Home News చైనా సరిహద్దుల్లో 6 ఎత్తైన ప్రాంతాలు భారత్  స్వాధీనం

చైనా సరిహద్దుల్లో 6 ఎత్తైన ప్రాంతాలు భారత్  స్వాధీనం

0
SHARE
భారత్ చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లోనే భారత సైన్యం లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు ప్రధాన ఎత్తైన కొండలు ను స్వాధీనం ప్రభుత్వ వర్గాలు ఒక మీడియా సంస్థ కి తెలిపాయి.  ఆగస్టు 29 నుంచి  నుంచి సెప్టెంబర్ రెండవ వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్ హిల్, గురుంగ్ హిల్, రిసేహెన్ లా, రేజంగ్ లా, మొఖ్పరి, ఫింగర్ 4 సమీపంలో మరో ఎత్తయిన ప్రాంతం ఉన్నాయని తెలిపాయి.
అయితే ఈ ప్రాంతాలన్నీ భారత్ భూభాగంలో ఉన్నప్పటికీ చైనా ఆక్రమించే అవకాశం ఉన్నందున ముందుగానే భారత బలగాలు అక్కడికి చేరుకుని శిబిరాలు ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. చైనా ఎత్తుకు భారత్  పైఎత్తు వేయడంతో చైనా సైనికులు మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. భారత దేశ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి  రేచెన్ లా, రేజాంగ్ లా ప్రాంతాల వద్ద 3 వేల మంది చైనా సైనికులు మోహరించి నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
డ్రాగన్ సైన్యం పలు విధాలుగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో చైనా బలగాల కార్యకలాపాలను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణశాఖ చీఫ్ జనరల్ బిపిన రావత్ పర్యవేక్షిస్తున్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది.
వ్యూహాత్మకమైనా ప్రదేశాలను భారత్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో కంగుతిన్న చైనా, భారత సైన్యాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆగస్టు 29, 30 న సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను మరల సృష్టించేందుకు చైనా చేసిన కుట్రను భారత బలగాలు దెబ్బ తీశాయి.  పాంగంగ్  సరస్సు ఒడ్డున చైనా సరిహద్దు దాటితే ప్రతీకారం తీర్చుకుంటామని భారత బలగాలు స్పష్టం చేశాయి.

Source : OPINDIA