Home News హిందూ సమాజం శక్తివంతం కావాలి: ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యాం...

హిందూ సమాజం శక్తివంతం కావాలి: ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యాం కుమార్

0
SHARE

అత్యంత జ్ఞాన సంపద, మహోన్నత చరిత్ర, పరాక్రమ శక్తి కలిగిన హిందూ సమాజంలో స్వార్ధం, దుర్గుణాలు, దోషాల కారణంగా ఆత్మవిస్మృతి చెందినది. తనను తాను మర్చిపోయిన విషయాన్ని గుర్తించి హిందూ సమాజాన్ని రక్షిస్తూ, శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రారంభం అయింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. నిత్య శాఖ అనే ఒక విశిష్టమైన కార్య పద్దతి ద్వారా తిరిగి హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి కలిసి పని చేయాలి అని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ దక్షిణమధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలే శ్యాం కుమార్ స్వయంసేవకులకు ప్రబోధించారు.

డిసెంబర్ 24న హైదరాబాద్ నగరశివార్లలోని మంగళపల్లి వద్ద భారత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఆరెస్సెస్ తెలంగాణ ‘విజయ సంకల్ప శిబిరం’ ఉద్ఘాటన కార్యక్రమంలో శ్రీ శ్యాంకుమార్ గారు ప్రారంభోపన్యాసం చేశారు. కార్యక్రమంలో మాన్యులు, అఖిల భారతీయ సహ సర్ కర్యవాహ్ (Joint General Secretary) శ్రీ ముకుందా గారు, క్షేత్ర సహ సంఘచాలాక్ శ్రీ దూసి రామకృష్ణ గారు, ప్రాంత సంఘచలాక్ శ్రీ దక్షిణామూర్తి గారు, ఇతర క్షేత్ర, ప్రాంత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అహింస & విప్లవ పంథాలలో పని చేసిన అనంతరం దేశ సామజిక స్థితిగతులు అధ్యయనం చేసి, హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో గడపడానికి ప్రధాన కారణం హిందూ సమాజ అనైక్యత, ఆత్మవిస్మృతి అని ఆరెస్సెస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గెవార్ గుర్తించారు. ఇక్కడి మూల సమాజం హిందూ సమాజమని, ప్రతి హిందువు తన రక్తాన్ని ధారపోసి ఈభూమిని రక్షిస్తూ, ఇక్కడి నదులు, పర్వతాలను పవిత్రంగా భావించి, ఈ దేశం ప్రాతినిధ్యం వహించే రంగాలలో ఎదురయ్యే జయాపజయాలను తనవిగా భావిస్తూ, ఇక్కడ వికసించిన సంస్కృతిని హిందూ సంస్కృతిగా, ధర్మాన్ని హిందూ ధర్మంగా, చారిత్రక కట్టడాలను హిందూ వారసత్వ సంపదగా భావించే ప్రతిఒక్కరూ హిందువే. ఈ భావనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇక్కడివారు కాదు. మతం మారడం వల్లన కూడా ఇక్కడి మూలాల నుండి దూరం కాబడుతున్నారు.

డాక్టర్ హెడ్గెవార్ సంఘటిత హిందూ సమాజం నిర్మాణం కోసం నిత్యశాఖ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ కార్యపద్ధతిని అనుకూల, ప్రతికూల పరిస్తితులలో సైతం దైవకార్యంగా భావించడం ద్వారా కార్యకర్తల నిర్మాణం జరుగుతోంది.  

లోక సంపర్కం, సంగ్రాహం, సంస్కారం, నియోజనం – ఈ పద్ధతిలో కార్యవిస్తరణ జరుగుతోంది. దాని కారణంగా జాగృత హిందూ సమాజాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఐదువందల చరిత్ర గల రామజన్మభూమి ఉద్యమ విజయమే ఇందుకు ఉదాహరణ.

హిందూసమాజంలోని సమస్యలు పరిష్కరించడానికి, బేధభావరహిత సమాజ నిర్మాణం కొరకు సంఘ శాఖ ఆధారమని, ఈ కార్యాన్నివ్యాప్తిచేసేందుకు సమాజం పట్ల ప్రేమ ఆప్యాయతలతో వ్యవహరించాలని శ్యాం కుమార్ కార్యకర్తలకు సందేశామిచారు.

ఈ శిబిరంలో 8వేలకు పైగా కార్యకర్తలు తమ స్వంత ఖర్చులతో పాల్గొన్నారు. శిబిరం వ్యవస్తితంగా నడపడానికి వెయ్యి మంది స్వయంసేవకులు స్వచ్చందంగా పనిచేస్తున్నారు.

డిసెంబర్ 25 సాయంత్రం 4 గంటలకు ఎల్బీ నగర్ చౌరాస్తా స్వయంసేవకుల పతసంచలన్ (Route March) జరుగనుంది. అనంతరం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే సార్వజనికోత్సవ సభలో ఆరెస్సెస్ పూజ్య సర్ సంఘచాలాక్ శ్రీ మోహన్ భాగవత్ గారు ప్రసంగిస్తారు.