Home News కేరళ వేగమోన్‌ సిమి కేసులోని ఇస్లామిక్ తీవ్రవాదులు హైదరాబాద్ మదరసాలలో పని చేసిన వారే

కేరళ వేగమోన్‌ సిమి కేసులోని ఇస్లామిక్ తీవ్రవాదులు హైదరాబాద్ మదరసాలలో పని చేసిన వారే

0
SHARE
  • ఉగ్రవాది ఆలమ్‌ జెబ్‌ అఫ్రీదీకి ఏడేళ్ళ జైలు
  • నోట్‌: ఫైల్‌ ఫొటోలు కామన్‌లో టీఆర్‌ ఫోల్డర్‌…
  •  వేగమోన్‌ కేసులో విధించిన ఎర్నాకుళం ఎన్‌ఐఏ కోర్టు
  •  జేకేహెచ్‌ ఉగ్రవాదులకు సిటీలో శిక్షణ ఇచ్చింది ఇతడే
  •  ‘టెర్రర్‌ టీచర్‌’ ముఫ్తీ అబు బషర్‌కు సైతం జైలు శిక్ష

కేరళలోని వేగమోన్‌లో జరిగిన ఉగ్రవాద శిక్షణ శిబిరం కేసు విచారణ పూర్తి చేసిన ఎర్నాకుళం కోర్టు గత వారం 18 మందికి ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. 2007లో నిషేధిత సంస్థ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) నేతృత్వంలో జరిగిన ఈ టెర్రర్‌ క్యాంప్‌ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేసింది. ఈ కేసులో శిక్ష పడిన దోషుల్లో నలుగురికి సిటీతో లింకులు ఉన్నాయి. ఒకరు 2015లో రెండుసార్లు సిటీకి వచ్చి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి వెళ్ళాడు. మరొకరు అరెస్టు కావడానికి ముందు నగర శివార్లలోని ఓ మదర్సాలో విధులు నిర్వర్తించాడు. మరో ఇద్దరు నిందితులు నగరానికి చెందిన కొందరికితో కలిసి రంగారెడ్డి జిల్లా అనంతగిరిలో ఉగ్రవాద శిబిరం ఏర్పాటుకు పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అఫ్రిది… ఐఎం టు జునూద్‌…

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపురా ప్రాంతానికి చెందిన ఆలమ్‌ జెబ్‌ అఫ్రిది ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ద్వారా ఉగ్రవాదబాటపట్టాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్‌ పేలుళ్లలో కీలకపాత్ర పోషించాడు. పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరులోని దొడ్డనాగమంగళంలోని వినాయకనగర్‌లో మారు పేరుతో తలదాచుకున్నాడు. సిరియా కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నెరపుతున్న షఫీ ఆర్మర్‌ను సంప్రదించిన అఫ్రిది తానూ సిరియా వచ్చేస్తానన్నాడు. దీంతో 2015లో కొత్తగా ఏర్పడిన ‘జునూద్‌ అల్‌ ఖలీఫా ఏ హింద్‌’ (జేకేహెచ్‌) విషయం ఇతడికి చెప్పిన షఫీ… హైదరాబాద్‌ వెళ్లి ఆ మాడ్యుల్‌కు సహకరించమని ఆదేశించాడు. దీంతో సోషల్‌మీడియా ద్వారా నగరానికి చెందిన జేకేహెచ్‌ ఉగ్రవాది నఫీస్‌ ఖాన్‌ను సంప్రదించాడు. నఫీజ్‌ఖాన్‌ తయారు చేసిన ఇవి పేలడానికి అవసరమైన డిటోనేటర్లును తయారు చేయడం మాత్రం ఇతడి వల్లకాలేదు. దీంతో నఫీస్‌ బాంబుల తయారీలో నిష్ణాతుడైన అఫ్రిదీ సహాయం కోరాడు. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు హైదరాబాద్‌ వచ్చిన అఫ్రిది… రసాయనాలు వినియోగించి డిటోనేటర్లు ఎలా తయారు చేయాలనే అంశాన్ని ‘బోధించి’ వెళ్లాడు. ఈ జేకేహెచ్‌ మాడ్యుల్‌ను ఎన్‌ఐఏ అధికారులు 2016 జనవరిలో పట్టుకున్నారు. అప్పుడు చిక్కని ఆఫ్రీదీ అదే నెల 23న ఫిబ్రవరిలో బెంగళూరులోని దొడ్డనాగమంగళం ప్రాంతంలో ఉన్న పరప్పన అగ్రహార పరిధిలో తెలంగాణ పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలోనే ఇతడు రాష్ట్ర అధికారిపై హత్యాయత్నం కూడా చేశాడు.

పహాడీషరీఫ్‌లో మౌల్వాగా…

వేగమోన్‌ కేసులో శిక్షపడిన ముఫ్తీ అబు బషర్‌ 2013లో గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి సెంట్రల్‌ జైలులో సొరంగం తవ్వడం ద్వారా తప్పించుకునే దుస్సాహసానికి యత్నించిన వారిలోనూ ఉన్నాడు. ఇతడికి 2008లో అహ్మదాబాద్‌ పేలుళ్ళ కేసులో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీనికి ముందు సిటీకి వచ్చిన ఇతగాడు పహాడీషరీఫ్‌లో ఉన్న ఓ మదర్సాలో మౌల్వాసాబ్‌ (టీచర్‌)గా పని చేస్తూ మూడేళ్ల పాటు ఇక్కడే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్‌ఘడ్‌ జిల్లాలో ఉన్న సురాయిమీర్‌ గ్రామానికి చెందిన అబు బషర్‌ 2005లో హైదరాబాద్‌ వచ్చాడు. స్వస్థలంలో ఉన్నప్పటి నుంచీ ఇతడు నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)లో కీలకపాత్ర పోషించాడు. పహాడీషరీఫ్‌లోని మహ్మదీయ కాలనీలో ఉన్న ఓ మదర్సాలో టీచర్‌గా పని చేశాడు. నగరానికి చెందిన కొందరు వివాదాస్పద వ్యక్తులు సైతం ఇతడికి స్నేహితులుగా మెలిగారు. సిటీలో ముద్రితమైన ఓ ఉర్దూ మాసపత్రికకు కొంతకాలం ఎడిటర్‌గానూ వ్యవహరించాడు. 2005 జూలై నుంచి 2007 జనవరి వరకు ఇక్కడే ఉన్న బషర్‌ బీహార్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకోవడానికి స్వస్థలం వెళ్లాడు. తిరిగి అదే ఏడాది ఏప్రిల్‌లో ఇక్కడకు వచ్చినా… మే 18న పాతబస్తీలోని మక్కా మసీదులో బాంబు పేలుడు ఉదంతం తరవాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వేగమోన్‌ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సఫ్టర్‌ నఘోరీ, ఖముద్దీన్‌ నఘోరీల పైనా సిటీలో కేసు ఉండేది. నగరానికి చెందిన కొందరు వివాదాస్పద వ్యక్తులతో కలిసి రంగారెడ్డి జిల్లా అనంతగిరిలో ఉగ్రవాద శిక్షణ శిబిరం ఏర్పాటుకు ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ. వేగమోన్‌ క్యాంప్‌ తర్వాత 2007లోనే అనంతగిరిలో సిమి శిక్షణ శిబిరానికి వీరు ప్రయత్నాలు చేశారనే గోపాలపురం ఠాణాలో ఓ కేసు సైతం నమోదైంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా న్యాయస్థానంలో ఇది వీగిపోయింది.