శ్రీ గురునానక్ దేవ్ 550వ ప్రకాశ పర్వం సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ మాననీయ భయ్యాజీ జోషి ఈరోజు ఉదయం ముంబైలోని సాయన్ లో భాయి జోగాసింహ్ గురుద్వారాను సందర్శించారు.
——————
శ్రీ గురు నానక్ దేవ్ జి 550 వ జన్మదినం సందర్భంగా వనస్థలిపురంలోని గురుద్వారా ను ఆర్ .ఎస్.ఎస్ సహ కార్యవాహ శ్రీధర్ జి, వి.హెచ్.పి రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి ,వి.హెచ్.పి రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురుద్వారా నిర్వహించిన ప్రకాష్ పర్వదిన ఉత్సవంలో పాల్గొనడం జరిగింది .ఈ సందర్భంగా గురుద్వారా అధ్యక్షులు రిషిపాల్ సింగ్ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసమే సిఖ్ పంత్ స్థాపించబడింది అని ,గురుదేవుల ఆదేశం మేరకు సిక్కు సమాజం నిరంతరం ధర్మం కోసం పనిచేస్తుందని తెలిపారు .
—————-
శ్రీ గురునానక్ 550 వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత సమరసత సంయోజక్ శ్రీ శ్యాం ప్రసాద్ జీ, తెలంగాణ రాష్ట్ర సమరసత సంయోజక్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ, భాగ్యనగర్ సంయోజక్ శ్రీ భారతుల మహేష్ జి, స్వయంసేవకుల తో కలిసి అల్వాల్, ఈ.ఎం.ఈ గురుద్వారాలను దర్శించడం జరిగింది.
——————
శ్రీ గురునానక్ 550 వ జయంతి సందర్భంగా కరీంనగర్ లో ఉన్న గురుద్వారాను సందర్శించి , సిఖ్ బంధువులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ్ చాలకులు మా. శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు, మా.. ప్రాంత సహా సంఘ్ చాలకులు శ్రీ బూర్ల సురేందర్ రెడ్డి గారు, కరినగర జిల్లా మా.. జిల్లా సహ సంఘ్ ఛాలకులు శ్రీ చక్రవర్తుల రమణాచారి గారు కలిసి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగింది. వీరితో జిల్లా సంపర్క ప్రముఖ్ శ్రీ కుమ్మరికుంట సుధాకర్ గారూ, జిల్లా ప్రచార ప్రముఖ శ్రీ తడిగొప్పుల శంకరయ్య గారు, బండ రమణా రెడ్డి గారు, శ్రవణ్ ఇతర స్వయం సేవకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
—————-
సమత, మమత, ప్రేమతత్వాన్ని బోదించిన సిద్దపురుషుడు గురునానక్ అని సామాజిక సమరసత వేదిక విభాగ్ (ఉమ్మడి జిల్లా) కన్వీనర్ మచ్చేంద్రనాథ్ అన్నారు. మంగళవారం సిక్ సిక్లి గార్ సమాజ్ ఆధ్వర్యంలో మెదక్ లో సిక్కుల మొదటి గురువు గురునానక్ 550 వ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దైవం అన్ని జీవుల్లో సమానమే అన్న సనాతన ధర్మ సూత్రాన్ని ఆచరించి చూపిన విశిష్ట వ్యక్తి గురునానక్ అన్నారు. అంటరానితనాన్ని రూపుమాపి సర్వమానవ సౌభ్రతృత్వాన్ని చాటిచెప్పిన తేజోపుంజం గురునానక్ అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కోశాధికారి చోళ పవన్ కుమార్ మాట్లాడుతూ కవిగా, వేదాంతిగా, మానవతా వాదిగా, మానవాళి గురువుగా, నానక్ అందించిన ఆధ్యాత్మిక సందేశం ఆచరణీయమన్నారు.
అంతకుముందు గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి హారతులిచ్చారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుగ్రంథ సాహిబ్ పారాయణం చేశారు. సుభాష్ నగర్ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.తీర్థ,ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో సిక్ సిక్లిగార్ సమాజ్ బాద్యులు లఖన్ సింగ్, హజార్ సింగ్, గోపాల్ సింగ్, తారాసింగ్, బహదూర్ సింగ్, సూరజ్ సింగ్, బాదల్ సింగ్, సమరత వేదిక జిల్లా అధ్యక్షులు రవి, ధన్ రాజ్, మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.