Home Hyderabad Mukti Sangram ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు (భాగం-1)

ముగిసిన నిజాం నిరంకుశ పాలన – పొడిచిన తెలంగాణా కొత్తపొద్దు (భాగం-1)

0
SHARE

17 సెప్టెంబర్ , 1948 హైదరాబాద్ విమోచన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం

హైదరాబాద్ సంస్థానాన్ని తన సొంత జాగీరుగా భావించిన నిజాం తెలంగాణా ప్రజలపట్ల చూపిన నిరంకుశత్వం, రజాకర్ ల ద్వారా చేయించిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. 15 ఆగస్ట్, 1947న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణా ప్రాంతం మాత్రం 17 సెప్టెంబర్, 1948నే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తమై స్వతంత్ర భారత రాజ్యంలో విలీనమైంది. ఈ విమోచన పోరాటం సుదీర్ఘమైనది. తెలంగాణా ప్రజానీకం అంతా తప్పక తెలుసుకోవలసింది.

“ఆజాద్ హైద్రాబాద్‌” నినాదం మారుమ్రోగుతోంది. అక్కడక్కడ నిజాం సంస్థానానికి చెందిన అసఫియా పతాకం గర్వంగా ఎగురుతోంది. ఖాన్‌సాబ్ రజాకార్ల ముఠాలకు సంబంధించిన సైనికులు నినాదాలు చేస్తూ సగర్వంగా ధ్వజానికి వందనాలు సమర్పిస్తున్నారు. “షాహె ఉస్మాన్ జిందాబాద్, ఆజాద్ హైద్రాబాద్ జిందాబాద్, కాయదెమిల్లత్ జిందాబాద్‌” అనే నినాదాలు సరిగ్గా 1947 ఆగస్టు 15 నాడే హైద్రాబాద్‌లో ప్రతిధ్వనిస్తున్నాయి. హైద్రాబాద్ సంస్థానానికి చెందిన పాలకవర్గ మహమ్మదీయులు కోలాహలంగా తమ స్వతంత్ర హైద్రాబాద్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు.

హిందువులకు “ఆజాద్ హైద్రాబాద్‌” అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసు. స్వతంత్ర ప్రతిపత్తి అనగానే హిందువుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లినదనే అర్థం, శాశ్వతంగా ఆత్మాభిమానం మట్టిలో కలిసి పోతుందని భయం. ఆ రోజు భారతావని నాలుగు చెరగులా స్వతంత్ర భారత త్రివర్ణ పతాకం భారతీయులలో నూతనోత్తేజాన్ని ప్రస్ఫుటిస్తూ స్వేచ్ఛగా అడుగిడుతోంది. కాని ఆ భారతదేశంలో భూభాగమైన హైద్రాబాద్‌లో హిందువులు బానిస శృంఖలాలలో మగ్గుతున్నారు.

హిందువులు అధికసంఖ్యలో ఉన్నా వారికి సాధారణమైన ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేశాడు. హైద్రాబాద్‌ను సార్వభౌమాధికారాలు గల ఇస్లాం రాజ్యంగా రూపొందించాలని ప్రయత్నించాడు. లార్డ్ రీడింగ్ హయాంలోనే నిజాం “విశ్వాసపాత్రుడైన మిత్రుడుగా” పరిగణన పొందాడు. ఆ నమ్మకంతోనే స్వతంత్ర ప్రతిపత్తి రాగాన్ని ఆలాపించటం మొదలు పెట్టాడు. కాని బ్రిటీషు ప్రభుత్వం చాకచక్యంగా తన ఉద్యోగులను కీలకస్థానాల్లో నియమించి నిజాం కలలను వమ్ముచేసింది.

ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో హైద్రాబాద్ పరతంత్ర ప్రజలు స్వేచ్ఛకోసం ఆందోళన ప్రారంభించారు. నిజాం దమన నీతిని చేపట్టి నిరంకుశంగా పాలనా యంత్రాంగాన్ని బిగించాడు. తనకు సహాయంగా “ఇత్తెహాదుల్ ముసల్మీన్‌” అనే మతసంస్థనొక దానిని సంపాదించాడు. మహమ్మదీయులు పాలకులని, హిందువులు పాలితులని నిజాం తమ సత్తాకు ప్రతీక అని ఆ సంస్థ ప్రచారం సాగించింది. ఈ మత సంస్థ రజాకార్లనే సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. సంస్థానంలోకి ఇతర ప్రాంతాలలో మహమ్మదీయులను రప్పించి సంఖ్యను పెంచుకుంటూ పోయాడు

