Home News ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత మాజీ ప్రాంత సంఘచాలక్ లు శ్రీ ప్యాట వెంకటేశ్వర రావు గారు...

ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత మాజీ ప్రాంత సంఘచాలక్ లు శ్రీ ప్యాట వెంకటేశ్వర రావు గారు ఆస్త‌మ‌యం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ తెలంగాణ ప్రాంత మాజీ ప్రాంత సంఘచాలక్ లు శ్రీ ప్యాట వెంకటేశ్వర రావు(76) గారు , అనారోగ్యంతో గత కొద్ధి రోజులుగా కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు(మంగ‌ళ‌వారం) సాయంత్రం స్వర్గస్థులు అయ్యారు. వీరు గతంలో భాగ్యనగర్ విభాగ్ సంఘచాలక్ గా కూడా పనిచేశారు. వీరు భాగ్యనగర్ స్వయంసేవక్, గడిచిన 50 సంవత్సరాలకు పైగా ఆర్‌.ఎస్‌.ఎస్ లో వివిధ బాధ్యతలలో పని చేసిన ప్రముఖ కార్యకర్త. సివిల్ సూపరిండెంట్ ఇంజినీర్ గా R&B లో పని చేసి పదవి విరమణచేశారు. వారు స్వయంగా గాయకులు. ఆర్‌.ఎస్‌.ఎస్ ద్వితీయ స‌ర సంఘ‌చాల‌క్ పూజ్య గురూజీ నుండి అందరూ సర సంఘచాలక్ లను అతి దగ్గర నుండి చూసిన వారు. మానవతా మూర్తి, నిరంతర చైతన్య శీలి. అనేక మంది కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత. వారి మరణం తెలంగాణ రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ కి తీరని లోటు.

వీరి భౌతిక కాయం అంతిమ దర్శనార్థం సీతాఫల్మండి లో వారి స్వగృహం నందు ఉంచబడుతుంది. అంతిమ యాత్ర రేపు బుధ‌వారం (04.05.2022) మధ్యాహ్నం 1.00 గంటలకు సీతాపల్మండి లో గల వారి స్వగృహం నుండి మొదలవుతుంది. అంత్యక్రియలు బన్సీలాల్ పేటలో నిర్వహిస్తారు.

శ్రీ ప్యాట వెంకటేశ్వర్ రావు గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ వారి ఆత్మకు సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించవల్సిందిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్న‌ట్టు తెలంగాణ ప్రాంత సంఘ‌చాల‌క్ శ్రీ బూర్ల ద‌క్షిణమూర్తి గారు పేర్కొన్నారు.