సేవా భారతి ఆధ్వర్యంలో గురువారం స్థానిక బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణా తరగతులు కార్యక్రమం ప్రారంభమయ్యాయి. 12 నుండి 18 సంవత్సరాల అమ్మాయిలకు ఆరోగ్య పరమైన పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన చికిత్స, మందులు, పౌష్టిక ఆహారం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సుపోషణ కార్యక్రమానికి సేవా భారతి శ్రీకారం చుట్టిందని సేవాభారతి క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్ర శేఖర్ గారు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సేవా బస్తీల్లో మొదట1000 మందికి ఈ పరీక్షలు నిర్వహించనున్నామని ప్రతి ఒక్కరికి 3 నెలల పాటుగా చికిత్స అందిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి AllMS Director వికాస్ భాటియా గారు హాజరై మాట్లాడుతూ ఈ సుపోషన్ కార్యక్రమం చాలా బాగుందని, ప్రస్తుతం సమాజంలో ప్రజలు పౌష్టిక ఆహార లోపం వల్ల చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు ధీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని , పేర్కొన్నారు. చాలా మంది ఆహారం పట్ల అజాగ్రత్తగా ఉంటున్నారని, రోడ్లపై హోటళ్లలో జంక్ ఫుడ్ తీసుకోవడం దాని వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కోవడం చాలా బాధాకరం అని తెలియజేశారు. సేవా భారతి దేశ వ్యాప్తంగా 150 వేలకు పైగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, సేవాభారతి చేపట్టిన సుపోషణ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తామందరమూ సహకరిస్తామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు బీదవారికి ఉచితంగా అందించి, ఆర్థికంగా ఉన్నవారికి తక్కువ ఫీజు తీసుకుని వైద్య సేవలు అందిస్తే వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతారని అన్నారు. సేవా భారతి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో A.G.M డా.మునికృష్ణ, CMD డా. వేణుగోపాల్, DGM.HR డా. భవానీశంకర్, BMS General Secretory నర్సింగ రావు, dean Academic రాహుల్ నారంగ్, C. MF.M. Dr. నీరజ్ అగర్వాల్, ఎయిమ్స్ డాక్టర్స్ ఎక్స్‌క్యూటివ్ మెంబర్ బాలేందర్, నర్సింగ్ కళాశాల విద్యారులు పాల్గొన్నారు.