Home News కోవిడ్ సేవా కార్య‌క్ర‌మాల్లో హెచ్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవకులు 

కోవిడ్ సేవా కార్య‌క్ర‌మాల్లో హెచ్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవకులు 

0
SHARE

కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో యూ.ఎస్‌.ఏ లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్‌.ఎస్‌.ఎస్‌)  స్వయంసేవకులు క‌రోనా క‌ట్ట‌డిలో, వ్యాక్సినేష‌న్ ప్ర‌కియ‌లో స‌హాయ స‌హ‌కారాలు అందించారు. అమెరికా దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 198 పట్టణ కేంద్రాల్లో ఉన్న‌ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు, ఆరోగ్య సిబ్బందికి సహాయం అందించారు.

స‌మాజానికి సేవ చేయాల‌నే సంక‌ల్పంతో క‌రోనా స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యంగా ఉంటూ వ్యాక్సిన్ తీసుకోవాల‌నే ఉద్దేశంతో హెచ్‌.ఎస్‌.ఎస్ స్వయంసేవకులు తమ కమ్యూనిటీలలో “వ్యాక్సినేష‌న్ సేవ” పేరుతో సేవ‌ల‌నందించారు. H.S.S స్వయం సేవకులు కమ్యూనిటీలకు చేరుకుని, కోవిడ్ వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి ఆ ప్రాంతాల్లో టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య సిబ్బందికి సహాయపడ్డారు.

హెచ్ఎస్ఎస్ స్వ‌యంసేవ‌కులు ఫిలడెల్ఫియా, ఫెమా రీజియన్ III ల‌ సమన్వయంతో, “సేవా విత్ ఫెమా” అనే ప్రచార కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా 25 స్థానిక భారతీయ సంఘాలు, హిందూ దేవాలయాల నుండి వాలంటీర్లను హెచ్ఎస్ఎస్ సమన్వయం చేసింది.  వీరంతా వ్యాక్సినేష‌న్ ప్ర‌కియ‌లో భాగంగా పేర్లు నమోదు చేయడం, ప్రజలకు వైద్య‌ప‌రీక్ష‌లు చేయ‌డానికి, వికలాంగులకు సహాయం చేయడానికి, టీకా అనంతర పరిశీలనకు వైద్య సిబ్బందికి స‌హాయ‌ప‌డ్డారు.

సెంటర్ సిటీలో హెచ్ఎస్ఎస్, సేవా సంయుక్తంగా  ఏర్పాటు చేసిన‌ టీకా కేంద్రంలో  351 మంది వాలంటీర్లు 3నెల‌ల పాటు స‌హాయం అందించారు. అలాగే 21 మంది వాలంటీర్లను ఎస్పెరంజా కమ్యూనిటీ టీకా కేంద్రంలో స‌హాయం చేశారు. మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లోని వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో 7 భారతీయ సంస్థలతో కలిసి, హెచ్ఎస్ఎస్ స్వ‌యంసేవ‌కులు ఫెమా(FEMA)కు స‌హ‌కారం అందించారు. ఈ డ్రైవ్‌లో 100 మంది వాలంటీర్లు వారం రోజుల పాటు పనిచేశారు.

షార్లెట్, ఎన్‌సి, హెచ్ఎస్ఎస్ సేవా ఇంటర్నేషనల్, ట్రాన్స్‌ఫార్మింగ్ ది సిటీతో సమన్వయం చేసుకుని విక‌లాంగులను, వృద్ధులను వీల్‌చైర్ సహాయంతో టీకా కేంద్రాల‌కు తీసుకెళ్ల‌డంలో స‌హాయ‌ప‌డ్డారు. చికాగోకు సమీపంలో ఉన్న ఇల్లినాయిస్, షామ్‌బర్గ్ టౌన్‌షిప్, హాఫ్మన్ ఎస్టేట్స్  లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్ సజావుగా, విజయవంతంగా నడవ‌డానికి 23 హెచ్ఎస్ఎస్ వాలంటీర్లు త‌మ వంతు కృషి చేశారు.

టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో, డల్లాస్‌లలో 200 మందికి  పైగా హెచ్ఎస్ఎస్ వాలంటీర్లు సేవా ఇంటర్నేషనల్, ఇంటర్‌ఫెయిత్ సంస్థలు, ఫెమా, కొల్లిన్ కౌంటీ అధికారులు, స్థానిక వైద్య సిబ్బందితో కలిసి నాలుగు వారాల పాటు టీకా శిబిరాలను నిర్వహించారు. కార్లు లేని, డ్రైవింగ్ రాని నేపాలీ, భూటాన్ కు చెందిన ప్ర‌జ‌ల కోసం హెచ్.ఎస్.ఎస్ స్వ‌యంసేవ‌కులు టీకా సదుపాయాన్ని కల్పించారు.

ఒరెగాన్‌లో  60మంది హెచ్ఎస్ఎస్ వాలంటీర్లు ఫెమా, ఆల్ 4 ఒరెగాన్ సంస్థ,  సేవా ఇంటర్నేషనల్‌తో కలిసి పని చేశారు. జూన్ 2021 వరకు హెచ్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవ‌కులు తమ సమయాన్ని సేవ కోసం కేటాయించారు. కొలరాడోలోని డెన్వర్‌లో, గవర్నర్ కార్యాలయంలో సేవా ఇంటర్నేషనల్, హిందూ టెంపుల్, కల్చరల్ సెంటర్ ఆఫ్ ది రాకీస్, కొలరాడో కమ్యూనిటీ క్లినిక్ ‌ల సహకారంతో, హెచ్ఎస్ఎస్ రెండు వారాల పాటు  టీకా శిబిరాల‌ను నిర్వహించింది. 50 మంది స్వ‌యంసేవ‌కులు ఈ శిబిరంలో ప‌నిచేశారు.

కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్‌లో టీకా డ్రైవ్ ఏర్పాటుకు స్థానిక అష్టలక్ష్మి ఆలయ స‌భ్యుల‌తో సమన్వయం చేయడానికి హెచ్ఎస్ఎస్ సహకరించింది. మిచిగాన్‌లోని ట్రాయ్‌లో కమ్యూనిటీ టీకా డ్రైవ్ కోసం హెచ్.ఎస్.ఎస్ స్వ‌యంసేవ‌కులు సేవా ఇంటర్నేషనల్, వాల్‌గ్రీన్స్‌ల‌తో కలిసి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో పాలు పంచుకున్నారు.  

సామూహిక టీకా శిబిరాల ద్వారా క‌రోనా నుంచి స‌మాజం విముక్తి పొందుతుంది అనే న‌మ్మ‌కంతో స్వ‌యంసేవ‌కులు వ్యాక్సినేష‌న్‌లో పాలు పంచుకున్నార‌ని హెచ్‌.ఎస్‌.ఎస్ ప్ర‌తినిధులు తెలిపారు

Source : VSK BHARATH