సిడ్నీ కాటన్ వంటి విదేశీయుల సహాయంతో ఆయుధాలు సేకరించడం మొదలయింది. రహస్యంగా విమానాల ద్వారా ఆయుధాలు హైద్రాబాద్ చేరుతున్నాయి. హైద్రాబాద్‌లో కార్మాగారాలను ఆయుధాల ఫ్యాక్టరీలుగా మార్చివేశారు.  నిజాం తన సైనిక బలాన్ని వృద్ధిచేస్తూ మరొకవైపు భారత ప్రభుత్వంతో సంధి మంతనాలు ఆడుతున్నాడు. హిందువులపై ద్వేషం వెదజల్లుతూ “జిహాద్‌” (మతయుద్ధం) పేరిట అత్యాచారాలు సాగించాడు. రజాకార్లు స్వేచ్ఛగా లూటీలు, మానభంగాలు చేస్తూ భయావహమైన వాతావరణాన్ని సృష్టించారు.

రజాకార్లు తెలంగాణలో అనేక గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న ఆ భయంకర వాతావరణంలో అక్కడక్కడ ప్రజలు ధైర్యాన్ని కూడగట్టుకొని ఎదురుతిరిగారు. ఆ సమయంలోనే నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టడానికి “శాంతి సంఘాలు” అనే వాటిని ఏర్పరిచి హిందువుల కళ్ళు కప్ప ప్రయత్నించింది. జనగామలో ఇలాంటి శాంతిసంఘంలోనే పరిశ్రమల శాఖ సూపర్‌వైజర్ శ్రీ ఎం.ఎన్.రెడ్డి, వ్యవసాయ శాఖ సూపర్‌వైజర్ శ్రీ శఠగోపాచార్యులు ఇద్దరు సభ్యులు ఈ సంఘాలలో హిందువులు కూడా ఉన్నారని నమ్మించడానికి ఈ తతంగం జరుగుతుండేది.అయితే హిందూ సభ్యులు నోరెత్తి రజాకార్లకు వ్యతిరేకంగా ఫిర్యాదుచేస్తే ప్రాణాలతో మిగలడం కష్టం. ఒకసారి శ్రీ శఠగోపాచార్యులు శాంతి సంఘ సమావేశంలో మితిమీరిపోతున్న రజాకార్ల చర్యలను ఖండించారు. మరుసటిరోజు ఆయనను జనగామ దారిలోకి తీసుకెళ్ళి కాల్చి చంపారు. శ్రీ ఎం.ఎన్. రెడ్డి నమ్రతతో ఈ ఆగడం గురించి ఫిర్యాదు చేశారు. కాని ఆయనను కూడా తుపాకీతో కాల్చేస్తామని అధికారులు బెదిరించారు. ఆ రోజుల్లో తిప్పర్తి ప్రాంతంలో ముస్లిం అధికారులు సివిల్ మిలిటరీ అనే భేదభావం లేకుండా ఆయుధాల అభ్యాసం చేస్తుండేవారు. హిందువులకు కాల్పులలో తర్ఫీదు ఇచ్చి హిందువులనే హత్య చేయించేవారు.సజీవ దహనంగ్రామాల్లో “శాంతి సంఘాలు” స్థాపించి ప్రజలకు రక్షణ కల్పిస్తామని నిజాం ప్రచారం చేస్తుండేవాడు. కాని ఆ శాంతిస్థాపన ఎంత భయానకంగా జరుగుతుండేదో శ్రీ ఎం.ఎన్.రెడ్డి ఒక సంఘటన ద్వారా వివరించి చెప్పారు. ఒకరోజు ఆయన కొడకండ్ల రంగాపూర్ మార్గం గుండా వెళుతున్నాడు. ఒకచోట చింతచెట్టుకు అయిదు శవాలు వేలాడుతున్న దృశ్యం కనపడింది. ఆయన వెంటనే దగ్గర్లో ఉన్న గ్రామవాసులను అడిగి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. శవాలు వేలాడుతున్న ప్రాంతం ఇననూర్ పోలీస్ స్టేషన్ సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ అయిదు శవాలు బ్రాహ్మణులవి. అంతకు క్రిందటి రోజే శ్రాద్ధ భోజనం చేసి ఏడుగురు బ్రాహ్మణులు తిరిగి వస్తున్నారు.