Home Ayodhya రామమందిర ఉద్యమ రథ సారథులు – 2

రామమందిర ఉద్యమ రథ సారథులు – 2

0
SHARE

పూజ్య దేవరహా బాబా

పూజ్య దేవరహా బాబా గారు రామ మందిర తాళాలు తెరుచుటకు ఎంత‌గానో ప్రోత్సాహించే వారు. వారెటువంటి కార్యక్రమాల‌కు వెళ్ళెవారు కాదు. కానీ విశ్వ హిందూ పరిషత్‌ ద్వారా 1989 ప్రయాగరాజ్ కుంభమేళాలో నిర్వహించిన ధర్మసంసద్ లో వారు ఉపస్థితులైయ్యారు. ధర్మసంసద్ యందు వారి ఉపస్థితిలోనే ప్రత్యేక మందిరం, ప్రత్యేక గ్రామంలో శ్రీరామ మందిర నిర్మాణార్థమై శిలాపూజా కార్యక్రమము ప్రకటించబడింది. నవంబరు 6, 1989న అప్పటి ప్రధానమంత్రి రాజీవగాంధి గారు బాబాను కలువడానికి గోరఖ్ పూర్ కెళ్ళారు. ఆ సమయంలో అప్పటికే శ్రీరామ జన్మభూమి మందిరపు శిలాపూజా కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా బాబా గారు రాజీవ్ గాంధితో “బిడ్డా! అయి పో నివ్వు” అని వారితో అన్నారని చెబుతుంటారు. శ్రీరామ జన్మభూమి స్థలంలో వేసినటువంటి తాళం తొలగించే ఆదేశ నిర్ణయాన్ని సురక్షితంచేసి న్యాయధీశులు తన నివాసానికె వెళ్లిన‌పుడు “బిడ్డా! ధైర్యం చేయుము, ఇప్పుడు చేయకపోతే మళ్ళెప్పుడు చేయగలవ్?” అని సూచించారు. తాళాలు తెరుచుకున్న తరువాత ఎప్పుడైతే వారు మొట్టమొదటిసారి బాబాతో కలువగానే అప్పుడు బాబా వారితో “బిడ్డా! ఎందుకు ధైర్యం చేయలేకుండుంటివి?” వారికి వెంటనే ఆ ధ్వని తాళం తెరిపించే రోజున వినపించిందిదేనని అనిపించింది. శ్రీరాముని మందిర సంబంధంలో పూజ్య దేవరహా బాబా ఏ విధంగా భవిష్యవాణి చేసియుండిరో అవి అక్షరాల సాకారమైనాయి.

Read also : రామమందిర ఉద్యమ రథ సారథులు –  రామభక్త జిల్లా కలెక్టర్ కె.కె.నాయర్