Home News సంస్కృత భాష పై ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం

సంస్కృత భాష పై ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం

0
SHARE

సంస్కృత భాష గురించి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ Dr మోహన్ భాగవత్ – మన సమగ్ర పరంపరాగత జ్ఞానమంతా కూడా సంస్కృత వాఙ్మయంలోనే ఉంది. అందుకని మనం సంస్కృతం నేర్చుకుందాం. మన పిల్లలు కూడా నేర్పుదాం. ఎందుకంటే మనది ఒక గొప్ప భాష. శ్రేష్ఠమైన భాష. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతమేనని అంటున్నారు. ఈ గౌరవం పెరిగితే అప్పుడు సమాజంలో దాని వాడుక పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ విద్యాలయాలు తెరుచుకుంటాయి. బోధించే అధ్యాపకులూ పెరుగుతారు. అప్పుడు ప్రభుత్వ విధానాలపై ప్రజల ప్రభావం పడుతుంది. ఈ పని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది మనము చెయ్యకుండా వేరే ఎవరైనా చేస్తారేమోనని ఎదురుచూస్తే అది జరిగే పని కాదు.