Home News సేవగాథ తెలుగు వెబ్‌సైట్ ప్రారంభం

సేవగాథ తెలుగు వెబ్‌సైట్ ప్రారంభం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా విభాగం నిర్వహిస్తున్న సేవగాథ తెలుగు వెబ్‌సైట్ ప్రారంభోత్స‌వం శ‌నివారం భాగ్య‌న‌గ‌ర్‌లోని కూక‌ట్ ప‌ల్లి P N M హైస్కూల్ లో ఘనంగా జ‌రిగింది. ఈ సేవగాథ తెలుగు వెబ్‌సైట్ ను TSAT CEO శ్రీ శైలేష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ శైలేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆర్‌.ఎస్‌.ఎస్ సేవా విభాగం అనేక మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నద‌ని అన్నారు. అటువంటి కార్యక్రమాలలో ముఖ్యమైన వాటిని సేవా గాథ వెబ్‌సైట్‌లో ఉంచడం హర్షణీయమన్నారు. ఇప్పటికి ఆరు భారతీయ భాషల్లో మాత్రమే ఉన్న ఈ వెబ్‌సైట్ ను ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్ లాంటి భాషలలో కూడా ప్రారంభిస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం చేస్తున్న సేవ ప్రపంచానికంతటికి తెలుస్తుందఅన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో గౌరవ అతిధిగా పాల్గొన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అబ్యాంకర్ జి మాట్లాడుతూ సేవ చేయటం కొత్తదేమీ కాదని సేవ భారతదేశ రక్తం లోనే ఇమిడి ఉందని తెలిపారు. దక్షణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ జి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఏళ్లుగా వివిధ రంగాల్లో సేవా విభాగం పనిచేస్తుందని, భాగ్యనగరంలోని వైదేహి ఆశ్రమంలోని అనాథ‌ బాలికలకు అందిస్తున్న సేవ ఒక గొప్ప ఉదాహరణ అని తెలిపారు. కార్యక్రమంలో RSS తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ శ్రీ దక్షిణా మూర్తి గారు, సికింద్రాబాద్ విభాగ్ సంఘ్ చాలక్ దుర్గా రెడ్డి గారు, ఉదయ్ సింగ్ గారు తదితరలు పాల్గొన్నారు.

 

Sevagath: https://www.sewagatha.org/