Home News కాశ్మీర్ లేని  భారత మ్యాప్ ప్రదర్శించిన కేరళ సీపీఎం పార్టీ 

కాశ్మీర్ లేని  భారత మ్యాప్ ప్రదర్శించిన కేరళ సీపీఎం పార్టీ 

0
SHARE
కమ్యూనిస్టులు తమ జాతి వ్యతిరేక విధానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. కేరళలోని పాలక్కా డులో సీపీఎం పార్టీ ముద్రించిన పోస్టర్లలో  కాశ్మీర్ లేని భారత మ్యాప్ ప్రదర్శించారు. శబరిమలపై తమ పార్టీ వైఖరి చాటిచెప్పేందుకు చేపట్టిన ‘జనమున్నెట్ట యాత్ర” (ప్రజా ఉద్యమ యాత్ర) పేరిట జరిగిన ఈ ర్యాలీలో సీపీఎం పార్టీ హోర్డింగులు ఏర్పాటు చేసి ఈ మ్యాప్ లను ప్రదర్శించింది. కేరళలో జాతీయ రహదారులపై హోర్డింగులు ఏర్పాటుపై హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి. కోర్ట్ ఆ ఆంక్షలు విధించిన రోజు నుంచే వాటిని అతిక్రమిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఇలాంటి పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటుచేస్తోంది.  దీనిపై ఆ ప్రాంతపు బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలియజేశారు.
ఇదిలా ఉండగా చైనా దేశపు జాతీయ టెలివిజన్ నెట్వర్క్ సీజీటీఎన్ ప్రసారం చేసిన కార్యక్రమంలో మాత్రం జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని (పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా) భారతదేశంలో అంతర్భాగంగానే చూపెట్టడం గమనార్హం. శుక్రవారం పాకిస్థాన్ లోని చైనా కాన్సులేట్ కార్యాలయంపై జరిగిన దాడి గురించి ప్రసారం చేసిన వార్తలో ఈ మ్యాప్ చూపించారు.  దశాబ్దాలుగా కాశ్మీర్ అంశంలో భారతదేశం చేస్తున్న డిమాండుకు అనుగుణంగా ఈ చర్య ఉండటం యాదృచ్చికమా లేక వ్యూహాత్మకమా అనేది తెలియాల్సి ఉంది.
Source: Organiser