Home News ద్వంద్వ నీతి, హింస.. ఇవే భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రేరణలు – జస్టిస్ ఎల్. నరసింహ...

ద్వంద్వ నీతి, హింస.. ఇవే భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రేరణలు – జస్టిస్ ఎల్. నరసింహ రెడ్డి

0
SHARE
కాలానుగుణమైన మార్పులను నిరాకరిస్తుండటం కారణంగా కమ్యూనిజం  మానవాళి ప్రగతికి ఏ విధంగానూ దోహదపడలేకపోతోందని  సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ‘డినయింగ్ నేషనల్ రూట్స్: ఎర్లీ కమ్యూనిజం అండ్ ఇండియా” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నరసింహారెడ్డి ప్రసంగించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యులు శ్రీ  గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కమ్యునిజంలోని పరస్పర విరుద్ధ భావనల గురించి ఈ పుస్తకం వివరిస్తుందని తెలియజేశారు. విశ్వా విద్యాలయాలలో కమ్యూనిస్టల ఆధిపత్యం వలన భారతదేశ చరిత్ర ను వెలుగులోకి రాకుండా చేసి దేశ భక్తి జాతీయత అనే అంశాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.

విశ్వవిద్యాలయాలలో కమ్యూనిస్టల ఆధిపత్యం వలన భారతదేశ చరిత్రను వెలుగులోకి రాకుండా చేసి దేశ భక్తి జాతీయత అనే అంశాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
డాక్టర్ రాహుల్ శాస్త్రి గారు వ్రాసిన ‘డినయింగ్ నేషనల్ రూట్స్: ఎర్లీ కమ్యూనిజం అండ్ ఇండియా” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నరసింహారెడ్డి ప్రసంగించారు. ఆవిష్కరణ 12 జనవరి, 2019 కాచిగూడలోని బద్రుకా కాలేజ్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు.
పుస్తక రచయిత డాక్టర్ రాహుల్ శాస్త్రి  గారు మాట్లాడుతూ దేశ స్వతంత్ర  పోరాటం జరుగుతున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ నాయకులూ అయిన గాంధీ , నెహ్రు లను కమ్యూనిజం వైపు తిప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేసిన సంఘటనలను  ఈ పుస్తకంలో వివరిస్తూ దేశంలో కమ్యూనిస్ట్ పుట్టు పూర్వాత్తరాల గురుంచి ప్రస్తావించారు.