అమెరికా ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశంగా కొనసాగుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అగ్రరాజ్యంగా ఎదిగింది. అభివృద్ధి చెందుతున్న దేశంగా శాంతిని నెలకొల్పాల్సిన అమెరికా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అందుకు కావాల్సిన ఆయుధాలలో 37శాతం అమెరికానే సమకూర్చడం గమనార్హం.
ప్రస్తుతం అప్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులకు కూడా అమెరికానే కారణం. అమెరికా అఫ్ఘానిస్తాన్ ను వీడి వెళ్తున్నప్పుడు ఆ దేశంలో తమ ఉన్న తమ మారణాయుధాలు, యుద్ధవిమానాలు ఇతర యుద్ధ సమగ్రిని అక్కడే విడిచి వెళ్లింది. అమెరికా యుద్ధాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుంటుంది. కానీ శాంతియుతంగా యుద్ధాన్ని నిలువరించే ప్రయత్నం చేయడం లేదనే విషయం స్పష్టం అవుతోంది.
ప్రపంచంలో ఉన్న 10 అతిపెద్ద రక్షణా రంగ కంపెనీలలో 5 అమెరికాలోనే ఉన్నాయి. 2016లో ప్రపంచంలోని 167 దేశాలకు 197 డాలర్ల యుద్ధ సామగ్రిని అమెరికా విక్రయం చేసింది. ఇరాక్, లిబియా, సుడాన్ వంటి దేశాలకు కూడా అమెరికా యుద్ధ సామగ్రిని విక్రయించింది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా చివరగా అమెరికానే ఆర్థికంగా లాభపడుతోంది.
అమెరికా అప్ఘనిస్తాన్ అభివృద్ధి కోసం 2.2 ట్రిలియన్ డాలర్లు కేటాయించిట్టు చెప్పుకుంటుంది. అయితే ఆ స్థాయి అభివృద్ధి మాత్రం అప్ఘనిస్తాన్‌లో ఎక్కడా కనపడదు. దీని బట్టి అమెరికా అఫ్ఘనిస్తాన్ కు ఏ రకంగా నిధులు సమకూర్చిందో స్పష్టంమవుతోంది. ప్రస్తుతం అప్ఘనిస్తాన్ లో జరుగుతున్న దౌర్జన్యాలకు కారణం అమెరికాలోని ఒక డిఫెన్స్ ఔట్‌సోర్సింగ్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడమే.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అమెరికాలో ఒక ఐదు రక్షణారంగ కంపెనీలు ఉన్నాయి . LOCKHED MARTIN, BOEING, NORTHROP GORMANM, RAYTHEON TECHNOLOGIES, GENERAL DYNAMICS అనే ఈ ఐదు డిఫెన్స్ కంపెనీలు యుద్ధానికి కావాల్సిన సామగ్రిని సమకూరుస్తాయి. ఈ కంపెనీల ద్వారా అప్ఘనిస్తాన్ కు ఆయుధాలను, యుద్ధవిమాలను అందించి దీనివల్ల 2.2కోట్ల ఆదాయాన్ని అమెరికా పొందింది.
“Taliban Don’t win Afghanistan but Deface contractors Win “(తాలిబన్లు అప్ఘనిస్తాన్‌ను గెలవలేరు.. కానీ డిఫెన్స్ కాంట్రాక్టర్లు గెలుస్తారు) అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఒక నివేదిక ప్రచురించారు. దీని బట్టి యుద్ధ సమయంలో శాంతిని వ్యాప్తి చేయకుండా అమెరికా తన ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకోవడం కోసం రక్షణా రంగాన్ని ఏవిధంగా ఉపయోగిస్తుందో స్ఫష్టమవుతోంది.
అమెరికాలో జరిగిన 11/9 దాడుల తర్వాత అమెరికా షేర్ మార్కెట్ విలువ 10రెట్లు పెరిగింది. అంటే పెట్టుబడి పెట్టిన వాళ్లందరూ పరోక్షంగా యుద్ధం కోసం పెట్టుబడ్డి పెట్టినట్టే. ఇలా అమెరికా తన ఆర్థిక వ్యవస్థను గత 20సంవత్సరాలలో 10రెట్లు పెంచుకుంది.
అఫ్ఘనిస్తాన్ ఆర్మీ యూనిఫాం ను గమనిస్తే అవి అడవిలో ఉండే ఆర్మీ వ్యక్తులు ధరించే యూనిఫాం మాదిరిగా ఉంటాయి. వాస్తవానికి అప్ఘనిస్తాన్‌లో కేవలం ఒక శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. అక్కడ ఎక్కువ శాతం ఏడారులు ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశాల్లో ఉండే ఆర్మీ వాళ్లు ధరించే యూనిఫారం అడవిలో ఉండే యూనిఫాంను అక్కడి ఆర్మీ సిబ్బంది ధరిస్తున్నారు. ఈ యూనిఫాంల కోసం అప్ఘనిస్తాన్ అమెరికా లోని డిఫెన్స్ కంపెనీలకు 28 మిలియన్ డాలర్లు చెల్లించింది. అంటే అనవసరమైన యూనిఫాంలను అప్ఘనిస్తాన్‌కు ఇచ్చి అమెరికా సొమ్ము చేసుకుందనే విషయం స్పష్టం.
ఈ వ్యవస్థ అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. అమెరికాలోని ఆయుధాల కంపెనీ, రక్షణా శాఖ, అమెరికా పార్లమెంట్ ఈ వ్యవస్థలో ఒక భాగం. ఈ మూడు వ్యవస్థలు ఒకదానినోకటి సహకారాన్ని అందించి తర్వాత వారి ద్వారా లాభాన్ని ఆశిస్తాయి. ఉదాహరణకు ఆయుధాల కంపెనీ ఎన్నికల్లో సమయంలో ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులకు నిధులు సమకూరుస్తుంది. అలా 2016 ఎన్నికల్లో LOCKHED MARTIN అనే ఆయుధాల కంపెనీ డెమోక్రటిక్ అభ్యర్థులకు 1.2 మిలియన్ డాలర్లు నిధుల సమకూర్చింది. అలాగే రిపబ్లిక్ అభ్యర్థులకు 1.9 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చింది. రెండు పార్టీలకు సహకారం చేయడం వల్ల ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సహకరిస్తుందనే ప్రణాళిక ప్రకారం ఆయుధాల కంపెనీ నిధులు సమకూర్చింది. ఈ ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీ రక్షణ రంగానికి సంబంధించిన బడ్జెట్‌ను పెంచుతోంది. ఈ రకంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని యుద్ధాలు జరిగినా చివరికి ఆర్థికంగా లాభపడేది అమెరికానే అని స్పష్టమవుతోంది. అగ్రరాజ్యమైన అమెరికా శాంతియుత వాతవరణాన్ని నెలకొల్పాల్సిన విషయం మరిచి ఆర్థిక లాభం కోసం యుద్ధాన్ని ప్రేరెపించడం గమనార్హం.
Source : https://www.facebook.com/100044629650284/posts/408325250665127/