త్రోవలో శాంతిని సంరక్షిస్తున్న రజాకార్ల ముఠా ఒకటి ఎదరురైంది. ఆ ఏడుగుర్ని పట్టుకున్నారు. ఇద్దరు బ్రాహ్మణులు మాత్రం తప్పించుకొని పారిపోయారు. మిగిలిన ఐదుగురు ప్రభుత్వ ఏజెంట్లని రజాకార్లు నిర్ధారణ చేసికొన్నారు. ఆ ఐదుగుర్నీ వరుసగా చింతచెట్టు కొమ్మకు వేలాడదీశారు. వారి చేతులకి కట్టిన లావలి తాడు కాలకుండా క్రింద మంటలు పెట్టారు. ఆ మంటల్లో కాలి బ్రాహ్మణులు ప్రాణాలు వదిలారు. మిగతా హిందువులకు గుణపాఠంలా ఉండాలని ఆ శవాలను అలాగే వేలాడదీసి రజాకార్లు వెళ్ళిపోయారు. ఆ బ్రాహ్మణులలో ముగ్గురి నడుములకు ఉన్న వెండి మొలత్రాళ్ళు కాలి వంకర్లు పోయాయి. వాళ్ళకు సంభావనగా లభించిన వెండిరూపాయలు బూడిదలో దొరికాయి. ధోవతులు కాలి శవాలు నల్లగా మసిబారి భయంకరంగా కనపడుతున్న ఆ అమానుషమైన దృశ్యం చూసి ప్రజలు వణికిపోయారు.రాక్షస రాజ్యంరజాకార్ల ఈ పైశాచిక కృత్యాలు 1857లో నీల్ చేసిన దురంతాలను మించిపోయాయి. బ్రిటీష్ సైనికాధికారి నీల్ భారతీయుల్ని చెట్లకు వేలాడదీసి ఉరితీసేవాడు. ఫిరంగులకు కట్టి పేల్చేవాడు. కాని ఇలా మంటల్లో కాల్చి భయంకరంగా చంపిన సంఘటనలు లేవు. ఈ రాక్షస కృత్యాలు రజాకార్ల ప్రత్యేకతను నిరూపించాయి. చివరికి రాక్షసులు కూడా ఇలాంటి పనులను ఉహించి చేసేవాళ్ళు కాదేమో! రజాకార్లు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి రాత్రిపూట గ్రామాలపైబడి దోచుకునేవాళ్ళు.ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండేవికావు. ఆడవాళ్ళ ముక్కుపోగులు, చెవుల కమ్మలు లాగి వాళ్ళ ముక్కులు, చెవులు తెగినా లెక్కచేయక దోచుకునేవాళ్ళు. ఆ రక్తసిక్తమైన భూషణాలను మూటలు గట్టి ఎం.ఎన్.రెడ్డి కార్యాలయంలోని టేబుళ్ళ కింద పడవేసేవారు. ఉదయమే అందరూ పంచుకునేవారు. ఈ దోపిడీపట్ల అభ్యంతరం చెప్పినా ప్రయోజనం ఉండేది కాదు. అందువల్ల ఎం.ఎన్.రెడ్డి లాంటి ఉద్యోగులు కుమిలిపోతుండేవారు. హిందువులు ఈ దుష్కృత్యాలను ఖండించినా ప్రభుత్వం తిరుగుబాటు అనే పేరుతో, శాంతిస్థాపన అనే నెపంతో క్రూరంగా హిందువులనే అణచివేస్తుండేది.

1947 ప్రారంభంలో మహమ్మదాలీ జిన్నా హైద్రాబాద్ వచ్చి ఒక పెద్ద సభలో ప్రసంగించాడు. జనాన్ని రెచ్చగొట్టే విధంగా పరుషంగా మాట్లాడాడు. “కోడి మెడలను విరిచినట్లుగా హిందువులను విరిచేస్తాం. ముల్లంగి కాడల్లా త్రుంచివేస్తాం” అని మహా ఉద్రేకంగా మాట్లాడాడు.

