Home News ఇస్లామిక్ సంస్థ పీ.ఎఫ్.ఐ కార్యాలయాలపై ఈ.డి దేశవ్యాప్త దాడులు

ఇస్లామిక్ సంస్థ పీ.ఎఫ్.ఐ కార్యాలయాలపై ఈ.డి దేశవ్యాప్త దాడులు

0
SHARE
ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీ.ఎఫ్.ఐ) సంస్థలపై దేశవ్యాప్తంగా  9 రాష్ట్రాల్లోని 26 చోట్ల గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ.డి) దాడులు చేసింది. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా పి.ఎఫ్.ఐ చైర్మన్ ఓ ఎం అబ్దుల్ సలాం, కేరళ రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఎలామరొమ్  స్థావరాలపై ఈ.డి  దాడులు నిర్వహించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సి. ఏ. ఏ వ్యతిరేక అల్లర్లలో పీ.ఎఫ్.ఐ కి సంబంధించిన  ఆర్థిక వ్యవహారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది.
ఇందులో భాగంగా గురువారం తమిళనాడు, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ లోని తిరువనంతపురం, మలప్పురం జిల్లాలో ఈ.డి సోదాలు నిర్వహించింది.
సీనియర్ పి.ఎఫ్.ఐ నేతల నుండి స్వాధీనం చేసుకున్న విశ్వసనీయ ఆధారాలను బట్టి పి.ఎఫ్.ఐ ,  భీమ్ ఆర్మీ ల మధ్య  ఆర్థిక సంబంధాలను ఈ.డీ పరిశీలిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో గత నెల లోనే పేర్కొంది.
ఈ మేరకు పీ.ఎఫ్. ఐ నాయకుడు, కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు లో ఉన్నతాధికారి అయిన సలాం తో పాటు రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థలకు చెందిన పలువురు వ్యక్తుల కదలికలను జాతీయ దర్యాప్తు సంస్థ పరిశీలించింది. ఈ క్రమంలోనే ఈ.డి ఈ దాడులు నిర్వహించింది.
ఇదిలా ఉండగా కేరళ లోని వివిధ ప్రాంతాల్లో ఈ.డి నిర్వహించిన దాడులపై పీ.ఎఫ్.ఐ చెందిన వ్యక్తులు నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా `అల్లాహో అక్బర్’, `నారా – ఏ- తకదిర్’ అంటూ  నినాదాలు చేశారు.
Source : ORGANISE