Home News జమ్మూకాశ్మీర్ లో  కోవిడ్ సేవా కార్యక్రమాలు

జమ్మూకాశ్మీర్ లో  కోవిడ్ సేవా కార్యక్రమాలు

0
SHARE
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడ్డ  కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ము కాశ్మీర్, లడఖ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
మార్చి 25 నుండి కొవిడ్-19 నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక మందికి అండగా నిలిచారు.
జమ్ము కాశ్మీర్, లడక్ లోని 2,995 ప్రదేశాల్లో దాదాపు 4,725 మంది స్వయం సేవకులు ఈ విపత్కర సమయంలో మానవాళికి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. కరోనా నేపథ్యంలో  విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడ్డ వ్యాపారస్తులు, కార్మికులు, ఉద్యోగం కోల్పోయిన దాదాపు 62,891 కుటుంబాలకు సేవలను అందించారు. మొత్తం 87,161 రేషన్ కిట్లు నిరుపేదలకు పంపిణీ చేయడం తో పాటు,
4,35, 770 ఆహారపు ప్యాకెట్లను తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి అందజేశారు. కరోనా నియంత్రించడంలో భాగంగా మొత్తం  3,31, 562  మాస్క్ లను, 93672 శానిటైజర్ లను  అక్కడి ప్రజలకు పంపిణీ చేశారు.  పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్ని కలిపి 4,284  ప్రాంతాలను స్వయం సేవకులు పరిశుభ్రం చేశారు.
లాక్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన 13 మంది వలస కార్మికులకు తాత్కాలిక నివాసాలను స్వయం సేవకులు ఏర్పాటు చేశారు. ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 1100 కుటుంబాలకు నగదు రూపంలో సాయం చేశారు. కరోనా వారియర్స్ కు 510 పిపిఈ కిట్లను అందజేశారు. అదేవిధంగా కరోనా సోకిన బాధితులకు  రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆయుర్వేద ఔషధాల ప్యాకెట్లు దాదాపు 40 వేలకు పైగా పంపిణీ చేశారు.
Source : VSK TAMILNADU