‘తెగించిన గూఢచారిసభాస్థలం వేలాది ముస్లిం ప్రజలతో కిక్కిరిసి ఉంది. ఇస్లామియా గీతాలతో, నినాదాలతో వాతావరణం మార్మ్రోగుతోంది. మజ్లిసే ఇత్తెహదుల్ ముసల్మీన్ అధ్యక్షుడు ఖాసిం రజ్వీ వందనం స్వీకరిస్తూ వేదికవైపు వస్తున్నాడు. సాయుధులైన రజాకార్లు రెండవవైపులా ఉన్నారు. “ఆలీజనాబ్ సిద్దికె మిలత్‌”, రజాకార్ల “సాలెరెఅజమ్‌” (సర్వసేనాధిపతి) ఖాసిం రజ్వీ వేదిక ఎక్కగానే జనం నినాదాలు చేశారు. “షాహె ఉస్మాన్ జిందాబాద్, ఆజాద్ హైద్రాబాద్ పాయంబాద్ సిద్దికె మిల్లత్ ఖాసిం రజ్వీ జిందాబాద్‌” అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. ఖాసిం రజ్వీ ఆవేశంతో ఉపన్యసిస్తూ హైద్రాబాద్ సర్వస్వతంత్ర ప్రాంతంగా కొనసాగించాలన్న తమ నిశ్చయాన్ని వ్యక్తం చేశాడు. భారత ప్రభుత్వంతో జరిగిన యథాతథ స్థితి ఒప్పందం గురించి చెబుతూ రెసిడెన్సీ నివాసం ప్రసక్తి తీసుకువచ్చాడు.ఆ భవనంలో అప్పుడు భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా శ్రీ కె.యం. మున్షీ బసచేస్తున్నారు. ఆ భవనం సార్వభౌమాధికారాలకు చిహ్నం కాబట్టి దానిలో మున్షీ ఉండడానికి వీల్లేదని, అతను మకాం మార్చని పక్షంలో రెసిడెన్సీ భవనాన్ని నేలమట్టం చేస్తామని రజ్వీ బెదిరించాడు. ముస్లిం జనం జయ జయ ధ్వానాలతో ఆమోదించింది. ఫలితంగా నిజాం “ప్రభువు” శ్రీ కె.యం. మున్షీని మకాం మార్చవలసిందని ఆదేశించాడు. బొలారంలో నివాసం ఏర్పర్చుకోమని హుకుం జారీ చేశాడు. రెసిడెన్సీ భవనంలో పోలీసు ప్రధాన కార్యాలయం వెలిసింది. ఇది ఒక విధంగా ఖాసి రజ్వీకి రాజకీయమైన విజయం. నిజాం, రజ్వీల ఎత్తుగడలలో ఇది మరొక మెట్టు.పూర్వ చరిత్ర1947 నాటి పరిస్థితి ననుసరించి ఇండియా ప్రభుత్వం ఆనాటి సంస్థానాలకు సౌకర్యాన్ని కలుగచేసింది. భారత్‌లో, పాకిస్తాన్‌లో విలీనం కాదలచుకొనని సంస్థానాలు స్వతంత్రంగా ఉండవచ్చుననే సౌకర్యం అది. ఈ మిషతో నిజాం తన హైద్రాబాద్ సంస్థానాన్ని సర్వ స్వతంత్రంగా నిలుపుకోవాలని పన్నాగం పన్నాడు. కాని నిజాం చరిత్ర మరో చారిత్రక సత్యాన్ని వెల్లడించింది. గతంలో ప్రతి సామ్రాజ్య శక్తి ఎదుట నిజాం రాచరికం మోకరిల్లింది. తొలుత మరాఠా, ఆ తర్వాత ఫ్రెంచి  చివరకు ఇంగ్లీషు వాళ్ళకు నమ్మినబంటుగా వ్యవహరించాడు. ఇంగ్లీషు సామ్రాజ్యం భారతదేశంలో అస్తమిస్తున్నపుడు నిజాం తమను అసహాయులనుగా వదలి వెళ్ళిపోవద్దని ఇంగ్లీషు వాళ్ళను వేడుకొనడం దీనికి పరాకాష్ట.

