Home News మే 3 వరకు ఇంట్లోనే ఉండి కరోనాను జయిద్దాం – ప్రధాని నరేంద్ర మోదీ

మే 3 వరకు ఇంట్లోనే ఉండి కరోనాను జయిద్దాం – ప్రధాని నరేంద్ర మోదీ

0
SHARE

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోన వైరస్ వ్యాప్తిని మన దేశంలో అరికట్టడంలో చాలావరకు విజయం సాధించామని, అయితే ప్రమాదం పూర్తిగా తొలగిపోనందువల్ల రాష్ట్రాలతో చర్చించిన మీదట లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా విదేశీయానం పూర్తిగా రద్దు చేయడం,  లాక్ డౌన్ అమలువంటి త్వరితమైన నిర్ణయాలవల్ల అభివృద్ధి చెందిన దేశాలకంటే మెరుగైన ఫలితాలు సాధించగలిగామని ఆయన అన్నారు.

ప్రధాని ప్రసంగంలో ముఖ్యాంశాలు :

– మే 3 వరకు లాక్ డౌన్ ఉంటుంది.

–  ఏప్రిల్ 20 వరకు ఇప్పుడు పాటిస్తున్న లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు అవుతుంది  ఆ తరువాత ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడిన ప్రదేశాల్లో పాక్షిక వెసులుబాటు గురించి ఆలోచించవచ్చును.

– ప్రస్తుతం 220 ల్యాబ్ లలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగలుగుతున్నం. ప్రారంభంలో కేవలం ఒకే ల్యాబ్ ఉండేది.

– 600లకు పైగా ఆసుపత్రులు కేవలం కోవిడ్ బాధితులకే చికిత్స కోసమే పనిచేస్తున్నాయి.

– నిత్యవసర వస్తువులు, మందుల కొరత ఏమి లేదు

ప్రజలు ఏడు ముఖ్యమైన విషయాలను పాటించి కరోనాపై పూర్తి విజయం సాధింఛాలి. అవి:

  1. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా జబ్బులతో బాధపడుతున్నవారి పట్ల మరింత జాగ్రత్త అవసరం
  2. ఇప్పటి వరకు లాక్ డౌన్ ను క్రమశిక్షణతో, తూచ తప్పకుండా పాటిస్తున్నట్లే ఇక ముందు కూడా చేయాలి.
  3. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన పద్దతులు (వేడినిరు తాగడం మొ.) పాటించాలి.
  4. ఆరోగ్య సేతు యాప్ ను అందరూ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి.
  5. మన చుట్టుపక్కల ఉన్న పేద ప్రజానీకానికి సహాయం అందించాలి.
  6. లాక్ డౌన్ మూలంగా పనులకు రాలేని ఉద్యోగులను యజమానులు తొలగించకుండా ఉండాలి.
  7. కరోనాపై అలుపెరుగని పోరు చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి.

ఈ సప్తపదిని పాటించి కరోనాపై పోరాటం సాగిద్దమని ప్రధాని మోదీ దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.