Home News మణిపుర హింస: ప్రజలు శాంతియుతంగా  ఉండాలి – ఆర్‌.ఎస్‌.ఎస్ విజ్ఞ‌ప్తి

మణిపుర హింస: ప్రజలు శాంతియుతంగా  ఉండాలి – ఆర్‌.ఎస్‌.ఎస్ విజ్ఞ‌ప్తి

0
SHARE
మణిపుర రాష్ట్రంలోని చురాచాందపూర్ లో 2023 మే 3న జ‌రిగిన‌ “లాయిహర  ఓబా” ఉత్సవ ర్యాలీ తర్వాత హింస చెలరేగింది. 45 రోజులుగా ఈ హింస కొనసాగుతూనే ఉంది. ఈ మేర‌కు ప్ర‌జ‌లు శాంతియుతంగా ఉండాల‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (RSS) విజ్ఞ‌ప్తి చేస్తోంద‌ని మాన‌నీయ స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబలే జీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఎంతో బాధాకర‌మ‌ని, ప్రేమ ,అభిమానం, సఖ్యత , సౌభ్రాతృత్వం ఉన్నవారి మధ్య శాంతియుత జీవితం గడుపుతున్న తరుణంలో అశాంతి  మంటలు  అలుముకోవటం, ఇప్పటివరకు హింస అదుపులో రాకపోవడం శోచనీయని ఆయ‌న పేర్కొన్నారు. మణిపూర్ లో వలసదారులు, బాధితుల సంఖ్య 50,000 కన్నా ఎక్కువగా ఉంద‌ని, వీరికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అండగా నిలబడుతుంద‌ని వారు పేర్కొన్నారు.
“ప్రజాస్వామ్య వ్యవస్థలో హింస,  ద్వేషాలకు స్థానం లేదు. ఎటువంటి భయంకర పరిస్థితులైనా సామరస్యంగా, శాంతిపూర్ణ వాతావరణంలో  సోదర భావము, సుహృద్భావ వ్యక్తికరణతోనే పరిష్కారం సాధ్యం అవుతుంది. ప్రజలు పరస్పర విశ్వాసంతో వర్తమాన పరిస్థితులకు కారణమైన సంఘటనలను, కారణాలను అర్థం  చేసుకుని లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విజ్ఞప్తి చేస్తోంది. దీనికి రెండు సమూహాలు సమగ్రమైన  రీతిలో విస్తృతంగా ప్రయత్నాలు  చేయవలసిన అవసరం ఉంది.
మై తేయి సమూహాలలో నెలకొని ఉన్న అభద్రత, నిస్సహాయత, కూకి సమూహాలలో ఆందోళను, అర్థం చేసుకొని, చర్చలు జరిపి శాంతి నెలకొల్ప వచ్చును. మణిపూర్ లో నెలకొన్న బాధాకరమైన హింసని తక్షణమే ఆపడానికి  అవసరమైన అన్ని మార్గాలు అన్వేషించాలని  స్థానిక పరిపాలన విభాగాలు, పోలీసు, సైన్యము, కేంద్ర సంస్థలతో పాటు ప్రభుత్వానికి RSS విజ్ఞప్తి చేస్తోంది. శాంతి, సద్భావన నెలకొల్పడానికి అన్ని చర్యలు తీసుకొని శరణార్ధులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలి.
మణిపూర్ లో ఉత్పన్నమైన వర్తమాన అరాచకము , హింసని ఆపాలి. దీనికి అవసరమైన ప్రతి మార్గాన్ని అన్వేషించాలి. మణిపూర్  లో  భద్రత ,శాంతిని సుస్థిరం పరచడం కోసం ప్రయత్నం చేయాలి. అన్ని విధాల పరస్పర సహకారము సహాయము అందించాలని ఆర్ఎస్ఎస్,  పౌర సమాజం, మణిపూర్  రాజకీయ సమూహాలు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.” అని ఆయ‌న పేర్కొన్నారు.