Home News VIDEO: కలమే ఖడ్గం.. నిజాం నిరంకుశత్వంపై పోరాటం షోయబుల్లా ఖాన్

VIDEO: కలమే ఖడ్గం.. నిజాం నిరంకుశత్వంపై పోరాటం షోయబుల్లా ఖాన్

0
SHARE

షోయబుల్లా ఖాన్ స్వాతంత్ర్య సమరయోధులు, నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయులు. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను రచించారు. తేజ్ పత్రికను నిజాం ప్రభుత్వం నిషేధించింది. అనంతరం కాలంలో స్వీయ నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను షోయబుల్లా ఖాన్ స్థాపించారు.

నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడమే సరైన నిర్ణయమని తెలుపుతూ హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు రూపొందించిన ఒక పత్రాన్ని షోయబుల్లా ఖాన్ తన ఇమ్రోజ్ పత్రికలో యథాతథంగా ప్రచురించారు. దాంతో 28 సంవత్సరాల వయస్సులో నిజాం రజాకార్లు ఆయన్ను హత్య చేశారు.