Home News అహ్మ‌దాబాద్: హిందూ యువ‌కుడి హ‌త్య కేసులో సబ్బీర్, ఇంతియాజ్, మహ్మద్ అరెస్ట్‌

అహ్మ‌దాబాద్: హిందూ యువ‌కుడి హ‌త్య కేసులో సబ్బీర్, ఇంతియాజ్, మహ్మద్ అరెస్ట్‌

0
SHARE

గుజరాత్‌లోని అహ్మదాబాద్ రూరల్‌లోని ధంధూకాలో మంగళవారం (జనవరి 25) జ‌రిగిన కిషన్ బోలియా (27) అనే హిందూ యువ‌కుడి హత్య కేసులో నిందుతులు సబ్బీర్, ఇంతియాజ్ పఠాన్, మౌలానా మహ్మద్ అయూబ్‌లను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో మౌలానా మహ్మద్ అయూబ్ ప్ర‌ధాన కుట్రదారుడని, హత్యకు ఆయుధాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యా పథకంలో ప్రమేయం ఉన్న ముంబైకి చెందిన మరో మౌలానా కోసం గాలిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం … “కిష‌న‌ బోలియా అనే వ్య‌క్తి జనవరి 6న త‌న ఫేస్‌బుక్ లో ఒక పోస్ట్ చేశాడు. అది ఇస్లాంకి వ్య‌తిరేకంగా ఉంద‌ని కొంతమంది ముస్లింలు ఆరోపిస్తూ అభ్యంత‌రం తెలిపారు. దీనిపై వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా ధంధూకా పోలీస్ స్టేషన్‌లో కిష‌న్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ త‌ర్వాత కిషన్‌కు బెయిల్ వచ్చింది. అయితే అప్ప‌టికే కిష‌న్‌పై క‌క్ష పెంచుకున్న ష‌బ్బీర్, ఇంతియాజ్ ఇద్దరు మౌలానాల సహాయంతో అత‌ని హత్యకు పథకం పన్నారు. మౌలానా ద్వారా తుపాకీ, మందుగుండు సామగ్రిని తీసుకుని జ‌న‌వ‌రి 25న హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు అహ్మదాబాద్ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఘ‌ట‌న‌పై రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి స్పందిస్తూ… ” హత్య జరిగిన వెంటనే అహ్మదాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును పర్యవేక్షిస్తోంది. ఈ కేసులో సత్వర న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో అత్యుత్తమ న్యాయవాదిని ప్రభుత్వం నియమిస్తుంది” అని హామీ ఇచ్చారు.

కిష‌న్ హ‌త్య‌కు నిర‌స‌న‌గా విశ్వ‌హిందూ పరిష‌త్ ఆందోళ‌న‌లు చేప‌ట్టంది. వీహెచ్‌పీ ఆధ్వ‌ర్యంలో జనవరి 26న అహ్మదాబాద్‌లో బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. గుజరాత్ VHP ప్రతినిధి హితేంద్రసింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ హిందూ యువకుడి హత్య వెనుక ఉన్న నిందితులందరినీ పోలీసులు పట్టుకుని వారిని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారించాల‌ని డిమాండ్ చేశారు.

source : ORGANISER