Home News శబరిమల కేసులో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేరళ హైకోర్టు 

శబరిమల కేసులో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేరళ హైకోర్టు 

0
SHARE
గత కొంతకాలంగా కొనసాగుతున్న శబరిమల వివాదంలో కేరళ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పవిత్ర క్షేత్రంలో అయ్యప్ప భక్తులపై పోలీసులు చేపడుతున్న దాడులపై సమీక్ష కోసం హైకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అదే విధంగా శబరిమలలో సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపింది.
శబరిమలలో నిరసనలకు అనుమతి లేనప్పటికీ అయ్యప్ప భక్తుల శాంతియుత ప్రదర్శనల పట్ల పోలీసులు ఆచితూచి స్పందించాల్సి ఉంటే బాగుండేదని హైకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా నతప్పందాల్ ప్రాంతంలో మాహిళా భక్తులు, చిన్నారులు సేదతీర్చుకోవడాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా భక్తుల శరణు మంత్రాల పఠనం మీద పోలీసులు ఆంక్షలు విధించడాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా ఆలయంలోకి ప్రవేశించాలనుకునే యుక్తవయసు మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏం ఏర్పాట్లు చేస్తోందో తెలియజేస్తూ తమకు ఒక సీల్డు కవరులో వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆలయాన్ని దర్శించాలనుకునే యుక్తవయసు మహిళలలకు  భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి తెలిపారు.
భక్తుల శరణు మంత్ర జపం సెక్షన్ 144 ఉల్లంఘన కిందకి రాదంటూ ప్రభుత్వమే అఫిడవిట్లో పేర్కొనగా పోలీసులు మంత్ర జపం చేస్తున్న భక్తులను ఎలా నిరువరిస్తారంటూ కేరళ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భక్తులు “స్వామియే శరణం అయ్యప్ప” అని కాకుండా “స్వామీ.. యుక్తవయసు మహిళలను ఆలయప్రవేశం కల్పించవద్దు” అని ఏమైనా నినాదాలు చేసి సుప్రీం కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారా?అని కూడా ప్రశ్నించడం గమనార్హం.
హైకోర్టు సింగిల్ జడ్జి అంటే కూడా పోలీసులకు లక్ష్యం లేకుండా పోతోంది. అసలు తామే ఈ కేసును సుమోటోగా తీసుకోవాలనుకున్నాం. కానీ పోలీసు అధికారులు కన్నీటితో వేడుకున్నందున విరమించుకున్నాం. పోలీసులు కోర్టుల ఉదాసీనతను అలుసుగా తీసుకోరాదు అని హెచ్చరించింది.
ప్రభుత్వం పోలీసులకు జారీ చేసిన నోటీసుల అంశాన్ని తమ అఫిడవిట్లో ఎందుకు ప్రస్తావించలేదు అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు పాదరక్షలతో పవిత్ర 18 మెట్ల మీదకు వెళ్లడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న ఆదేశాలు అడ్వకేట్ జనరల్ కి తెలియకుండా ఎలా ఉంటాయి అని ప్రశ్నించింది. భక్తులకు సరియైన వసతి, భోజనం, మరుగుదొడ్ల సదుపాయం కల్పించలేదన్న విషయాన్నీ కోర్టు గమనించినట్టు తెల్పింది.
మొత్తంగా శబరిమలలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల నిబంధనలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేసింది. కేరళ  రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా తమ బస్సు సర్వీసులను నిరంతరాయంగా నిర్వహించట్లేదన్న విషయాన్నీ కోర్టు గమనించినట్టు తెలియజేసింది.
ఈ పరిస్థితుల దృష్ట్యా దీనిపై జస్టిస్ శ్రీజగన్, జస్టిస్ పీఆర్ రామన్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ (పోలీస్) హేమచంద్రన్ లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.
Source: Organiser