ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ సురేష్ (భయ్యాజీ)జోషి పత్రికా ప్రకటన
ఆఫ్గనిస్తాన్ జలాలాబాద్ లో హిందూ -సిక్కుల హత్యలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తోంది. విచారం వ్యక్తం చేస్తోంది. హతులకు సద్గతులు కలగాలని, బాధిత కుటుంబాలకు ఈ అపారమైన బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని భగంతుడిని ప్రార్ధిస్తోంది.
ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం నేరస్తులను గుర్తించి కఠినంగా శిక్షిస్తుందని ఆశిస్తున్నాము. ఇది చాల తీవ్రమైన విషయం కనుక భారత ప్రభుత్వం కూడా కల్పించుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.
పిడివాద, తీవ్రవాద సమూహాలను తుడిచిపెట్టడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకీకృతమై అవసరమైన కార్యాచరణ చేపట్టాలని పిలుపునిస్తున్నాము.
జారీచేసినవారు
శ్రీ అరుణ్ కుమార్
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, ఆర్ ఎస్ ఎస్
ఢిల్లీ
3 జులై 2018.