గత కొంతకాలంగా తమ గ్రామంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న చర్చికి సమాధానంగా కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల ప్రజలు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. తమకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ, అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో నెంబర్ 376కు విరుద్ధంగా, జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గ్రామంలో నిర్మించిన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు (ఐఎంబీ) అనే విదేశీ సంస్థకు చెందిన చర్చిని తొలగించాలంటూ గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి గ్రామంలోని దాదాపు 750 మంది ఓటర్లు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఏకగ్రీవంగా చేసిన తీర్మానం తాలూకు అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- గ్రామంలో జరిగే సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు పెద్దపీట వేయాలి. వారి భాగస్వామ్యాన్ని పెపొందించాలి. అదే విధంగా గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాల్లో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ప్రజలను ప్రత్యేక ఆహ్వానితులను చేయాలి.
- గ్రామంలో అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో నెంబర్ 376కు విరుద్ధంగా, జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గ్రామంలో నిర్మించిన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు (ఐఎంబీ) అనే విదేశీ సంస్థకు చెందిన చర్చిని తొలగించాలి.
- ఇకపై గ్రామంలో ఏవిధమైన మతపరమైన కట్టడం నిర్మించాలన్నా గ్రామసభలో కనీసం 51 శాతం మంది ప్రజల ఆమోదం కలిగివుండాలి.
పై మూడు కీలక అంశాలతో పాటు ఈ క్రింది అంశాలను ప్రభుత్వానికి సూచిస్తూ గ్రామసభ తీర్మానం చేసింది:
- గ్రామంలో ఎవరు హిందువులు, ఎవరు ముస్లిములు, ఎవరు క్రెస్తవులు అనే అంశంపై సమగ్రమైన సర్వే చేపట్టి ఆయా మతానికి చెందిన వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలి
- రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు 1950 ప్రకారం ఎస్సీ సామజిక వర్గానికి చెంది, క్రైస్తవ ఆచార వ్యవహారాలను పాటిస్తున్న వారి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేసి, వారికి బీసీ-సీ కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి.
గురజాల గ్రామంలో గత కొంతకాలంగా అక్రమంగా నిర్మించిన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు సంస్థకు చెందిన చర్చి కారణంగా ఎస్సీ – బీసీ సామాజిక వర్గాల మధ్య విబేధాలు తలెత్తున్న కారణంగా గ్రామసభ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామస్థులు తెలియజేశారు. చర్చి ప్రోద్బలంతో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఇరువర్గాల మధ్య సమస్యలు తెలెత్తుతున్నాయని, ఎప్పుడూ సామరస్యంగా ఉండే తమ మధ్య విదేశీ చర్చి చిచ్చు రేపుతోంది అని ఆరోపించారు.
ప్రజాస్వామ్య భారతంలో గ్రామ ప్రజల ప్రత్యక్ష ప్రమేయాన్ని బలపరించేందుకు ఉద్దేశించిన భారత రాజ్యాంగంలోని అధికరణం 243 (ఎ) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయితీరాజ్ చట్టంలోని సెక్షన్ 6 ద్వారా ఏర్పడిన గ్రామసభ ఏర్పడింది.
#Revolution2021: Our heartfelt appreciation to the villagers of Gurujala, Kurnool District.
Today, a resolution was passed in their #GramSabha:
1. Removal of unauthorizedly constructed Foreign-funded @IMB_SBC Church in the village (1/3) https://t.co/Psxr3S5QDQ pic.twitter.com/4ZGdGKhMlX— Legal Rights Protection Forum (@lawinforce) July 16, 2021
Source : NIJAM TODAY