రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన అల్లర్లను సృష్టించే వారిని అరెస్టు చేయడం పై కొందరు కుహనా మేధావులు దేశం లో అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు.
ఫిబ్రవరిలో సిఏఏ వ్యతిరేక నిరసనల పేరుతో జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటుడు ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నిస్తూ ఉమర్ ను విడుదల చేయాలని ఒక ట్వీట్ చేశాడు.
మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉమర్ ఖలీద్ కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్, కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి సల్మాన్ అనిజ్, కాంగ్రెస్ ఐటీ సెల్ సభ్యులు శ్రీవాస్తవ, గౌరవ్ పండి లు ఉన్నారు.
ఢిల్లీ అల్లర్లకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జే ఎన్ యూ పూర్వ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ ను ఉపా(UAPA) చట్టం కింద ఆదివారం రాత్రి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
అతను గతంలో జూలై 31న విచారణ ఎదుర్కొన్నాడు. మళ్లీ సెప్టెంబర్ 13 ఆదివారం దాదాపు 11 గంటల విచారణ అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చ్ 6న ఖలీద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఫిబ్రవరిలో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల లో ఉమర్, డానిష్, వివిధ సంస్థలతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కుట్రలో భాగమని పోలీసులు చెప్పారు.
ఖలిధ్ రెండు వేర్వేరు ప్రదేశాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని అందులో ఒకటి భారతదేశంలో మైనారిటీలు ఎలా ఉన్నారనే దానిపై అంతర్జాతీయ లో ప్రచారం చేయాలని, మరొకటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా వీధుల్లోకి వచ్చి రోడ్లను అడ్డుకోవాలని ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినట్టు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ కుట్రలో భాగంగా కర్ధాంపురి, జఫరాబాద్, జఫ్రాబాధ్, చంద్ బాగ్, గోకుల్ పురి, శివ విహార్ ప్రాంతాల్లోని ఇండ్లలో తుపాకీ, పెట్రోల్ బంబులు, యాసిడ్ బాటిళ్లు, రాళ్లను నిల్వచేసినట్టు, అల్లర్లు సృష్టించడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలను సమీకరించే బాధ్యత దనిష్ కు అప్పగించినట్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.
అల్లర్లు జరిగే నెల రోజుల ముందు (జనవరి 8న) ఆమ్ ఆద్మీ పార్టీ నుండి సస్పెండ్ అయిన కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్, ఉమర్ ఖలిధ్, ఖలీల్ సైఫ్ షాహిన్ బాగ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమర్ ఖలీద్ మాట్లాడుతూ ట్రంప్ పర్యటన లో భారీ అల్లర్లు సృష్టించడానికి తమకు మద్దతు తెలపాలని తాహిర్ హుస్సేన్ ను కోరాడు. ఆ చార్జీ షీట్ కర్కర్దూమా కోర్టులో దాఖలైంది.
ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఉమర్ ఖలీద్ ను పది రోజులు పాటు రిమాండ్ కు తరలించాలని కర్కడూమా కోర్టు ఢిల్లీ పోలీసులకు సూచించింది.