1963 జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతులో పాల్గొనే అవకాశం రావడం ఢిల్లీకి చెందిన ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవక్‌లకు నిజంగా గర్వకారణం. అయితే, కవాతు ప్రారంభానికి 24 గంటల ముందే సమాచారం అందినా స్వయంసేవకులు దానిని పరిపూర్ణతతో పూర్తిచేయడం గొప్ప విషయం… ఆనాడు కవాతులో పాల్గొన్న కొందరు ఆర్.ఎస్.ఎస్ జేష్ట్య కార్యకర్తల మనోగతం…
షహదారాలోని ఫార్ష్ బజార్‌లో నివసిస్తూ, మండల కార్యవాహ బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ విజయ్ కుమార్ గారు ఆనాటి కవాతును గుర్తుచేసుకుంటూ ఇలా అన్నారు. “1962 చైనాతో యుద్ధంలో సైన్యానికి స్వయంసేవకుల చురుకైన మద్దతు ఖచ్చితంగా ప్రధాన అంశం. ఇది గుర్తించిన నెహ్రూ సంఘ స్వయంసేవకులు కూడా గణతంత్ర వేడుకల్లో భాగంగా కవాతులో పాల్గొనాలని కోరుకున్నారు. కవాతులో చేరాలని నెహ్రూ ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది. మన్నియా సోహన్ సింగ్ జీ అప్పుడు సంభాగ్ ప్రచారక్. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ ఒక సంభాగ్‌గా ఉండేవి. కవాతులో పాల్గొనాలని ప్రభుత్వ ప్రతినిధి సంఘ పెద్దలను ఆహ్వనించినపుడు… స్వయంసేవకులు కవాతులో సంతోషంగా పాల్గొంటారని, అయితే వారి ‘గణవేష్’ తో పాటు ‘దండ, ‘ఘోష్’ వాయిద్యాలతో పాల్గొంటారని శ్రీ సోహన్ సింగ్ జీ బదులిచ్చారు.
మొత్తానికి RSS స్వయంసేవకులు గణవేష్ తో కవాతులో పాల్గొనవచ్చనే సమాచారం 24గంటల ముందే అందింది. అధికారిక సమాచారం రావడంతో కవాతుకు సిద్ధం కావాలని స్వయంసేవకులకు తెలియజేసేందుకు మన్నెయ సోహన్ సింగ్ జి అవిశ్రాంతంగా పనిచేశారు. స్వయంసేవకులను తీసుకెళ్లడానికి బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు రాత్రంతా టెలిఫోన్ కాల్స్ చేశారు. టెలిఫోన్ సదుపాయం అందరికీ లేనందున కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్లు మొదలైన ఇతర సమాచార సాధనాల ద్వారా రాత్రిపూటనే స్వయంసేవకులకు సమాచారమందించారు. చివరగా, నిర్ణీత సమయానికి ముందే, అన్ని బస్సులు తమ సామర్థ్యానికి అనుగుణంగా స్వయంసేవకులతో నిండిపోయాయి. ఉదయం 8.00 గంటలకు సుమారు 3000 మంది స్వయంసేవకులు కవాతు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. మా బృందం’ చివరిగా కవాతు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ నిరీక్షణలో ఎవరూ విసుగు చెందలేదు. సంఘ శాఖలలో సంప్రదాయం ప్రకారం, మేమంతా దేశభక్తి పాడాము. చాలా మంది ఆర్మీ అధికారులు మన దేశభక్తి గీతాలను రికార్డ్ చేశారు. ఘోష్ నాదాలతో స్వయంసేవకుల కవాతు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వ్యాఖ్యాత సంఘ స్వయంసేవకుల గురించి మాట్లాడిన తీరు చాలా స్ఫూర్తిదాయకమైనది. ” అని తెలిపారు.
అప్పటి ప్రభుత్వం RSS కార్యకర్తలను పరేడ్‌కు ఆహ్వానించడం వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి అని అడిగినప్పుడు, శ్రీ విజయ్ కుమార్ ఇలా అన్నారు. “1962 చైనాతో జరిగిన యుద్ధంలో సైన్యానికి స్వయంసేవకుల క్రియాశీల మద్దతు ఖచ్చితమైన కారణమని చెప్పవచ్చు. ఆ సమయంలో భారత్ సేవక్ సమాజ్, RSS అనే రెండు ప్రధాన సంస్థలు మాత్రమే కవాతులో పాల్గొనగలిగేవి. కానీ భారత్ సేవక్ సమాజ్ బలం దాదాపు శూన్యం, అందుకే చాలా బలంగా ఉన్న RSSని ప్రభుత్వం ఆహ్వానించింది.
ప్రస్తుతం నోయిడాలో నివసిస్తున్న జాగృతి ప్రకాశన్ యజమాని శ్రీ కృష్ణానంద్ సాగర్ కూడా ఆ రోజుల్లో తమతో ఉన్నారని శ్రీ విజయ్ కుమార్ గుర్తు చేశారు. అప్పుడు సంఘ ప్రచారక్‌గా ఉంటూ కవాతు సన్నాహాల్లో చురుకైన పాత్ర పోషించారాయన. ప్రస్తుతం కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ హౌస్ జర్నల్ ‘విశ్వకర్మ సంకేత్ ఎడిటర్ శ్రీ KL పాఠేల కూడా వారితో ఉన్నారు. ‘‘గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా సంతోషకరమైన ఘట్టం. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ను అణిచివేస్తానని’ పార్లమెంట్‌లో ప్రకటించిన వ్యక్తి మమ్మల్ని గౌరవంగా కవాతుకు ఆహ్వానించారు. నెహ్రూ వ్యాఖ్యపై స్పందిస్తూ “నేను మీ అణిచివేత మనస్తత్వాన్ని అణిచివేస్తాను అని శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పార్లమెంటులో అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆ ఆపూర్వ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీ కె.ఎల్.పఠేల ఇలా అన్నారు. “ఈ 89 ఏళ్ల వయస్సులో కూడా 1963 జనవరి 26 రోజును మర్చిపోలేదు. ఆ రోజులోని ప్రతి క్షణాన్ని నేను గుర్తుచేసుకోగలను. మేము జనక్‌పురి (న్యూఢిల్లీ) లోని కొంతమంది స్వయంసేవకుల శాఖకు వెళ్లినప్పుడు ఈ వార్త తెలియడంతో ఎంతో పులకరించిపోయాం. కవాతులో పాల్గొనడమే కాకుండా, నెహ్రూ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల దేశభక్తిని గౌరవిస్తుందనేది మరింత ఆనందాన్ని కలిగించింది.”
యుద్ధానికి సంబంధించిన మరో సంఘటనను శ్రీ పఠేల గారు గుర్తు చేసుకున్నారు. “రైళ్లు, ట్రక్కుల్లో జవాన్లు సరిహద్దుకు దూసుకువెళుతున్నప్పుడు, ప్రజలు అన్ని చోట్లా వారికి పూర్తి మద్దతును అందించారు. ఢిల్లీకి చెందిన కొంతమంది స్వయంసేవకులు జవాన్లకు సహాయం చేయడానికి రూ. 697 సేకరించాము. పండ్లు కొనుగోలు చేసి వారికి వేర్వేరు కంపార్ట్‌మెంట్లలో పండ్లు పంచాము. మీరు ఇప్పటికే చాలా పండ్లు ఇచ్చారని, మీరు వీటిని నిరుపేదలకు పంచండి జవాన్లు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులే కాదు, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికీ ఏదైనా శాఖను సందర్శించినప్పుడు, ఈ విషయాన్ని పంచుకుంటాను. స్వయంసేవకులకు దేశమే ప్రథమ స్థానమని తెలుసుకోవడం అవసరం, సంఘ్ స్వయంసేవక్ ఈ స్ఫూర్తిని నింపుకోవాలి ఆయన సూచించారు.
Source : ORGANISER