Home News జనాభా గణనలో ప్రత్యేక కోడ్ అంగీకరించవద్దు: కేంద్ర గృహ మంత్రికి వనవాసీ కళ్యాణాశ్రమ్ విజ్ఞప్తి 

జనాభా గణనలో ప్రత్యేక కోడ్ అంగీకరించవద్దు: కేంద్ర గృహ మంత్రికి వనవాసీ కళ్యాణాశ్రమ్ విజ్ఞప్తి 

0
SHARE

ప్రత్యేక మత కోడ్ పై కొందరి అసంబద్ధమైన, అసహజమైన విభజన అజెండాతో, అసామాన్యమైన కోర్కెలకు వ్యతిరేకంగా భారతీయ వనవాసి కళ్యాణాశ్రం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం, అక్టోబర్ 31న మహారాష్ట్రలోని షిరిడీలో కేంద్ర గృహ మంత్రి రాజనాథ్ సింగ్ ను కలిసి తమ వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో పాల్గొన్న వారు కళ్యాణాశ్రమ్ అధ్యక్షులు  శ్రీ జగ్దేవ్ రాం ఓరాన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు కాంత్, ఢిల్లీ ప్రాంత కార్యదర్శి శ్రీ శాంతి స్వరూప్ బన్సాల్, డాక్టర్ దీపక్ లాల్ కుజూర్ మరియు సీనియర్ నాయకులు శ్రీ సురేష్ రావ్  కులకర్ణి పాల్గొన్నారు. వనవాసి కళ్యాణ ఆశ్రమ కార్యకారి మండలి ప్రతినిధి బృందం స్పష్టత కొరకు, సెప్టెంబర్ 29 ,2018న మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన సభలో కేంద్ర హోం మంత్రిని కలిసి తీర్మాన పత్రం కాపీని సమర్పించారు. కొంతమంది వ్యక్తులు, ప్రత్యేక మత కోడ్ పై అవాస్తవిక, అసంబద్ధమైన విషయాలను లేవనెత్తితే పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అటువంటివి ఈ కోరిక దేశానికి, గిరిజనులకు ఆమోదయోగ్యమైనది కావు అని, కొంతమంది స్వార్థపరుల కారణంగా ఈ డిమాండ్ లేవనెత్తబడింది అని తెలిపారు. ఎంతో కాలంగా మతమార్పిడిలో పాలుపంచుకున్న జాతి వ్యతిరేక శక్తులు గిరిజనులకు మతము లేదని ప్రచారం చేశారు. వారి యొక్క తప్పుడు ప్రచారం కప్పి పెట్టేందుకు ఇవన్నీ వారు చేసే ప్రయత్నాలు

“ఈ జనజాతి మొత్తం తమను హిందువులుగా జనగణనలో నమోదు చేయించుకుని భవిష్యత్తులో యధాతధంగా కొనసాగుతారు” అని కళ్యాణ ఆశ్రమ ప్రధాన కార్యదర్శి హోం మంత్రి తో విన్నవించారు.హోంమంత్రి ప్రతినిధి చెప్పిన విషయాలను శ్రద్ధగా విని, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. శ్రీ విష్ణు కాంత్ దీని పర్యవసానం గురించి మాట్లాడుతూ, “అక్టోబర్ 30, 31న ఒక మెమొరాండంను యూనియన్ గిరిజన వ్యవహారాల మంత్రి మరియు గిరిజన సంక్షేమ కమిషనర్ అయిన శ్రీ జుయల్ ఓరకు అందజేశారు.  జాతీయ జనగణన కమిషనర్ కి కూడా త్వరలో ఒక ప్రతిని అందజేయనున్నారు. అఖిల భారతీయ వనవాసి కళ్యాణాశ్రమ్ కార్యకారి మండలి తమ తీర్మాన ప్రతిని   సెప్టెంబర్ 29 , 2018 న షిరిడీలో సమర్పించిoది. ప్రత్యేక జనగణన కోడ్ అనే డమాండ్ కేవలం తప్పుదోవ పట్టించడానికేి కానీ తార్కికమైనది కాదని అని తెలిపింది” అన్నారు.
జనగణనలో భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దీనికి సంబంధించిన రుజువులు ఋగ్వేదంలోను, కౌటిల్యుని అర్థశాస్త్రంలోను, ఆయన్-లీ- అక్ బార్ మొదలైన సమకాలీన గ్రంథములలో ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న జనగణన పద్ధతి ఏకకాలంలో దేశం మొత్తం పది సంవత్సరముల వ్యవధిలో 1881లో ప్రారంభించారు. ఈ పని బ్రిటీష్ ఇండియా  యొక్క  గృహ మంత్రి, సర్క్యులర్ నెంబర్ 2, జూలై 1856 లో  ప్రారంభించారు. దీనికి ఎటువంటి చట్టాలు లేవు. స్వతంత్రం తరువాత 1948లో జనగణన చట్టం అమలులోకి వచ్చింది. స్వతంత్రం తరువాత దేశం యొక్క ఏడవ జనగణన మొదటిసారి 1951లో నిర్వహించబడింది .ఈ చట్టం కింద తదుపరి  జనాభా గణన జరుగుతోంది. ఏదైనా  సార్వభౌమ, ప్రజాస్వామ్య మరియు సంక్షేమ రాజ్యం జనగణన చేసినప్పుడు ఆ పౌరుడు యొక్క ఆరోగ్యం, చదువు, సామాజిక ,ఆర్థిక స్థితిగతులు లెక్కించి, వారి అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తారు.

