Home News ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వలస రానున్న సిక్కు శరణార్థులు!

ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వలస రానున్న సిక్కు శరణార్థులు!

0
SHARE
కాబూల్ బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది కుటుంబాలకు చెందిన 180 మంది సిక్కు, హిందువులు ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  బుధవారం కాబూల్ నుండి భారత్ కి బయలుదేరే అవకాశం ఉందని కాబుల్ సిక్కు వర్గాలు తెలిపాయి. తమపై దాడుల నేపథ్యంలో మైనారిటీ హిందూ, సిక్కు వర్గాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యామని, వారి భద్రత గురించి ఆఫ్గాన్ సిక్కు నాయకత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. అక్కడి తీవ్రవాదుల చేతిలో వివక్షకు, హింసకు గురయ్యామని దాని కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ విడిచిపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు వారు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్లో ఒక లక్షకు పైగా ఉన్న సిక్కు, హిందూ జనాభా ప్రస్తుతం 700 లకు చేరింది.
ఈ సందర్భంగా సిక్కుల యునైటెడ్  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జగదీప్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ అఫ్గాన్ నుండి బయటకు రావడానికి ఏ పౌరుడికైనా పాస్ పోర్ట్ అవసరమని, పునరావాసం కల్పించాలని ఇందుకు 365 సిక్కులకు సంబంధించిన పత్రాలను తయారు చేయాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.
తీవ్రవాదుల చేతిలో కిడ్నాప్ కి గురైన సేహజ్దారి నిధాన్ సింగ్,  తండ్రి, మామను కోల్పోయిన యువతి సల్మేెత్ కౌర్ తో పాటు మరో 11 మంది సిక్కు,హిందువులు జూలై 26న ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ కు చేరుకున్నారు. ఇప్పుడు మరో 118 మంది సెకండ్ బ్యాచ్ గా భారత్ కి రానున్నారు.
ఇటీవల 25 మంది కెనడా ఎంపీలు సిక్కు, హిందు శరణార్ధులను కెనడాకు తిరిగి తీసుకు రావాలని అందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని తమ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్కో మెందిసినో ను లేక ద్వారా కోరారు..