శీఘ్రగతిని మారిపోతున్న రాజకీయ పరిస్థితులలో నిజాం తన మతం అనే ముసుగులో స్వతంత్రంగా ఉండాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన యొక్క ఇస్లాం మూఢభక్తి, రాచరికమైన కటుత్వం అతనే రచించిన ఈ పద్యపాదాలలో వ్యక్తమవుతుంది.“సలాతీనే సల్ఫ్ సబ్ హోగయే నజరె అజల్ ఉస్మాన్ముసల్మానోంకా తేరీ సల్తనత్ సేహై నిశాన్ బాకీ”(ఇస్లాం సామ్రాజ్యాలు రాజకీయ పరిణామాలకు బలి అయిపోయాయి. కాని ఈనాడు హే ఉస్మాన్! నీ రాజ్యమే ముస్లింలకు గుర్తుగా మిగాలిపోయింది.)“బంద్ నాఖూస్ హువా సున్‌కే నారాఏ తకిబీర్జల్‌జలా ఆహీ గయా రిశ్త ఏ జున్నార్‌పర్‌”(అల్లాహో అక్బర్ ఉద్ఘోషవల్ల శంఖనాదాలు ఆగిపోయాయి. యజ్ఞోపవీతాలు ధరించిన వాళ్ళపై ప్రళయం వచ్చినట్లుంది.)స్వతంత్ర భారత్‌లో విలీనం కావటం తనకు అవమానమని రాచరిక గౌరవానికి భంగకరమని భావించాడు నిజాం. రాజ్యాంగ సలహాల కోసం ప్రత్యేకించి ఇంగ్లండ్ నుండి ప్రఖ్యాత న్యాయవాది మాలకన్‌ను అన్ని ఖర్చులు భరించి పిలిపించాడు. అతనికి ప్రతిరోజూ ఫీజు కింద విడిగా లక్షరూపాయలు చెల్లించాడు. తన పన్నాగానికి ఆధారంగా ముస్లిం ప్రజల్లో ఇస్లాం మతావేశాన్ని రేకెత్తించాడు. తన సంస్థానం చుట్టూ స్వతంత్ర భారత రాష్ట్రాలు ఉండడం  ప్రమాదకరం. కావున తనకు రేవు పట్టణం అవసరం. అందుకు పోర్చుగీసు ప్రభుత్వం నుండి గోవాను ఖరీదు చేయాలనే ఆలోచన కూడా చేశాడు.తన కాంక్షలకు వ్యతిరేకంగా ఉన్న భారత ప్రభుత్వ వైఖరిని నిజాం గ్రహించాడు. తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన భారత సైన్యంతో తలపడటం సాధ్యం కాదు. అందువల్ల కొత్త ప్రయత్నాలు ప్రారంభించాడు.గెరిల్లా పోరాట పద్ధతిలో భారత సైన్యాన్ని ఎదుర్కోవడానికి తన సైనికుల సంఖ్యను పెంచసాగాడు. అవసరమైన ఆయుధాలను విదేశాల నుండి తెప్పించుకోవాలని తన సంస్థానంలోనే మరికొన్ని ఆయుధాలను తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సెకెండ్ ఫ్రంట్‌గా రజాకార్ల దళాన్ని నిర్మించాడు. తన సరిహద్దుల రక్షణకు పఠాన్‌లు ప్రత్యేకించి చేర్చుకున్నాడు. విమానాల ద్వారా రహస్యంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. బీదర్, వరంగల్, రాయచూర్‌లలో విమాన స్థావరాలను పునర్నిర్మించాడు.హైదరాబాద్ సంస్థానంలో హిందువుల సంఖ్యతో సమంగా ముస్లింల జనసంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది ముస్లింలను ఎన్నో ఆశలు చూపించి ఆకర్షించాడు. మతం మార్పిడిని ప్రోత్సహించాడు. హరిజనులకు  సవర్ణులకు మధ్య తగాదాలు సృష్టించి, హరిజనులకు  హిందువులకు మధ్యలో కల్లోలాలను సృష్టించాడు. రజాకార్లు ఇష్టానుసారం దోపిడీలు, గృహదహనాలు, మానభంగాలు చేయడం ప్రారంభించారు. నిజాం తన మంత్రివర్గంలో విశ్వాసపాత్రులైన హిందువులను ఉంచాడు. భారతప్రభుత్వం అనుకూలంగా ఎన్ని సూచనలు చేసినా తిరస్కరించి తన పన్నాగాలు కొనసాగించాడు.ఏజెంట్ జనరల్ఈలోగా భారత ప్రభుత్వం తన ప్రతినిధిగా ఏజెంట్ జనరల్ హోదాలో శ్రీ కె.యం. మున్షీని హైద్రాబాద్ పంపించింది. ఆయనపట్ల నిజాం వ్యవహరించిన తీరు ముందే తెలుసుకున్నాం.

