Home News రోహింగ్యా ముస్లిం  ఉగ్రవాదుల చేతిలో 99 మంది హిందువుల ఊచకోత

రోహింగ్యా ముస్లిం  ఉగ్రవాదుల చేతిలో 99 మంది హిందువుల ఊచకోత

0
SHARE
Amnesty says there were many children among the Hindus killed

మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం ఉగ్రవాదుల అరాచకాలకు నిరుడు ఆగస్టులో 99 మంది హిందువులను దారుణంగా చంపేశారని, మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఓ నివేదికలో వెల్లడించింది.

మయన్మార్‌లోని రాఖైన్‌ ప్రాంతంలో తమ పరిశోధనలో చాల సమాధులు బటపడ్డాయని, సామూహికంగా ఖననాలు జరిపినట్లు ఆనవాళ్లున్నాయని పేర్కొంది. ఈ హత్యలను అక్కడి ముస్లిం తీవ్రవాదుల సంస్థ అయిన  ఆరకాన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ (ఏఆర్‌ఎ్‌సఏ) యే ఈ ఊచకోతకు  పాల్పడిందని ఆమ్నెస్టీ అందులో పేర్కొంది.

గత సంవత్సరం 2017 ఆగస్టు 25 రోహింగ్య ముస్లిమ్స్ ఏక కాలంలో రాఖైన్‌ రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ పోస్టులపై దాడులు జరిపిన రోజునే ఈ మారణకాండ చోటుచేసుకుందని తెలిపారు. వారి ముఖ్య ఉద్దేశం అక్కడ స్థానికంగా నివసిస్తున్న హిందూ  మైనారిటీలను అసలు నామ రూపాలు  లేకుండా తరిమెయ్యాలన్నది రోహింగ్యాల కుట్ర అనీ కుడా  వివరించింది.

మౌంగ్‌డా ప్రాంతంలోని ఖా మౌంగ్‌ సేక్‌ అనే గ్రామంలో 53 మంది పిల్లలను ఒక సాయుధ బృందం ఉరేసి చంపేసిందని, అయితే ఈ సాయుధులు ఎవరు అనేది తేలాల్సి ఉందని కూడా ఆమ్నెస్టీ వెల్లడించింది.

‘‘పిల్లల, మహిళల కళ్లకు గంతలు కట్టారు. వారిని ఊరవతలకు తీసికెళ్లారు. ఆ సాయుధులంతా మామూలు దుస్తుల్లోనే ఉన్నారు. వాళ్లవైపు చూడొద్దని మాకు చెప్పారు. వారి చేతిలో కత్తులు, ఇనుప రాడ్లు ఉన్నాయి. వాటితో కొట్టి నరికి చంపేశారు. ఆ పిల్లల ఆర్తనాదాలు ఇప్పటికీ మా చెవుల్లో మార్మోగుతున్నాయి… తలుచుకుంటుంటే భయం వేస్తోంది’ అని రాజకుమారి అనే ఓ ఇరవయ్యేళ్ల యువతి చెప్పినట్లు ఆమ్నెస్టీ నివేదిక వివరించింది.

పక్కనే హిందువులు అధికంగా నివసిస్తున్న యే బౌక్‌ క్యార్‌ అనే మరో గ్రామంలో దాదాపు 46 మంది పురుషులు ఒకేరోజున అదృశ్యమయ్యారు. వీరందరిని కూడా ఆర్సా ఉగ్రవాదులు చంపేసి ఉంటారని భావిస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు.

వీటిని ఆమ్నెస్టీ సంస్థ బంగ్లాదేశ లో శరణార్ధులుగా తలదాచుకుంటున్నా హిందూ శిబిరాలు, రాఖైన్‌ ప్రాంతాన్ని సందర్శించినపుడు వెలుగులోకి వచ్చాయి అని పేర్కొంది.

రాఖైన్‌ ప్రాంతం బౌద్ధులకు, ముస్లింలకు నెలవు. అయితే అక్కడక్కడా హిందువులు కూడా ఉన్నారు. వీరంతా ఒకప్పుడు బ్రిటిష్‌ హయాంలో పనుల గురుంచి వలస వచ్చిన కార్మికులు. కాల క్రమేనా వారు అక్కడే స్థిరపడిపోయారు. వారందరినీ ముఖ్యంగా అక్కడ ఉన్న హిందువు కుటుంబాలను లక్షంగా చేసుకొని రోహింగ్యాలు మరణ హోమాన్ని సృష్టించి నట్టు తెలుస్తుంది.

గత సంవత్సరం ఆగస్టులో వచ్చిన ఈ తిరుగుబాట్లను మయన్మార్ ఆర్మీ అణచేయడంతో 7 లక్షల మంది రోహింగ్యాలు శరణార్థులుగా మారి వలసపోవాల్సి వచ్చింది.

ఐక్యరాజ్యసమితి దీనిని జాతి నిర్మూలనగా అభివర్ణించి, తక్షణం ఆపాలని మయన్మార్‌ ప్రభుత్వాన్ని కోరింది. కానీ అక్కడి సైన్యాధికారులు స్పందన అంత ఆశాజనకంగా లేదని పేర్కొంది. అటు రోహింగ్యా ముస్లింలు మైనారిటీలైన హిందువులను నిర్మూలిస్తున్నారని ఆమ్నెస్టీ నివేదిక చెబుతోంది.