సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఇంటర్వ్యూ.. 3వ భాగం
మన సమాజం ఎదుర్కుంటున్న మరో సమస్య. అది జనాభా సమస్య. అసంతుల్య జనాభా ఎదుగుదల సమస్య. ఈ సమస్యను సంఘ్ లేవనెత్తింది, నొక్కి చెప్పింది. ఇదొక సంక్లిష్ట సమస్య. ఈ సమస్యను హిందు, ముస్లిం సమస్యగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా ఏకాభిప్రాయం సాధ్యమేనా?
ముందుగా, మెజారిటీలైన హిందువులు ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. హిందువులకు దేశం గురించి నాదీ అనే ఆత్మీయతా భావం ఉంటుంది. హిందువుల అభ్యున్నతితో దేశం క్షేమంగా, సుభిక్షి తంగా ఉంటుంది. కాబట్టి, ముందుగా హిందువులు ఈ విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. జనాభా ఒక సంపద. అదే సమయంలో అది భారీ భారం. నేను ఆ ఉపన్యాసంలో పేర్కొన్నట్లుగా, మనం లోతైన ఆలోచనలతో దీర్ఘకాల, జనాభా విధానాన్ని రూపొం దించుకోవలసిన అవసరం ఉంది. అలాగే, ఆ విధానాన్ని అందరికీ సమానంగా వర్తింప చేయ వలసిన అవసరం ఉంది. అయితే, ఇది బల వంతంగా చేయరాదు. ప్రజలకు అవగాహన కలిపించి, ఆ విధంగా అమలు చేయాలి.
జనాభా అసమతుల్యత ఒక వాస్తవ సమస్య. ఎక్కడెక్కడైతే జనాభా అసమతుల్యత చోటు చేసుకున్నదో అక్కడడక్కడ దేశ విభజనలు జరిగాయి. ఇదొక అంతర్జాతీయ వరవడి. వాస్తవం. అక్కడి ప్రజలు, నాగరికతల దురుసు ప్రవర్తన, దూకుడు స్వభావం వలన, ఈ వరవడి కొనసాగుతోంది. ఇందుకు హిందూ సమాజం ఒక్కటే మినహాయింపు. హిందూ సమాజం ఎప్పుడు ఎక్కడా దూకుడుగా పోలేదు. దురాక్రమణకు పాల్పడలేదు. శాంతివాదం, అహింస, ప్రజాస్వామ్యం, లౌకికవాదం మొదలైన వాటి పరిరక్షణ కోసం, దూకుడు చూపక పోవడం అవసరం.అయితే, శాంతిమార్గం అనుసరించడం వలన, తైమూర్, సూడాన్, పాకిస్తాన్‌లలో విపత్కర ఫలితాలు చూశాము. ఇందుకు సంబంధించి బుజ్జగింపు రాజకీయాలకు అంతం పలకవలసి ఉంది. హిందువులు లేదా ఇతరులపట్ల ఎలాంటి వివక్ష లేకుండా, పాకిస్తాన్ సృష్టికి కారణం ఏమిటని నిష్పాక్షికంగా అడగవలసి ఉంది?
చారిత్రిక అధారాల ప్రకారం, భారతదేశం ఒకప్పుడు అఖండ దేశంగా వెలుగొందింది. ఆ తర్వాత శతాబ్దాల పాటు సాగిన ఇస్లాం దుర్మార్గపు దాడులు అంతమైన తర్వాత దేశ విభజన జరిగింది. దేశ విభజన ఎలా జరిగింది? ఇందుకు నాకు ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. హిందూ భావ కో జబ్ – జబ్ భూలే ఆయీ… ఎప్పుడయితే, మనం హిందూ మూల భావనను మరిచిపొయామో, అప్పుడప్పుడల్లా, మనం విపత్తులను ఎదుర్కున్నాం. సోదరులు విడిపోయారు. భూమిని కోల్పోయాం. మత వ్యవస్థలు ధ్వంస మయ్యాయి.
నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. కానీ, భారతదేశం చరిత్ర చూడని స్థాయిలో రక్తపాతాన్ని చూసింది. ఇది నిజం. మనం కళింగ యుద్ధం గురించి అనుకుంటే, ఇది ఒక విధంగా స్థానిక యుద్ధం. త్వరగానే ముగిసి పోయింది. మనం , నేను హిందువును, అనే మౌలిక హిందూ భావనను విస్మరించడం వల్లనే మనం ఈ పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చింది. మనం హిందూ భావం గురించి మాట్లాడినా, అందులో ఇస్లామిక్ ప్రార్ధనా పద్ధతులకు ఎలాంటి విఘాతం కల్గించ లేదు.
