ఆర్ఎస్ఎస్ గురించి పలు న్యాయస్థానాలు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు:
1. “ఏ తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగిని కూడా, ఆ వ్యక్తి ఆర్ఎస్ఎస్ సభ్యుడనే కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించరాదు”
– కృష్ణలాల్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు(1955)
2. “ఆర్ఎస్ఎస్ సభలో ఇచ్చిన ఉపన్యాసం, `భారతీయ శిక్షా స్మ్రితి’ సెక్షన్ 153 కింద నేరంగా పరిగణిoచబడదు”.
– 1961 ఎం.ఎస్. గోల్వాల్కర్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో పాట్నా హైకోర్టు తీర్పు.
– 1964 కేదార్ లాల్ అగ్రవాల్ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం మరియు ఇతరుల కేసులో జోధపుర్ (రాజస్థాన్) ఉన్నత న్యాయస్థానం తీర్పు.
6. “ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గోవడాన్ని ‘ప్రమాదకరమైన చర్య’ అనలేము, అది చట్ట విరుద్ధం కూడా కాదు. ఈ కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడం కుదరదు”
– 1965 మనోహర్ అమ్బేకర్ వర్సెస్ భారత ప్రభుత్వం మరియు ఇతరుల కేసులో పంజాబ్ ఉన్నత న్యాయస్థానం.
– 1967 రామఫల్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం మరియు ఇతరుల కేసులో చండీగఢ్ లోని పంజాబ్ & హర్యానా ఉన్నత న్యాయస్థానం తీర్పు.
9. “ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గోవడo అనే కారణాల వల్ల, ఏ ఉద్యోగి పదవీ కాలం రద్దు చేయడం కుదరదు’. వేరే కారణాలు చూపించి ఇటువంటి ఉద్దేశంతో జారీ చేసినా ఏ ఆదేశాలు చెల్లవు”
– 1973 భరత్ ప్రసాద్ త్రిపాఠీ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇతరుల కేసులో జబల్పూర్ లోని మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పు
– 1971 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ మరియు ఇతరులు వర్సెస్ రేవత్ ప్రకాష్ పాండే కేసులో ఉత్తరప్రదేశ్ హైకోర్టు తీర్పు.
11. “ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ ఉద్యమమని ఎక్కడా నిర్దారితమవలేదు. ఈ కారణం వల్ల ప్రభుత్వ ఉద్యోగులని పదవి నుంచి తొలగించడానికి వీలు లేదు”
– 1970 డిబి. గోహెల్ వర్సెస్ భావనగర్ జిల్లా న్యాయమూర్తి మరియు ఇతరుల కేసులో అహ్మదాబాద్ హైకోర్టు తీర్పు.
– 1981 టి.బి. ఆనందన్ మరియు ఇతరులు వర్సెస్ కేరళ రాష్ట్రం మరియు ఇతరుల కేసులో ఎర్నాకులంలోని కేరళ ఉన్నత న్యాయస్థానం తీర్పు.
13. “ఆర్ఎస్ఎస్ సభ్యత్వం కారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో నియామకాన్ని నిరాకరించడం ఎంత మాత్రం చెల్లదు”
– 1982 శ్రీమతి త్యాద్దమ్కర్ వర్సెస్ ముఖ్య అధికారి, కేరళ టేలికమ్ విభాగం కేసులో ఎర్నాకులంలోని కేరళ ఉన్నత న్యాయస్థానం తీర్పు.