Home News ఆత్మకూరు హింస వెనుక S.D.P.I : కర్నూలు ఎస్పీ

ఆత్మకూరు హింస వెనుక S.D.P.I : కర్నూలు ఎస్పీ

0
SHARE

కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన అల్లర్ల వెనుక ఇస్లామిక్ మతవాద రాజకీయ పక్షమైన SDPI (సోష‌ల్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) హస్తం ఉన్నదని కర్నూలు ఎస్పీ Ch. సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

కర్నూలు జిల్లా ఆత్మకూరులో హిందువుల నివాసాల మధ్య ఆక్రమించిన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తలపెట్టిన మసీదు నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానిక హిందువులు, బీజేపీ నాయకులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి తదితరులపై అక్కడ పెద్ద ఎత్తున గుమికూడిన ముస్లిం మూకలు రాళ్ల దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగక ఆ చుట్టు పక్కల ఉన్న హిందువుల వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. బిజెపి నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడమే కాక పోలీస్ స్టేషన్ పై కూడా పెద్ద ఎత్తున దాడి చేసి స్టేషన్లోని సామగ్రిని, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసు అధికారులకు విభ్రాంతికరమైన సమాచారం తెలియవచ్చింది. ఈ కేసులో ప్రధానంగా 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 7గురు కర్నూలు జిల్లా వెలుగోడుకు చెందినవారని, వారు ఇస్లామిక్ మతవాద రాజకీయ పక్షమైన SDPI లో క్రియాశీలక కార్యకర్తలని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

జనవరి మొదటి వారంలో నంద్యాలలోనూ, అంతకుముందు వెలుగోడులోనూ SDPI శిక్షణా కార్యక్రమాలు జరిగాయని, ఆ శిక్షణ కార్యకలాపాలలో ఈ 7గురు నిందితులు కీలక పాత్ర పోషించారని ఎస్పీ తెలిపారు. వారే ఇప్పుడు కూడా ఆత్మకూరులో ఉద్రిక్తతలు చెలరేగడానికి కారణమయ్యారని, స్థానిక ముస్లిములను రెచ్చగొట్టి హిందువుల పైన, బిజెపి నాయకులపైన దాడులకు పురిగొల్పారని ఎస్పీ స్పష్టం చేశారు.

నంద్యాల, వెలుగోడులలో SDPI శిక్షణ తరగతులు జరుగుతున్నప్పుడు వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన పోలీసులను కూడా వారు అడ్డుకున్నారని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) ప్రకారం ఎక్కడ తప్పు జరుగుతుందని భావించినా అక్కడినుంచి వివరాలు సేకరించే అధికారం పోలీసులకు ఉన్నదని, వారి విధులను అడ్డుకోవడం చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని, అలా అడ్డుకున్న వారు శిక్షార్హులని, అందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులకు సహకరించాలని, లేకపోతే చట్టప్రకారం శిక్షింపబడతారని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Courtesy : VSK Andhra