Home News నల్గొండ లోని ప్రసిద్ద ఛాయాసోమేశ్వరాలయంలో కాంతి ధర్మాల పై విజ్ఞాన భారతి వారి కార్య శాల

నల్గొండ లోని ప్రసిద్ద ఛాయాసోమేశ్వరాలయంలో కాంతి ధర్మాల పై విజ్ఞాన భారతి వారి కార్య శాల

0
SHARE

నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం విశేషమైనది. ఈ  ఆలయ గర్భగుడిలో శివలింగం వెనక భాగంలో రోజు అంతా నిలకడగా ఎలాంటి కదలిక లేకుండా ఒక స్తంభం నీడ ఎప్పటికి కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు గుడిలో ఉన్న మూడు గర్భగృహాలలోనూ ఛాయ రెండు భాగాలుగా, ఆరు విడి వడి భాగాలుగా కనపడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  ఇలాంటి అద్బుతమైన కట్టడాలను వాటి విశేషతను నేటి తరం వారికి వివరించాలనే ఉద్దేశం తో విజ్ఞాన భారతి, తెలంగాణా, వారు 21 జనవరి 2018 నాడు ఒక రోజు కార్య శాల నిర్వహించారు.

ఈ కర్యశాల ను శ్రీ జితేందర్ సింగ్, డిఆర్ డి ఓ శాస్త్రవేత్త, నిర్వహించగా విజ్ఞాన భారతి సంయోజక్ శ్రీ జి ఎల్ ఎం మూర్తి గారు సహకరించారు.

శ్రీ కరుణానిధి, డి ఆర్ డి వో సీనియర్ శాస్త్రవేత్త పాల్గొని సైన్సులో ఆధ్యాత్మిక సైన్సు సాధారణ సైన్సు పరిధి దాటడం అందరికి అవసరమని వివరించారు. ప్రయోగాలు ,పరిశిలనలు  ప్రశ్నలతో ఉండే గురుకుల విద్య నేడు కేవలం కొన్ని పరిక్షల కోసం మార్కుల కోసంగా తయారయ్యిందని ఇలాంటి మరిన్ని సైన్సు కార్యశాలలు నిర్వహించాలని కోరారు.

ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు ప్రధానంగా కాంతి కి సంబదించిన ప్రాథమిక విషయాలతో పాటు వాటి మీద ప్రయోగాలు నిర్వహించారు. దాంతో పాటు మన పూర్వీకుల వైజ్ఞానిక విజ్ఞ్యానానికి ఆధ్యాత్మిక స్థానాలకు అపూర్వ సంబధాన్ని వివరించారు.

శాస్త్రవేత్తలు మాట్లడుతూ పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ప్రసిద్ద శివాలయంలో భారతీయులు కాంతి కి సంభందించిన విషయం లో అత్యంత గొప్ప ప్రతిభ ను కనపరచారని చెప్పడానికి భారతదేశంలోని  ఛాయా సోమేశ్వరాలయం సజీవ నిదర్శనం అని కొనియాడారు.

పదహారవ శతాబ్దం వరకు పశ్చిమ దేశాలలో కటకం గురించి గాని కాంతి ప్రసరణ గురించి కాని ప్రాథమిక అవగాహన కుడా లేదని చరిత్ర చెబుతోంది. పాశ్యాత్యులకన్నా ఐదు శతాబ్దాలకు పూర్వమే ఇంత గొప్ప కట్టడం మన పూర్వీకుల  వైజ్ఞానిక విజ్ఞ్యానానికి ప్రతీక అని అన్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో శ్రీ బుర్రి గోపాల్ రెడ్డి గారు, నల్గొండ లోని సైన్సు టిచర్, శ్రీ నరహరి,  ప్రావిన్స్ సైంటిస్టు డిఆర్డివో తో పాటు శాస్త్రవేత్తలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు గుడి ప్రాంగణంలో కార్యశాల నిర్వహించడం మరియు ప్రముఖ డి ఆర్ డి ఓ శాస్త్రవేత్తల మార్గదర్శనంలో ప్రయోగాలు చేయడం స్పూర్తిదాయకం అని సంతోషాన్ని వెలిబుచ్చారు.