వనవాసులు మన భారతీయ జీవన స్రవంతిలో విడదీయలేని భాగం. ప్రస్తుతం మన దేశంలో సుమారు 12 కోట్ల మంది గిరిజనులు నివసిస్తున్నారు వనవాసులను భారతీయ జీవన స్రవంతినుండి వేరు చేయడానికి విద్య, వైద్యం పేరిట వారిని నగరీయ సమాజానికి దూరంగా ఉంచి విజాతీయ విధర్మీయ శక్తులు వీరిపై పట్టు సాధించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా వారు తమ హక్కులను పూర్తిగా అనుభవించే పరిస్థితులు లేవు. మతమార్పిడులు కూడా వారి దుర్భర పరిస్థితుల కారణం అవుతున్నాయి. ఈ పరిస్థితిలో పరమ పూజనీయ గురూజీ సలహాతో వనయోగి బాలాసాహెబ్ దేష్పాండేజీ 1952 లో డిసెంబర్ 25 న జష్పూర్ కేంద్రంగా కళ్యాణ్ ఆశ్రమం స్థాపించడం జరిగింది.