హిందూ అనేది మన గుర్తింపు, మన జాతీయత, ప్రతి దాన్ని మనదిగా భావించే మన నాగరికత లక్షణం. ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోయే మన నాగరి••తా చిహ్నం. ఏనాడూ మనం మేము చెప్పిందే నిజం, ఇతరులు చెప్పింది అబద్ధం అని చెప్పలేదు. మీ దగ్గర మీరు చెప్పింది నిజం. మాదగ్గర మేము చెప్పింది నిజం. తగవు ఎందుకు, కలిసి కదులుదాం-ఇదీ హిందుత్వ భావన. ఈ విలువలకు కట్టుబడిన వారు మెజారిటీగా ఉన్నంత వరకు భారతదేశం ఐక్యంగా ఉంటుంది. ఐక్య భారతదేశం ప్రపంచాన్ని ఏకతాటిపై నడిపిస్తుంది. ఐక్యంగా, శక్తిమంతంగా ఉంచుతుంది. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, సమస్త మానవాళి సంక్షేమానికి సంబంధించిన విషయం. హిందూ సమాజం అదృశ్య మైతే, పరిస్థితి ఏమిటో ఒక్క క్షణం ఆలోచించుకోండి. ఇతర జాతులు ఆధిక్యం కోసం యుద్ధాలు మొదలెడ తాయి. అది అనివార్యం. అదే జరిగితే, అప్పుడు ఎదురయ్యే విపరిణామాల నుంచి మనల్ని రక్షించేది హిందువుల ఉనికి మాత్రమే. అదొక్కటే మనల్ని రక్షిస్తుంది.
హిందుస్తాన్.. హిందుస్తాన్‌గానే ఉండాలి.. ఇదే సాధారణ సత్యం. ఈ రోజు భారతదేశంలో జీవిస్తున్న ముస్లింలకు ఎలాంటి ముప్పూ లేదు. వారు తమ విశ్వాసాలకు కట్టుబడి ఉండాలంటే, ఉండవచ్చును. లేదు, తమ పూర్వికుల విశ్వాసాలకు తిరిగి రావాలను కుంటే, రావచ్చును. అది పూర్తిగా వారి ఇష్టం. ఇందుకు సంబంధించి హిందువులలో ఎలాంటి మొండి పట్టుదల లేదు. అయితే అదే సమయంలో, ముస్లింలు తమ ఆవేశపూరిత ఆధిపత్య ధోరణిని వదులుకోవలసి ఉంటుంది. మాది ఒక ఉన్నత జాతి, ఒకప్పుడు మేము ఈ ప్రాంతాన్ని పాలించాము, మళ్లీ మరోమారు పాలిస్తాము. మేము అనుసరించే మార్గమే సరైనది, ఇతర మార్గాలన్నీ తప్పుడు మార్గాలు. మేము భిన్నం, కాబట్టి మేము ఇలానే ఉంటాము; మేము కలసి జీవించము, వంటి అనేక అహంకారపూరిత ధోరణిని వదులుకోవలసి ఉంటుంది. నిజానికి, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు, ఇక్కడ జీవించే ఏ హిందువు అయినా, ఒక కమ్యూనిస్ట్ అయినా ఈ తర్కాన్ని వదులుకోక తప్పదు.
కాబట్టి, జనాభా అసమతుల్యత అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. మనం దీని గురించి లోతుగా ఆలోచించాలి. ఇది చెపుతున్నప్పుడు, నాతో విభేదించే వారు, నన్ను తప్పుపట్టే వారు, నాపై ఆరోపణలు చేసే ఉంటారనే విషయం నాకు తెలుసు. అయితే, అదే వ్యక్తులు, పరిపాలన బాధ్యతలలో ఉన్నప్పుడు, కచ్చితంగా అదే చేస్తారు. స్వతంత్ర భారతదేశం తొలినాళ్ల నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ కార్యకలాపాలను చూస్తే అధికారంలో ఉన్నవారు, వారి విశ్వాసాలు ఏవైనప్పటికీ, ఈ విషయంలో ఆందోళన చెందుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్నవారు, భారత సర్వోన్నతిని కోరుకునేవారు, తప్పక ఈ విషయాన్ని అలోచిస్తారు. ఏమి చేయాలో, ఏది అవసరమో అది చేస్తారు. కాబట్టి, అందరికీ తెలిసిన విషయాన్నే మేము పునరుద్ఘాటిస్తున్నాము.
మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరినీ వ్యతిరేకించము. ఇది జననాల రేటు (బర్త్ రేట్)కు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. జనాభా అసమతుల్యతకు మత మార్పిళ్లు, అక్రమ వలసలు ప్రధాన కారణం. వీటిని నిరోధిస్తే, సమతుల్యత సాధ్యమవుతుంది. కాబట్టి, జనాభా విధానం, ఈ సమతుల్యతను నిర్ధారించే విధంగా ఉండాలి. బర్త్ రేట్, ఇతర కారణాల వలన స్వల్ప అసమతుల్యత ఉంటే ఉండవచ్చును, దానిని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.
ఇక్కడ హిందువుల మానవ హక్కుల విషయం కూడా దృష్టికి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం దృఢంగా ఉంటోంది. అమెరికా వంటి దేశాలలో హిందూ ఆలయాలు, సంస్థలు హిందువు లకు సంబంధించిన విషయాలకు సంబంధించి తీర్మానాలు ప్రతిపాదిస్తున్నారు. ఓ వంక హిందుత్వంపై జరిగే, విద్యాపరమైన సదస్సులు, సమ్మేళనాలలో సంఘ్ కారణంగా హిందూ సమాజం దూకుడు చూపుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవంక, బర్మింగ్‌హామ్, లీసెస్టర్‌లలో సంఘ్ పేరున హిందువులపై దాడులు జరుగుతున్న ఉదాహరణ లున్నాయి. ఈ అవగాహనను పూర్వపక్షం చేసేందుకు సంఘ్ ఏమైనా ఆలోచన చేస్తోందా? ప్రపంచ స్థాయిలో హిందువుల మానవ హక్కుల గురించి, హిందు ఫోబియా గురించిన అలోచన ఉందా?
హిందువుల గురించి అనేక మంది మాట్లాడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మేముగా ఒక వేదికను ఏర్పాటు చేసే అలోచన ఏదీ లేదు. ప్రస్తుతమున్న సంస్థలు, వేదికలకు మరింత బలాన్ని సమకూర్చాలనేది మా ఆలోచన. హిందూ సమాజం జాగృతం అవుతున్న నేపథ్యంలో మనం ఈ ఘర్షణాత్మక మార్గం ద్వారా కూడా వెళ్లవలసి ఉంటుంది. మా ఎదుగుదలవలన ఎవరి స్వార్ధ ప్రయోజనాలు అయితే దెబ్బతింటున్నాయో వారే ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అదే సమయంలో దాడులకు దిగుతున్నారు. అయితే ఇప్పడు హిందువులు మేల్కొంటున్నారు. సరైన రీతిలో సమాధానం ఇస్తున్నారు.
అయితే, హిందువులు ఏ మార్గం ఎంచుకున్నా, అందరినీ కలుపుకుని వెళతారు. హిందూ సమాజం పై దాడులకు సంబంధించి, ఈ దాడులను వ్యతిరేకించే వారందరికీ, గ్లోబల్ హిందూ సొసైటీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. సంఘ్ అలాంటి పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగకుండా, కాలక్రమంలో మరింత పెరగకుండా చూస్తుంది. అవగాహన పెంచే విషయానికి వస్తే, మేము ఇందుకు సంబంధించి ఏదో ఒకటి చేయవలసి ఉంది. ఈ అవగాహన భావన అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, భారత్‌లో కూడా ఉంది. ఈ విషయంపై మేము ఇప్పటికే దృష్టిని కేంద్రీకరించాము. మీడియా సంభాషణలు పెంచాము. ప్రజలకు చేరువయ్యే అవుట్ రీచ్ చర్యలు మొదలయ్యాయి. ఇక ఇప్పడు వీటి విస్తరణ మిగిలుంది. కాలక్రమంలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు, సరైన సమయంలో, సరైన వ్యూహంతో చర్యలు తీసుకోవాలి. త్వరలోనే తీసుకుంటాము.
2025 నాటికి సంఘ్ వందేళ్లు పూర్తి చేసు కుంటోంది. ప్రపంచం మొత్తం ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నది. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని సంఘ్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన చేస్తోందా? అలాగే కొత్త ప్రతిజ్ఞ లేదా కొత్త కోణం చేర్చడం వంటివి ఏమైనా ఉంటాయా?
సంఘ్ కార్యంలో అనేక దశలున్నాయి. ఇది కేవలం సహజ పురోగతి మాత్రమే. ప్రపంచం దీనిని ప్రత్యేకంగా చూస్తోంది. డాక్టర్‌జీ జీవించి ఉన్న కాలంలో 1940 వరకు అనేక ప్రయోగాలు చేసి, హిందూ సమాజ నిర్మాణ కార్య పద్ధతుల నిర్ణయం జరిగింది. డాక్టర్‌జీ వెళ్లిపోయారు. ఆ పద్దతిలో సంఘ్ కార్యక్షేత్రం విస్తరించింది. దేశంలోని అనేక ప్రాంతాలకు సంఘ్ కార్యక్రమాలు విస్తరించాయి. ముందు జిల్లా స్థాయి వరకు. ఆ తర్వాత ఆ కిందకు సంఘ్ విస్తరించింది. ఇదంతా గురూజీ సమయంలో జరిగింది. అదే సమయంలో శిక్షణ పొందిన స్వయం సేవకులు విభిన్న క్షేత్రాలలో పనిచేయడం మొదలైంది. స్వయంసేవకులు ఏ క్షేత్రాన్ని వదిలివేయలేదు. బాలాసాహెబ్ దేవరస్‌జీ రోజుల్లో సంఘ్ విస్తరణ కార్యక్రమం మరింత ఊపందుకుంది. చురుగ్గా సాగింది. సంఘ్ సమాజ ఆధారిత సంస్థగా రూపు దిద్దుకుంది. సామాజిక బాధ్యతలను స్వీకరించింది. ఫలితంగా రాజకీయరంగంలో కొంత ప్రగతి కనిపించింది. రజ్జు భయ్యా, సుదర్శన్ జీ కాలంలో మనం ఈ ప్రగతిని స్పష్టంగా చూస్తాము. ఈ రోజున సమాజంతో సంఘ్ బలమైన బంధాన్ని పెనవేసు కుంది. సహజ పరిణామ క్రమంలో సంఘ్ విస్తరి స్తోంది. హిందూ సమాజంలో అవసరమైన పరివర్తన, సమన్వయం కోసం సంఘ్ పనిచేస్తుంది. స్వయం సేవకులు, సమాజంలోని ఉన్నత ఆశయాలు కలిగిన నిజాయతీపరులతో కలసి ఈ కార్యాన్ని నిర్వర్తిస్తారు. కలసి పనిచేస్తారు. మన దేశాన్ని కీర్తి శిఖరాలకు చేరుస్తారు. ఇందుకోసంగా, వందేళ్లు పూర్తయ్యే సమయానికి, శాఖలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవలసి ఉంటుంది. స్వయంసేవకులు అందుకు అవరమైన ఏర్పాట్లు చూస్తారు.
ఈ కార్యక్రమాల అవసరాల కోసం మరింత మంది స్వయంసేవకులను సమీకరించవలసి ఉంటుంది. అలా చేయడం వలన వందేళ్లు పూర్తయిన తర్వాత, ఈ పునాదులపై నిర్మాణం కొనసాగించే స్థితిలో ఉంటారు. సంఘ్ వ్యక్తి నిర్మాణ కార్యక్రమం కొనసాగిస్తుంది. వందేళ్లు చేరుకునే సమయానికి సంఘ్‌ను సర్వవ్యాపి చేయాలి.. అంతటకు విస్తరించాలి, సమాజంలోని అన్ని వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకోవాలి, తద్వారా, ప్రజలు ఉత్తమ ఉదాహరణలను అనుసరించగలుగు తారు; బాలీవుడ్ సినిమాలు, మీడియా, రాజకీయా లకు ఇప్పడు ఇస్తున్న అతి ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రజలు వారి సామాజిక బాధ్యతలను గుర్తిస్తారు. సమాజం ఉన్నత వ్యక్తులతో, ఉదాత్త శక్తిగా నిలుస్తుంది. జాతీయ ప్రయోజనాలతో ముడిపడిన సామరస్యపూర్వక సత్సంబంధాలతో పనిచేయవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైన శక్తి, సామర్ధ్యాలను, మేము 2025 వరకు సమకూకుర్చుకోవలసి వుంది. ఈ కార్యంలో మేము ఏమి సాధించగలమో, ఆ మేరకు మేము ముందకు సాగుతాం.. ముందడుగు వేస్తాం.
(అయిపోయింది)
మొదటి భాగం : మా బంధం జాతీయ విధానాలకు సంబంధించిన రాజకీయంతోనే!
రెండవ భాగం : హిందుస్తాన్ హిందుస్తాన్‌గానే ఉండాలి!
అను: రాజనాల బాలకృష్ణ
జాగృతి సౌజన్యంతో…