కొంతకాలం తర్వాత హైద్రాబాద్ రియసత్ ప్రధానమంత్రి అయిన లాయక్ ఆలీ చెరియాల ప్రాంత పర్యటనకు వచ్చాడు. ఇమ్మడి రాజిరెడ్డి నాయకత్వాన వెయ్యిమంది గ్రామస్థులు వెళ్ళి రజాకార్ల దాడుల గురించి చెప్పాడు. ఆయన అందరూ కలిసిమెలసి ఉండాలనీ నీతులు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక లాభంలేదని ఆ ప్రాంతాలలో గ్రామీణులు తమ ఆత్మరక్షణకు ఆయుధాలు వగైరా సేకరించటం మొదలుపెట్టారు. భైరవునిపల్లి బురుజుపై వల్లపట్ల రామచంద్రరావు దేశ్‌ముఖ్ నుండి సంపాదించిన ఫిరంగిని పెట్టారు.నాలుగైదు మణుగుల మందుగుండు సామగ్రి తయారుగా ఉండేది. అలాగే గ్రామంలో కంసాలి ఇనుపగుండ్లను తయారుచేసేపని మొదలుపెట్టాడు. బెక్కల్, ధూళిమిట్ట, తోరసాల్, జాలపల్లి, కొండాపూర్, కుటిగల్, సోలిపూర్, అంకుశీపూర్ తదితర గ్రామాలు తమ రక్షణదళాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటన్నింటికి భైరవునిపల్లి కేంద్ర బిందువుగా పనిచూస్తూ వచ్చింది. అందువల్ల ఈ గ్రామంపై రజాకార్లు తమ దృష్టిని కేంద్రీకరించారు. భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హాషిం కూడా భైరవునిపల్లి గ్రామస్థులను తిరుగుబాటుదార్లుగా భావించి దాడిచేయటానికి సిద్ధపడ్డాడు. ఈ గ్రామస్థుల ధైర్యం తనకు సవాలుగా కనిపించింది.ఇక్బాల్ హాషం ఓటమిఈ డిప్యూటీ కలెక్టర్ శాంతిస్థాపన నెపంతో తన పోలీసు బలగంతో గ్రామాలమీద పడ్డాడు. కొడకండ్ల గ్రామంలో దాదాపు నలభై మంది నిర్దోషులను కాల్చి చంపేశాడు. తర్వాత 150 మంది గల తన ముఠాతో భైరవునిపల్లి చేరుకున్నాడు. బురుజుపైనుండి ఈ ముఠాను పసిగట్టిన కాపలాదారులు నగారా మ్రోగించారు. చిన్న ఫిరంగి కాల్పులకు హాషిం ముఠా తట్టుకోలేక పోయింది.

తన ప్రయత్నం విఫలం కాగా హాషిం మరింత కసితో ఆ గ్రామాన్ని నేలమట్టం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విజయవంతమైన తమ పోరాటం వల్ల భైరవునిపల్లి గ్రామస్థుల ధైర్యం మరింత పెరిగింది. రజాకార్ల ముఠాలను నిర్భయంగా ఎదుర్కొనగలమనే ధీమా హెచ్చింది. అయితే నిజాం సైన్యం ముందు తాము నిలువగలమా? అనే అంశాన్ని వాళ్ళు తీవ్రంగా ఆలోచించలేదు. సైన్యం వచ్చి చుట్టుముట్టనున్నదనే వార్త తెలిసినా గ్రామం ఖాళీచేసి అడవుల్లోకి పారిపోవాలనే ఆలోచనే వాళ్ళకు తట్టలేదు. తత్ఫలితంగా భైరవునిపల్లి సర్వనాశనం కాక తప్పలేదు