జనగణనలో సేకరించిన వివరములు అంతర్గత భద్రతపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి మరియు విశ్లేషించడానికి ఉపయోగిస్తారు .మరియు దేశం యొక్క భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటారు. గత రెండు మూడు జనగణనలనుండి చాలా కొద్ది మంది గిరిజనులు మాత్రమే, ప్రత్యేక మత కోడ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులు కాకపోయినప్పటికీ కొంతమంది స్వార్థపూరితమైన శక్తులు బయట నుంచి కొమ్ముకాస్తున్నాయి. ఆ దృష్ట శక్తులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతకంటే ముందు  “మత కోడ్ ‘అంటే ఏమిటో తెలుసుకోవాలి.జనగణన సమయంలో పరిగణకులు ఇల్లిల్లూ తిరిగి ,ఆ ఇంట్లో ఉన్న స్త్రీ పురుషుల సంఖ్య , వారి వయసు ,పిల్లలు, వారి విద్యా వివరములు, మరుగుదొడ్లు, టీవీ, ఫోను మొదలైనటువంటి సౌకర్యము లకు సంబంధించిన విషయములను సేకరిస్తారు.  పరిగణకులకు ఈ విషయ సేకరణ తప్పనిసరి. ఒకవేళ వారు ఎస్టీ ,ఎస్సీ కి చెందిన వారైతే, పరిగణకుడు ముందు తాను సేకరించిన వివరములతో సరిపోల్చుకుని, సంతృప్తి చెందుతాడు. ఆ వ్యక్తి ఏమతమునకు చెందిన వాడో, ఏది చెబితే అది రాసుకోవలసిన వాడు పరి గణకుడు. చివరిగా జాతీయస్థాయిలో మతానికి సంబంధించి ప్రచురించిన సమాచారం 8 వర్గాలుగా వర్గీకరించబడుతుంది .వీటిని మతం కోడ్ అంటారు. అవి హిందూ  ,ముస్లిం, క్రిస్టియన్, సిక్స్,బుద్దిస్ట్ ,జైన్ , ఓ ఆర్ పి , మరియు ఆర్ఎన్ఎస్ అనగా తమ మతమును ధ్రువీకరించని వారు. 1881 నుంచి 1941 జన గణన వివరాల ద్వారా తెలియుచున్నది ఏమిటంటే 90 నుంచి 95 శాతం మంది గిరిజనులు తమను హిందువులుగా పేర్కొన్నారు. ఎస్టీ లోని నాలుగు శాతం మంది నార్త్ ఈస్ట్ రీజన్ కు చెందిన వారు, తమ మతము లను ఈ క్రింది విధముగా పొందుపరిచారు. సెంగ్ఖాసి, రంగ్ఫ్ర, డొన్యిపోలో/సయి డొన్యిపోలో, బాతో  మొదలైనవి.

కొంతమంది ఎస్టీలు తమని బుధ్ధిస్టులు గా పేర్కొన్నారు. కేవలం 1 నుంచి 2 శాతం మాత్రమే ఎస్టీలు క్రైస్తవ మతంలోకి చేరారు. షెడ్యూల్డ్ ట్రైబ్ అనే నామం మొట్టమొదట 1950లో కొత్త రాజ్యాంగ సవరణలో ప్రస్తావించబడింది. కాని బ్రిటీష్ ప్రభుత్వం వారికి ప్రత్యేక గుర్తింపు లో భాగంగా విశ్వాసపాత్రులు, ప్రకృతిని ఆరాధించే వారు, తెగలు, నేరతెగలు మొదలగు విధములుగా విభజించి, వారిని సమాజం నుంచి వేరు చేయాలని భావించింది. కానీ ఆ మార్గంలో విఫలమయ్యారు. 2011 జనాభా గణన ప్రకారం సుమారు 10.5 కోట్లలో 80 శాతం ఎస్.టి.లు తమను హిందువులుగా నమోదు చేసుకున్నారు. 10 శాతం మంది క్రైస్తవులు గాను, 7.3 శాతం మంది ఓ ఆర్ పి లు గాను 1.5 శాతం మంది ముస్లింలు గాను, 0.75 శాతం మంది బౌద్ధులు గాను నమోదు చేసుకోగా 0.17 శాతం మంది మతమునకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు.

