రాణి దుర్గావతి. ఆ వంశానుగతంగా వచ్చే దృఢత్వం, ధైర్య సాహసాలను పుణికిపుచ్చుకుంది. వీటినే వారసత్వంగా పొందింది. 11 వ శతాబ్దంలో అద్భుతమైన ఖజురహో దేవాలయాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన చండేలాలు తమ రాజవంశాన్ని గొప్ప సాంస్కృతిక వారసత్వంతో సుసంపన్నం చేసుకున్న వంశం నుంచి వచ్చింది.

    గోండ్‌ రాజు సంగ్రామ్‌ షా కుమారుడు దల్పత్‌ షాను రాణి దుర్గావతి వివాహం చేసుకున్నారు. అయితే.. 1550 లో తన భర్త మరణించారు. దీంతో గార్హ కటంగ పగ్గాలను రాణి పద్మావతి చేపట్టింది. నర్మదా తీరంలోని పచ్చని పొలాల మధ్య రాజ్యాన్ని చక్కగా పాలించింది. ప్రజల అవసరాలు, సంక్షేమం, యోగ క్షేమాలను ఆమె అత్యంత నిబద్ధతతో తీర్చేవారు. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, దృఢత్వానికి పేరు గాంచిన గోండు తెగ నుంచి రాణి దుర్గావతి రూపంలో బలమైన నాయకురాలు ఆ దేశానికి లభించింది. ఏకంగా 16 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా పాలించి, అందరిచేతా ప్రశంసలు అందుకుంది.

    ఇలా పరిపాలిస్తుండగా… మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తి అక్బర్‌తో ఆమె రాజ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడిరది. 16 వ శతాబ్దం మధ్యలో ఆసఫ్‌ ఖాన్‌, పొరుగున వున్న మాల్వా సుల్తాన్‌ బాజ్‌ బహదూర్‌ ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించారు. వీరందర్నీ ధీర వనిత రాణిదుర్గావతి అత్యంత శౌర్య పరాక్రమాలతో ఎదుర్కొంది. అయితే.. అసఫ్‌ ఖాన్‌ చొరబాటును సమర్థవంతంగా ఎదుర్కొన్నా…. రాణి దుర్గావతి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది. అయినప్పటికీ… మొఘలుల చేతికి తన రాజ్యాన్ని అప్పగించడానికి ఆమె ససేమిరా అంగీకరించలేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా… ఆమె ధైర్యంగా వాటిని ఎదుర్కొందే గానీ… తన రాజ్యాన్ని మొఘలుల చేతికి మాత్రం ఇవ్వలేదు. అత్యంత ధైర్య సాహసాలు, ధీశక్తితో పరాయి పాలకులను ఎదుర్కొన్నది కాబట్టి… వారికి లొంగకుండా… తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంది. అక్బర్‌ సేనలకు లొంగకుండా… బలిదానం చేసుకుంది కాబట్టి… భారత చరిత్రలో ధీర వనితగా పుటల్లోకి ఎక్కింది. తన మాతృభూమి కోసం అద్వితీయమైన స్ఫూర్తిని చూపిస్తూ… త్యాగం చేసింది కాబట్టి.. బలిదాన్‌ దివస్‌ రోజున రాణి దుర్గావతిని మనమందరమూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.