Home News కర్నాటకలో మసీదు పునర్ నిర్మాణం… వెలుగులోకి దేవాలయం

కర్నాటకలో మసీదు పునర్ నిర్మాణం… వెలుగులోకి దేవాలయం

0
SHARE

ఒక పురాతనమైన మసీదు అట్టడుగున ఒక హిందూ దేవస్థానాన్ని పోలిన నిర్మాణం బయటపడింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం కర్నాటకలోని మంగళూరు శివార్లలోని మలాలీలో జుమా మసీదు నిర్వాహకులు ఇటీవల మసీదు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్తంభాలపై అలంకారాలు చెక్కిన హిందూ దేవస్థానాన్ని పోలిన నిర్మాణం బైటపడింది.

ఒక మసీదులో దేవస్థానాన్ని పోలిన నిర్మాణం వెలుగులోకి రావడం అక్కడి స్థానికుల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నది. మసీదు ఉన్న చోట కచ్చితంగా దేవస్థానం ఉండి ఉంటుందనే చర్చ స్థానికుల్లో చోటు చేసుకుంది.

పత్రాలను పరిశీలించేంతవరకు మసీదు పునర్ నిర్మాణ పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి విశ్వహిందూపరిషత్ (VHP) నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు మసీదు పునర్ నిర్మాణ ప్రాంతంలో యథాతథ స్థితిని కొనసాగించాలని దక్షిణ కన్నడ కమిషనరేట్ ఆదేశించింది. భూమి రికార్డులను పరిశీలిస్తామని, శాంతియుతంగా ఉండాలని ప్రజలకు సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేశారు.

“ఈ విషయమై క్షేత్రస్థాయి అధికారులు, పోలీసు శాఖ నుంచి నాకు సమాచారం అందింది. పాత భూమి రికార్డులు, భూస్వామి వివరాల తాలూకు ఎంట్రీలను జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. దేవాదాయ శాఖ మరియు వక్ఫ్ బోర్డు నుంచి నివేదికలు స్వీకరిస్తాం” దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కె.వి.రాజేంద్ర తెలిపారు.

అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని జిల్లా యంత్రాంగం తెలిపింది.

“అప్పుటి వరకు, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తున్నాను. ఎలాంటి నిర్ధారణలకు చేరుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి, భద్రతలు పరిరక్షిస్తూ సామరస్యం నెలకొల్పాలని ప్రజలను కోరుతున్నాను” అని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.