Home News పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ కుటుంబం దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ కుటుంబం దారుణ హత్య

0
SHARE

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో అక్టోబర్ 8 విజయదశమి రోజున బంధు ప్రకాష్ పాల్ (35), అతని భార్య బ్యూటీ మండల్ పాల్ (30),  వారి కుమారుడు బంధు అంగన్ పాల్(8) ను వారి ఇంటిలోనే గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సహపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బంధూ ప్రకాష్ ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.  

బంధు ప్రకాష్ తన కుటుంబంతో కలిసి ముర్షిదాబాద్ లోని జియాగంజ్ ప్రాంతంలోని లాబుట్లాలో దాదాపు ఐదేళ్ళుగా నివసిస్తున్నాడు. ప్రత్యక్ష సాక్షుల చెప్పిన దాని ప్రకారం, విజయదశమి రోజున ప్రకాష్  ఉదయం పది గంటలకు మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ఇంటి నుండి పదకొండు గంటలకు పెద్ద, పెద్ద అరుపులు వినిపించాయి. ఇరుగుపొరుగు వారు అక్కడకు  చేరుకునేలోపే  ఒక యువకుడు ఇంటి నుండి బయటకు పరుగెత్తాడు, ఇంటి లోపల దృశ్యం చూసిన చాలా మంది దిగ్భ్రాంతికి గురి అయ్యారు. వారి గొంతులు  కోయడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. చూసినవారికి నిపుణులైన వారు చేసినపని అనిపించేలా ఉంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపి, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి నమూనాలను సేకరించారు.

బంధు ప్రకాష్ ఫేస్ బుక్ ప్రొఫైల్ గమనిస్తే అతను దుర్గా మాతా భక్తుడని తెలుస్తుంది. అతని టైంలైన్ పట్టణంలోని వివిధ దుర్గా పూజ మందిరాలలో సెల్ఫీలు, వీడియోలతో నిండి ఉంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌ తో బంధు ప్రకాష్‌ అనుబంధమే హత్యకు కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు.  ఈ ముస్లిం ఆధిపత్య ప్రాంతంలో హిందువులు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా సంవత్సరాలుగా హిందువులు ఇతర ప్రాంతాలకు మారిపోయారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘోర హత్యలపై సిబిఐ దర్యాప్తు చేయాలని, త్వరలోనే నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ పై నియంత్రణ కోల్పోతున్న పరిస్థితులలో, ఈ ముగ్గురి  హత్య ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని  దేశ వ్యతిరేకులు, ఇస్లాంవాదులు తమని చట్టం ఏమీ చేయలేదని మరోసారి రుజువు చేశారు. ఈ హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు పదునైన ఆయుధంను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కారణం తమకు తెలియదని స్థానిక పోలీసులు చెప్పినప్పటికీ, ఈ ప్రాంతంలోని స్థానిక హిందువులందరినీ తరిమికొట్టాలని కోరుకుంటున్న ఇస్లాంవాదులు, హిందువులలోభయాన్ని కలిగించడానికి ఆర్.ఎస్.ఎస్  స్వయంసేవక్ లను లక్ష్యంగా చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు.