Home News చైనాలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం… COVID లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు

చైనాలో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం… COVID లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు

0
SHARE
  • ప్ర‌మాదంలోనూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌ని వైనం
  • ప‌త్రికా స్వేచ్చకు భంగం

చైనా పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కోవిడ్ లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఆగ‌స్టు నుంచి లాక్‌డౌన్ విధించారు. అయితే ఇటీవ‌ల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి కార‌ణమ‌యింది. ఒక‌వైపు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, మ‌రో వైపు అగ్నిప్ర‌మాదంలో ప్ర‌జ‌లు చిక్కుకుపోయారు. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని ఆందోళ‌న చేశారు.

నవంబర్ 25 శుక్రవారం రాత్రి చైనీస్ సోషల్ మీడియాలో వ‌చ్చిన వీడియోలలో జిన్‌జియాంగ్ రాజధాని ఉరుమ్‌కీ అగ్నిప్ర‌మాదం వ‌ల్ల‌ జనాలు “లాక్‌డౌన్‌ను ముగించండి” అని నినాదాలు చేస్తూ, రోడ్డు మీద‌కు వ‌చ్చి ఆందోళ‌న‌ చేశారు. నవంబర్ 24 గురువారం, ఉరుంకీలోని ఒక భవనం అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌ విధించినందున ప్రజలు సులభంగా తప్పించుకోలేకపోయారు. ఆగస్టు ప్రారంభం నుండి, పశ్చిమ జిన్‌జియాంగ్‌కు ప్రాంతీయ రాజధాని నగరంలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. నగరంలో గత రెండు రోజుల్లో దాదాపు 100 కొత్త కేసులు నమోదయ్యాయి.

BBC నివేదిక ప్రకారం, సంఘటన తరువాత అగ్నిప్రమాదానికి గురైన ఆపార్ట్‌మెంట్‌లోని నివాసితులు తమ ఇళ్లను విడిచిపెట్టకుండా నిరోధించారు. ఈ చ‌ర్యకు ఉరుంకీలోని అధికారులు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. మ‌రోవైపు వారి ఆదేశాలను ఉల్లంఘించిన ఎవరినైనా శిక్షిస్తామని చెప్పారు. కఠినమైన జీరో-కోవిడ్ విధానం ఉన్నప్పటికీ, చైనాలో అంటువ్యాధులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఉరుంకిలోని అధికారులు ఇప్పుడు ఆంక్షలను క్రమంగా తొలగిస్తామని చెప్పినా గురువారం అగ్నిప్రమాదం నుండి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి కూడా ఎవరినీ బ‌య‌ట‌కు రాకుండా నిరోధించార‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చైనా కఠినమైన నిబంధ‌న‌ల కార‌ణంగా ఉరుంకీ నిరసనలకు సంబంధించిన సోష‌ల్‌మీడియా పోస్టులు తీసివేయబడ్డాయి. ఉరుంకీ అపార్ట్‌మెంట్ భవనం అగ్నిప్రమాదంలో ఒకరు మరణించారు, మ‌రో 9మంది గాయపడ్డారు. స్థానిక మీడియా ప్రకారం, విద్యుత్ఘాతమే అగ్నిప్ర‌మాదానికి కార‌ణమ‌ని తెలిపింది. కోవిడ్ పరిమితులు మంటలను ఆర్పడం మరింత కష్టతరం చేశాయని ఆన్‌లైన్ కథనాలు పేర్కొన్నాయి. కానీ స్థానిక అధికారులు దీనిని తిరస్కరించారు.

బీజింగ్ జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ, చైనాలో పెద్ద ఎత్తున ఘర్షణాత్మక ప్రదర్శనలు జ‌రుగుతున్నాయి. జీరో-కోవిడ్ పాలసీ అనేది దేశంలోని పేలవమైన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, జిన్‌జియాంగ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉయ్‌ఘర్‌లు నివసిస్తుండటం గమనార్హం. వారి మానవ హక్కుల ఉల్లంఘనలకు చైనా ప్రభుత్వం కారణమైంది.

ప‌త్రికా స్వేచ్చకు భంగం

ఒక వైపు కోవిడ్ నిబంధ‌న‌లు, మ‌రోవైపు అగ్నిప్ర‌మాదం ఈ రెండు కార‌ణాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఎంతో ఇబ్బంది ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌ల్ని క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన బిబిసి న్యూస్ రిపోర్ట‌ర్ ను చైనా ప్ర‌భుత్వం అరెస్టు చేసి అత‌న్ని కొట్టింది. దీనికి నిర‌స‌న‌గా చైనాలోని ప్రధాన నగరాల్లో ఆదివారం నాడు వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు అధికార యంత్రాగంపై ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించారు.