సంచార జాతుల కోసం శాశ్వతమైన ఒక కమీషన్ ఏర్పాటు చేయాలని, దేశం మొత్తం లో సుమారు 15 కోట్ల మంది సంచార జాతి ప్రజలు దీనావస్థలో జీవనం గడుపుతున్నారని, జనాభా లెక్కల ద్వారా వారి పూర్తి వివరాలు ప్రభుత్వం సేకరించి సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వారికి రాజ్యాంగ బద్దంగా రావాల్సిన పథకాలు అందించాలని, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని, శ్రీ దాదా భికూ రామ్ జీ ఇదాతే, సంచార జాతుల జాతీయ కమీషన్ మాజీ అధ్యక్షులు కోరారు.
సామాజిక సమరసతా వేదిక మాజీ అఖిల భారత అధ్యక్షులు అయిన శ్రీ రామ్ జీ ఇదాతే గారు తెలంగాణ సామజిక సమరసత వేదిక అద్వర్యంలో ఖమ్మంలో ఎప్రిల్ 17 నాడు జరిగిన సంచార విముక్త జాతుల అభివృద్ధి మండలి సభలో ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. సంచార జాతుల సమ్మేళనం లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన 13 కులాలకు చెందిన 600 మంది వరకు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతుల వారు 60 లక్షలకు పైగా ఉన్నారని, వీరు దేశంలోని సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ధర్మ ప్రచారకులుగా ఉరూరా తిరిగుతున్నారని, అట్టి వారి పరిస్థితులను ప్రభుత్వ అధ్యయనం చేసి ప్రభుత్వ సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు, సభలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.
మొదటగా నగరంలోని నయ బజార్ కళాశాల గ్రౌండ్ నుంచి ఎం బి ఫంక్షన్ హాల్ వరకు వివిధ సంచార జాతుల వారు వారి వారి వృత్తుల వేషాదారణలతో కోలాట నృత్యాలు, పాములతో ఆటలు రకరకాల విన్యాసాలతో ర్యాలీ నిర్వహించారు. గారడీ, వీరభద్ర , బెడ బుడగ జంగం, గొండ్రియ, డక్కలి, వడ్డెర, పరిక ముగ్గులు, మాల దాసరి, కీసర, గొల్ల కురుమ, అర్ధ సంచార, దూదేకుల తో పాటు వివిధ సంఘాల భాద్యులు ఈ సభలో ఉన్నారు.
సామజిక సమరసత వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ కేసర జైపాల్ రెడ్డి గారు, సంచార జాతుల అభివృద్ధి మండల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి. స్వర్ణకుమార్, కన్వీనర్ తురక నర్సింహ, రామకృష్ణ, హనుమంత రావు, అర్జున్, వెంకటరామయ్య, రామలింగేశ్వర రావు, రమేష్, కోటేశ్వర రావు, సిద్దా సాహెబ్, సంతోష్, గణేష్, అల్లిక వెంకటేశ్వర్ రావు, వెంకటరమ యాదవ్, రేఖా సత్యనారాయణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.