అప్పటికి బాగా వెలుగు వచ్చేసింది. బురుజుపైన ఇద్దరు యువకులు లేచి నిలబడి చూస్తుండగానే గుండు వచ్చి తగిలింది. మగుటం రామయ్య, భూమయ్య అనే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే కూలిపోయారు. అక్కడి గది వగైరా అంతా కూలి ముఖ్యమైన రక్షణ సామాగ్రి ధ్వంసమైపోయింది. గ్రామస్థులు ఇది రజాకార్ల దాడి కాదనే విషయాన్ని గ్రహించారు.ప్రతిఘటించి ప్రయోజనం లేదని బురుజు పైనుండి తెల్లజెండా చూపారు. అయినా నిజాం సైన్యం ఫిరంగి కాల్పులు జరుపుతూనే వచ్చింది. గ్రామంలో చొచ్చుకొని వస్తున్న సైనికులు అడవి జంతువులలాగా ప్రవర్తించారు. కనబడిన ప్రతి అమాయకుణ్ణి షూట్ చేశారు. ఒకమూల నిలబడి సైనికులు పదిమంది యువకులపైకి చేతిబాంబులువేసి చంపివేశారు. అందులో విశ్వనాథ్ భట్ జోషి తదితరులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నిరపరాధులైన గ్రామస్థులు హత్య చేయబడ్డారు. అందులో అప్పుడే ప్రసవించిన తల్లి కూడా ఉంది. తర్వాత శవాలను గుర్తిస్తున్నపుడు సజీవంగా ఉన్న శిశువు లభించింది. గ్రామంలో ప్రతిఘటనా శక్తి సర్వస్వం నాశనమై పోయింది.నిజాం ప్రభుత్వ అధికారులు, సైనికులు విజయోన్మాదంతో పాశవిక చర్యలకు దిగారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఏదో పెద్ద తిరుగుబాటును అణచివేశామనే గర్వంతో విర్రవీగుతూ భైరవునిపల్లి నేలమట్టం చేశారు. ప్రతి ఇంట్లోకి వెళ్ళి యువకులను ఏరి పశువుల్లా బంధించి తీసుకువచ్చారు. స్త్రీలను బలాత్కరించారు. ఇళ్ళను దోచుకున్నారు. గడ్డివాములను తగులబెట్టారు. మత పిచ్చి ఎక్కి దుష్కృత్యాలు జరిపిన గూండాలకు ఈ నిజాం ప్రభుత్వం అధికారులకు మధ్య తేడాలేదు అనిపించింది.ఊరు అవతలికి 92 మంది యువకులను పట్టి తెచ్చి నిలబెట్టారు. వాళ్ళలో ఇద్దరు ముసలివాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు తమ షూటింగ్ నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమై నిల్చున్నారు. త్రీనాట్ త్రీ రైఫిల్‌తో వరుసగా ఒకేసారి ఒకే గుండుతో ఎంతమందిని చంపవచ్చునో అంచనా వేసుకున్నారు. నాలుగు వరుసలలో ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టారు. కట్టివేయబడిన యువకులు బలిపశువుల్లా నిలుచున్నారు. మొదట ఒక సైనికాధికారి కాల్పులు జరిపాడు.ఒకేగుండు వరుసగా నలుగురి శరీరాల గుండా దూసుకుపోయి మరోవైపు వెళ్ళింది. ఫలితంగా ఆ నలుగురు యువకులు నేలకూలిపోయారు. రెండోసారి ఒక పోలీసు అధికారి ఫైరింగ్ చేయగా ముగ్గురు చనిపోయారు. ఇక సివిల్ అధికారులు తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి ముందుకు వచ్చారు. భువనగిరి డిప్యూటి కలెక్టర్ హాషిం కసితో ఎనిమిదిమందిని కాల్చి చంపాడు. ఇద్దరు ముసలివాళ్ళను వదలి దాదాపు అందరినీ స్టెన్‌గన్‌తో కాల్చి హత్య చేశారు.  ఈ దారుణ హత్యాకాండలో రజాకార్ల సర్వసైన్యాధికారియైన ఖాసిం రజ్వీ ముఖ్య అనుచరుడైన మొహజ్జిం హుస్సేన్ (నల్గొండ) అత్యధికమైన భాగాన్ని పంచుకున్నాడు.తర్వాత గ్రామంలో హరిజనులను పిలిచి 90 మంది శవాలను నిరుపయోగంగా ఉన్న ఒక బావిలో పడవేయించి సామూహిక సమాధి చేశారు. గ్రామంలో చచ్చిన జనం ఈ లెక్కలోకి రాలేదు. 11 గంటల ప్రాంతంలో ఈ సైన్యం కుటిగల్ గ్రామం గుండా తిరుగు ప్రయాణం సాగించింది. ఆ గ్రామంలో పట్వారీ నరసింహారావుతో సహా 25 మందిని హత్య చేశారు.

This article was first published in 2019..