Home News బీమా కోరేగావ్ కేసులో 8 మందిపై చార్జిషీట్

బీమా కోరేగావ్ కేసులో 8 మందిపై చార్జిషీట్

0
SHARE
భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్  కేసు  దర్యాప్తు  వేగవంతంగా ముందుకు సాగుతోంది. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. కోర్టులో సమర్పించిన చార్జిషీట్లో సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖా, ఢిల్లీ విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ హనీ బాబు, ఫాదర్ స్టాన్ స్వామిలతో పాటు, ఆనంద్ టెల్తుంబే, సాగర్ గోర్ఖే, రమేష్, జ్యోతి జగ్తాప్, మిలింద్ టెల్తుంబే ల పేర్లు ఉన్నాయి. వీరంతా దేశంలో  అల్లర్లు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఎన్ఐఏ ఆరోపించింది. పట్టణాల్లో విప్లవాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న మావోయిస్టులతో,  పాకిస్తాన్ కు చెందిన గూడచారి సంస్థ ఐఎస్ఐ తోనూ వీరికి సంబంధాలున్నాయని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా వీరందరినీ ప్రస్తుతం జైల్లో ఉంచారు.
ఈ కేసులో ఫాదర్ స్టాన్ స్వామిని ఎన్‌ఐఏ గురువారం జార్ఖండ్ లోని తన ఇంటి వద్ద అరెస్టు చేసింది.  స్టాన్ స్వామి నిషేధిత సిపిఎంలో చురుగ్గా పాల్గొంటూ, దేశంలో హింసను ప్రేరేపించే కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు, అందుకు  నిధులు కూడా పొందినట్టు ఎన్ఐఏ పేర్కొంది. అతని వద్ద నుండి సాహిత్యం, ప్రచార సామాగ్రి,  ఇతర పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఐదు దశాబ్దాల క్రితం కేరళ నుండి జార్ఖండ్ వచ్చిన స్టాన్ స్వామి గిరిజనుల హక్కుల పోరాటం పేరుతో దేశంలో హింస, అల్లర్లు సృష్టించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్టు ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది.  ఈ  నెల 23 వరకు ఆయనకు కోర్టు రిమాండ్ కు విధించింది.
ఎన్ఐఏ ప్రతినిధి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సోనియా నారంగ్  మాట్లాడుతూ భీమా కోరేగావ్ యుద్ధం 200 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 2018 జనవరి 1న నిర్వహించిన కార్యక్రమంలో అల్లర్లు సృష్టించినందుకు  వీరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 16 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Sourece : VSK BHARATH