ఏకత్వంలో భిన్నత్వం అనేది మన ప్రత్యేకత. ఒక గ్రామంలోని పది మంది తమ ప్రత్యేక మతమును గూర్చి తెలియజేస్తే, గ్రామంలోను, తాలూకాలోను, రాష్ట్రంలోనూ గల జనగణన రిజిస్టర్ లో పొందుపరచ బడుతుంది. ఇది దేశంలోని ప్రతి ఒక్కరికి, ప్రతి రాష్ట్రంలోనూ, సమాజంలోనూ సూచింపబడుతుంది. 5 నుంచి 7 వేల మంది గిరిజన తెగలకు చెందిన వారికి ,ఒకే మత కోడ్ అమలు చేయడం సరి అయినదేనా? ఇదే గిరిజనులలో కొంతమంది వేరే వర్గ స్తులు ఉదాహరణకు సింగ్ ఖాసి డోసిఫోలో,బాతో అనే వర్గంలో వారు ఈ కోరికను సమర్థిస్తారా? క్రిస్టియన్ మరియు ముస్లిం మతంలోకి మారిన కొంత మంది గిరిజనులు తమని సర్ నా, గోండి,బీలీీ, సంతాలీ మొదలైన  గిరిజన మతాలుగా చిత్రీకరించడాన్ని ఆమోదిస్తారా? వారు ఆ విధమైన కోర్కెను అంగీకరించనపుడు, 80% గిరిజన తెగకు చెందిన హిందువులు ఎందుకు ఆమోదిస్తారు?

ఈ విధమైన కోరిక కేవలం అజ్ఞానంతో కూడినదే కాదు చాలా చికాకు కలిగించేది, న్యాయబద్ధమైనది కాదు మరియు అసంబద్ధమైనది. ప్రతి వ్యక్తి తన నమ్మకాన్ని అనుసరించి తన మతాన్ని పొందుపరుస్తాడు. ఈ హక్కును జన గణ విభాగం కానీ,  ప్రభుత్వము కానీ లాక్కో లేదు. ప్రస్తుతం 110 విశ్వాసపాత్రులు గిరిజనులను అనుసరిస్తున్నారు . వారందరికీ ఒక్కొక్క మత కోడ్ కేటాయించడం సాధ్యమేనా? కావున ఇది అవాస్తవము. గిరిజన జాతులు తెగలు అనేవి రాజ్యాంగబద్ధమైన పదములు. వారిని లెక్కించి ,పట్టిక తయారు చేసి,వేరుగా ముద్రించారు .ఒకవేళ గిరిజనులందరికీ ఓకే మత కోడ్ కేటాయిస్తే జనగణనలో వారి మతాలను లెక్కించడం వల్ల ఉపయోగం ఏమిటి?

ఎవరైనా తమని హిందువులుగా పేర్కొనబడి ఉంటే ,ఆ వ్యక్తి ఎస్టీ గా ఉండడానికి అర్హుడు కాదని, అతను పొందే రిజర్వేషన్ ప్రయోజనాలని కోల్పోతాడని ప్రచారం చేయబడింది. ఎస్టీ తెగకు చెందిన ఏ వ్యక్తి అయినా క్రిస్టియన్ గా మతం మారితే ఎస్టీ గానే కొనసాగుతాడు. అయినప్పటికీ కేరళ రాష్ట్రము వర్సెస్ చంద్రమోహన్ మరియు జయంతియ హిల్స్ అటానమస్ కౌన్సిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? అలాంటప్పుడు హిందువులుగా నమోదు చేయించుకొన్న వారి స్థానం ఎలా రద్దు చేయబడుతుంది ? సనాతన హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య తగ్గించేందుకు ,కుట్ర పద్ధతిలో జాతి మత మార్పిడుల లో పాలు పంచుకున్న మూకలు కొన్ని ఈ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.  ఓఆర్పిల సంఖ్య పెంచడానికి ఎస్టీలను వేరు చేసే ప్రయత్నం చేయడం వల్ల వారు బలహీనమైతే భవిష్యత్తులో మతమార్పిడి సులభతరమవుతుంది. ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ఏజెన్సీలో గత 50 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాయి.

పైన చెప్పినవిషయాలను దృష్టిలో పెట్టుకుని అఖిల భారతీయ వనవాసి కళ్యాణాశ్రమ్ కార్యకారి మండలి గిరిజనులను ఈ కుట్ర గురించి  హెచ్చరించారు. తదుపరి, కార్యకారి మండలి గిరిజన తెగల వారందరినీ పిలిచి, ఎవరి తాత ముత్తాతలు హిందువులుగా నమోదు చేసుకున్నారో, ఎవరు తమను హిందువులు గానమోదు చేసుకున్నారోవారు భవిష్యత్తులో జనగణన జాబితాలో హిందువుగానే నమోదు చేసుకోవాలని తెలిపారు. గిరిజన తెగలకు చెందిన కొంతమంది నిబద్ధత లేని వ్యక్తులు లేవనెత్తిన అసంబద్ధమైన, చట్టబద్ధంకాని ఈ డిమాండ్ ను పట్టించుకోనవసరం లేదని వనవాసి కళ్యాణాశ్రమ్ కార్యకారి మండలి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. వారి డిమాండు వారి తెగకు చెందిన వారకే ఆసక్తి లేదని కూడా తెలిపారు. గిరిజనుల యొక్క, దేశం యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ వివాదం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

Source: Organiser
అనువాదం: శ్రీమతి అన్నపూర్ణ పప్పు