Home News భైంసాలో బీభత్సం: ఇళ్ళు దగ్ధం.. ఉద్రిక్త పరిస్థితులు

భైంసాలో బీభత్సం: ఇళ్ళు దగ్ధం.. ఉద్రిక్త పరిస్థితులు

0
SHARE
Representaional Photo

ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో బీభత్సం కారణంగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తుల దాడిలో దాదాపు 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి.
జనవరి 12న పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన  యువకుడు ద్విచక్రవాహనంపై వీధుల్లో విచక్షణారహితంగా  హంగామా చేస్తుండటంతో  స్థానిక యువకులు మందలించారు. ఇదే అదనుగా, ఘర్షణలే లక్ష్యంగా దాదాపు 400-500 మంది హిందువుల ఇళ్లపై ప్రణాళిక  బద్దంగా దాడి చేసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది.
హిందూ జనాభా తక్కువగా ఉన్న కొర్బా వీధిలో 18 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి.  వీటిలో స్థానిక హిందు వాహిని కార్యకర్త ఇంటిని అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా రాళ్ళ దాడికి పాల్పడ్డారు. ఫైర్ ఇంజన్ వాహనాల పైపులను కోయడంతో పాటు స్థానిక ఇండ్లను సైతం లూటీ చేశారు
దాడిలో పాల్గొన్నవారు స్థానికులతో పాటు, సమీపంలోని నిర్మల్ పట్టణానికి చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ఒక ప్రవేట్ కార్యక్రమానికి వచ్చిన వారుగా స్థానికులు తెలిపారు.
ఘర్షణలు అదుపు చేసే క్రమంలో 8 మంది పోలీసులకు తీవ్ర గాయపడినవారిలో డిఎస్పీ కూడా ఉన్నట్టు సమాచారం.