Home News తమిళనాడులో హిందూ మున్నాని కార్యకర్తపై జీహాదీల దాడి

తమిళనాడులో హిందూ మున్నాని కార్యకర్తపై జీహాదీల దాడి

0
SHARE

మార్చి 4 న రాత్రి 10 గంటలకు కోయంబత్తూరులోని గాంధీపురంలో సిఎఎ కి మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న పోథానూర్ నివాసి, హిందూ మున్నాని జిల్లా కార్యదర్శి ఎం ఆనంద్ (33)పై రెండు బైక్లపై  వచ్చిన వ్యక్తులు దాడి చేయడమే కాక  అతని తలపై ఇనుప రాడ్డుతో కొట్టారు.

నంజుండపురం రోడ్‌లో ఆనంద్ తన బైక్ లో వెళుతుండగా ఈ దాడి జరిగిందని హిందూ మున్నాని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు గుణ తెలిపారు. అతను తన స్నేహితుడు రవితో కలిసి బైక్‌లో తిరిగి వెళ్తున్నాడు. కొంత దూరం డ్రైవింగ్ చేసిన తరువాత, ఎవరో తనను అనుసరిస్తున్నట్లు గ్రహించి, రవికి ఈ విషయం చెప్పాడు. నంజుండపురం-పోథానూర్ రోడ్ చేరుకున్న వారు, అక్కడ ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిన తరువాత ఇంటికి వెళ్లాలని కోరినందున రవిని దిగి ఇంటికి వెళ్ళమని కోరాడు. రవి ఆ ప్రదేశం నుండి బయలుదేరిన కొద్ది సెకన్లలో, ఆనంద్ పై అతనిని బైక్ లో అనుసరించిన వారు దాడి చేశారు. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే, బైక్ మీద ఉన్న వ్యక్తులు ఇనుప రాడ్డుతో అతనిపై దాడి చేశారు. అతను వెంటనే రవిని పిలిచి సంఘటనను వివరించాడు.

ఆనంద్ అక్కడికక్కడే కుప్పకూలిపోతుండగా, స్థానికులు అతన్ని కోయంబత్తూరు మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (సిఎంసిహెచ్) కి చికిత్స కోసం తరలించారు. దాడి గురించి తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్ద గుమిగూడారు. తదుపరి చికిత్స కోసం ఆనంద్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, వేగంగా కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా, పోథానూర్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

దాడి చేసిన వారిలో పోథానూర్ నివాసి నౌషాద్ కూడా ఒకరు అని హిందూ మున్నాని కార్యకర్తలు పేర్కొన్నారు. నిందితులను గుర్తించడానికి రోడ్డుపై అమర్చిన సిసిటివి వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నంజుండపురం రోడ్డులోని వివిక్త ఫ్లైఓవర్ ప్రాంతంలో నిందితులు అతనిపై దాడి చేయడానికి ముందు అన్నా విగ్రహం సిగ్నల్ నుండి ఆనంద్ ను అనుసరించారని పోలీసులు తెలిపారు.

బంద్ కు పిలుపునిచ్చిన హిందూ మున్నాని :

దాడిని ఖండిస్తూ, హిందూ మున్నాని ఈ రోజు అనగా మార్చి 7 న ఒక రోజు బంద్ కు పిలుపునిచ్చింది. ఇది హింసను ప్రేరేపించడానికి ఉద్దేశించిన వ్యవస్థీకృత దాడి అని హిందూ మున్నాని నాయకుడు కాదేశ్వర సుబ్రమణియన్ అభివర్ణించారు. ముస్లిం సమాజం ద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందటానికి డిఎంకె, కాంగ్రెస్, వామపక్షాలే ఈ విధమైన హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

జిహాదీలు తమిళనాడులో స్వేచ్ఛగా విహరిస్తున్నారని, దీని పైన దృష్టి సారించకపోతే అది రాష్ట్రానికే హానికరమని హిందూ మున్నాని పేర్కొంది. తమిళనాడులో ముస్లిం సంస్థలు హిందూ మున్నాని, ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలపై జరుపుతున్న దాడులు, హత్యలు ఏటేటా పెరుగుతూ వస్తున్నాయని వారు తెలిపారు.

జనవరిలో, 38 ఏళ్ల విజయ రఘును త్రిచిలోని పాలక్కరై గాంధీ మార్కెట్లో బైక్ పై వచ్చిన కొందరు ముస్లింలు దారుణంగా హత్య చేశారు. కుంభకోణంలోని రామలింగం, కోవైలోని శశి కుమార్, సేలం ఆడిటర్ రమేష్ తదితరులు కూడా ఇదే తరహాలో దారుణ హత్యకు గురయ్యారు.

హిందూ మున్నాని నాయకుడు రాజేష్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థ హిందువులకు సహాయం చేయదు, మద్దతు ఇవ్వదు. కనుక హిందువులే కలిసికట్టుగా ఈ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది అత్యంత అవసరం. మనకు రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. మైనారిటీల సవాళ్లను, పోలీసు, న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాశీనతను కలసికట్టుగా ఎదుర్కోవడం లేదా నశించిపోవడం.” అని అన్నారు.

Source: Organiser