Home News “మహారాష్ట్రలో బలవంతపు మతమార్పిడి”

“మహారాష్ట్రలో బలవంతపు మతమార్పిడి”

0
SHARE
  • హిందూ యువ‌తుల‌ను మ‌తంమారిస్తే ముస్లింలకు 5 లక్షల రివార్డు

మ‌హారాష్ట్రలోని ఒక ప్రాంతంలో జ‌రుగుతున్న మ‌త‌మార్పిళ్లు TIMES NOW చేప‌ట్టిన ఒక ప‌రిశోధ‌న ద్వారా వెలుగు చూసింది. నివేదిక ప్రకారం, మ‌హారాష్ట్రలోని దౌండ్ ప్రాంతంలో ఏటా 200 మంది హిందువులు మతం మారుతున్నారు. ఆ ప్రాంతంలో పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే, హిందూ బాలికలను మతం మార్చేందుకు ముస్లిం యువకులకు రూ.5 లక్షల నగదు బహుమతిగా ఇస్తున్నారని దౌండ్‌లో నివసిస్తున్న హిందూ కుటుంబాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ విషయంలో అత్యంత దారుణ‌మైన‌ విషయం ఏమిటంటే.. ఈ మతమార్పిడులన్నీ ప్రజాప్రతినిధులు, పోలీసులు, రాజకీయ నేతల మద్దతుతోనే జరుగుతున్నాయి. హిందువులను మతం మార్చేందుకు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని విచారణలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది హిందూ పురుషుల‌ను బ‌ల‌వంతంగా మ‌తం మార్చి వారికి సున్తీ చేయిస్తున్నారు. అలాగే 17-18 సంవత్సరాల వ‌య‌సు గ‌ల అమ్మాయిలు దాదాపు 200 మంది డౌండ్‌లో మతం మార్పిడికి గుర‌య్యారు.

కాలేజీకి వెళ్లే అమ్మాయిల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వారిని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి వివాహానికి ప్రేరేపిస్తున్నారు. పెళ్లి త‌ర్వాత పిల్లలు పుట్టాక వారికి విడాకులిచ్చి విడిచిపెడుతున్నారు. ఆ తర్వాత ముస్లిం యువ‌కులు మళ్లీ పెళ్లికి సిద్ధమవుతారు.

“బలవంతపు మతమార్పిడుల వెనుక ఉన్న వ్యక్తులు బాలికలను కొట్టడం, బెదిరించడంతో ప్రతిస్పందించడానికి హిందువులు భయపడుతున్నారు. వారు ఈ యువతులను బహిరంగంగా వేధిస్తారు, కానీ వారిపై ఎవరూ ఫిర్యాదు చేయలేరు. వీరికి రాజకీయ నాయకుల మద్దతు ఉంటుంది. అందుకే ఎవరూ కూడా ప్ర‌శ్నించ‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేరు” అని ఈ ప్రాంతంలోని నివాసిని ఉటంకిస్తూ టైమ్స్ నౌ నివేదించింది.

అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ఒక హిందూ యువతి ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంటే, వారు దాదాపు రూ. 5 లక్షలు పొందుతారని నివేదిక పేర్కొంది. “ఫరూక్ ఖురేషీ, కుమేల్ ఖురేషీ, అషిబ్ ఖురేషీ, ఫర్హాన్ ఖురేషీ వంటి వ్యక్తులు ఈ కార్యకలాపాల వెనుక ఉన్నారు. కానీ వీరికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవ‌రూ ముందుకు రారు, క‌నీసం వారి పేర్లను కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ” డౌండ్ నివాసి టైమ్స్ నౌ కి చెప్పారు.

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న బలవంతపు మతమార్పిడులు, లవ్ జిహాద్ ఘటనలు

2021 సెప్టెంబరులో, ముస్లిం మత గురువు కలీమ్ సిద్ధిఖీని అక్రమ మత మార్పిడి రాకెట్‌లో పాల్గొన్నందుకు యూపీ పోలీసులు అరెస్టు చేశారు. 1,000 మందిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన కేసులో అరెస్టయిన ఉమర్ గౌతమ్ కేసు దర్యాప్తులో అతని పేరు బయటపడింది.

2022 జూన్ లో, మధ్యప్రదేశ్‌కు చెందిన రచన, కొన్నేళ్ల క్రితం మహ్మద్ ఇర్ఫాన్ తో వివాహం చేసుకుంది. గృహ హింస, బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్‌కు జైలుశిక్ష పడింది. అయితే ఆమె హత్యకు ముందు అతను బెయిల్‌పై ఉన్నాడు.

2022 జూన్ లో వారణాసిలోని పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, 2015లో తన కూతురిని పెళ్లి చేసుకున్న షరీఫ్ హష్మీ బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఆ పై హత్య చేశాడని హిందూ యువ‌తి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

2022 మార్చిలో, కర్ణాటకకు చెందిన అపూర్వ పురాణిక్ అనే మహిళ, మొహమ్మద్ ఎజాజ్ షిరూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత తన పేరును అర్ఫా భానుగా మార్చుకుంది. అత‌నికి అప్ప‌టికే పెళ్లై ముగ్గురు పిల్లున్నార‌ని తెలుసున్న మ‌హిళా అత‌ని నుండి విడాకులు కోరింది. దీంతో మొహమ్మద్ ఎజాజ్ షిరూర్ ఆమెపై 20 సార్లు కత్తితో పొడిచాడు.