Home News రామలింగం హత్యకేసు: తమిళనాడు పీఎఫ్ఐ కార్యకర్తల స్థావరాలపై ఎన్.ఐ.ఏ దాడులు

రామలింగం హత్యకేసు: తమిళనాడు పీఎఫ్ఐ కార్యకర్తల స్థావరాలపై ఎన్.ఐ.ఏ దాడులు

0
SHARE

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని రామలింగం హత్యకేసు విచారణ సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ 20 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది.

తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుభువనానికి చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ రామలింగం తమ ప్రాంతంలో జరుగుతున్న ఇస్లామిక్ మతమార్పిళ్లను అడ్డుకునే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇస్లామిక్ జిహాదీ మూకల చేతిలో హత్యగావింపబడ్డాడు. ఈ హత్య వెనుక ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు ప్రధాన ఆరోపణ.

కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ రామలింగం హత్యకేసు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే ఇండియా టుడే కధనం ప్రకారం తంజావూరులో పాటు తమిళనాడు వ్యాప్తంగా 20 పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తల స్థావరాలపై దాడులు జరిపింది. అంతేకాకుండా తిరువిడైమరుతూర్ పోలీసులతో పాటు రామలింగం కుటుంబ సభ్యుల నుండి కూడా వివరాలు సేకరిస్తోంది.
ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో దాదాపు 11 మందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.
మరింత సమాచారం: