జార్ఖండ్‌లోని బొకారోలోని కాసియా తాండ్ ప్రాంతంలోని ఒక ఆలయంలో హనుమంతుడి విగ్రహం, శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది.
ఆలయ గర్భగుడి నుండి బయటకు తీసుకువచ్చిన హనుమంతుని విగ్రహం పూర్తిగా దెబ్బతింది. అదే సమయంలో ఒక శివలింగం కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆలయంలో ప్రతిష్టించిన శివలింగాన్ని, విగ్రహాన్ని పెద్ద రాయితో ధ్వంసం చేశారు. శివాలయంలో ఏర్పాటు చేసిన త్రిశూలం కూడా పాడైపోయింది. ఈ ప్రాంతం డ్రగ్స్ బానిసల నిలయంగా ఉందని ప్రజలు అంటున్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
అంతకుముందు, గత ఏడాది రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లాలో, గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్‌డిహా పంచాయతీ ప్రాంతంలోని కుబ్రితాండ్‌లో హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేశారు.
హనుమంతుడి విగ్రహంతో పాటు శివలింగం కూడా విరిగిపోయి కనిపించింది.
Source : ORGANISER