డేరా బాబా నానక్ సాహిబ్ ను కర్తార్ పూర్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ తో కలిపే కర్తార్ పూర్ నడవా ప్రారంభమైన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. సిక్ఖులకే కాదు యావత్ భారతీయులకు పూజ్యుడైన శ్రీ గురునానక్ దేవ్ తన జీవితంలోని ఆఖరి 18 సంవత్సరాలూ కర్తార్ పూర్ గురుద్వారాలోనే గడిపారు. భారతీయుల ఈ చిరకాలపు స్వప్నాన్ని సాకారం చేయడానికి కృషిచేసిన అందరినీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అభినందిస్తోంది. వేడుకలలో పాలుపంచుకొవడంతోపాటు ఈ పవిత్రమైన సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది.
– సురేష్ (భయ్యాజీ) జోషి, సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్