Home News అంబేద్కర్ పేరిట ఆర్ఎస్ఎస్, బీజేపీలను బదనాం చేసే హక్కు ఈ సంకుచితవాదులకు ఎవరిచ్చారు?

అంబేద్కర్ పేరిట ఆర్ఎస్ఎస్, బీజేపీలను బదనాం చేసే హక్కు ఈ సంకుచితవాదులకు ఎవరిచ్చారు?

0
SHARE

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఆర్ఎస్ఎస్‌ఫై రిజర్వేషన్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అలాగే బీజీపీని ఓడించాలని బహిరంగంగా పిలుపునిచ్చాయి. బాబా సాహెబ్ అంబెద్కేర్ అందరి కోసం ఆలోచించి, దళితులకు దారిచూపించారు. దళితుల పట్ల మొదటి నుండి కాంగ్రెస్ వారి తీరు ఏమిటో ఆలోచించుకోవాలి. అంబెద్కేర్ లోకసభ సభ్యునిగా కాకుండా రెండు సార్లు కాంగ్రెస్ అడ్డుకుంది నిజం కాదా? ఎంతో మందికి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ మన అంబేద్కర్‌కి ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ దళితులను కేవలం ఓట్ బ్యాంకుగా వాడుకుందని పలు ప్రశ్నలు సంధిస్తూ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆంధ్రప్రదేశ్ వారు ఒక ప్రకటన విడుదల చేసారు. మీ కోసం యధాతథంగా ఇస్తున్నాం.

అమాయకమైన గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది?! మనం గొఱ్ఱెలమా?

బలికి కసాయి గొర్రెను తీసుకు పోతూ ఉంటాడు.చాలా నమ్మకంగా గొర్రె అతనిని అనుసరిస్తూ వెడుతుంది.ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతున్న చరిత్ర. గొర్రెకు బుద్ధి తక్కువ అనుకుందాం! మనం ఎస్సీలం గొర్రెలమా?

డా.బాబా సాహెబ్ అంబేద్కర్ మన కోసం ఆలోచించిన వాడు,మన కోసం జీవించిన వాడు. మనకు దారి చూపినవాడు..

1) వారి పట్ల కాంగ్రెస్ వారు మొదటి నుండీ వ్యవహరించిన తీరు ఏమిటి?

స్వాతంత్ర్యం రాక పూర్వమే అంబేద్కర్,” కాంగ్రెస్ దళితులకు ఏమి చేసింది? అని పుస్తకం వివరంగా వ్రాశారు.మన అంబేద్కర్ ను రెండు సార్లు(1952 లో, 54 ఉప ఎన్నికలో) లోకసభ సభ్యునిగా ఎన్నిక కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ కాదా?

ఎంతో మందికి భారత రత్న పురస్కారం ఇచ్చిన కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంబేద్కర్ కు ఇవ్వలేదు?

శ్రీమతి ఇందిరా గాంధీ వరకు కాంగ్రెస్ నాయకులు మన ఎస్సీ లను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ వినియోగించుకుంది.సోనియా గాంధీ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రాధాన్యం ఎస్సీలు కాదు, ముస్లింలు/ మైనారిటీలు అయ్యారు.ఆశించిన మేరకు మనం 60 ఏళ్లలో అభివృద్ధి పొందక పోవడానికి కాంగ్రెస్ పాలకులు కారణం కాదా? కాంగ్రెస్ హయాంలో మనకు కట్టిన ఇళ్లను ఊరికి వేలుపలే కట్టారు కదా? మనం ప్రజల్లో కలవ కూడదు అనేదే కదా వారి ఉద్దేశం.

2) మన భీంరావ్ బతికి ఉన్నంత కాలం కమ్యూనిస్టులు మన అంబేద్కర్ ను సిద్దాంతం పేరున అంటూ విమర్శించారు.( తాజాగా రంగ నాయకమ్మా విమర్శస్తూ పుస్తకం వ్రాసింది కదా!) భారత రాజ్యాంగము తయారీ సమయంలో రాజ్యాంగం పట్ల ఎక్కువ విమర్శలు చేసిందీ కమ్యూనిస్టులే!(ఈ విషయం బాబా సాహెబ్ తన రాజ్యాంగ సభ ప్రసంగంలో ప్రస్తావించారు కూడా!)

1956 ఖాట్మండు ప్రసంగం “బుద్ధుడా? కార్ల్ మార్క్స్?” అన్న ప్రసంగంలో మార్క్సిస్టు విప్లవం ద్వారా శాశ్వత మార్పు రాదని సోదాహరణ పూర్వకంగా డా.అంబేద్కర్ విశ్లేషించారు.

కమ్యూనిజానికి దేశంలో నూకలు చెల్లిన తర్వాత వారికి మన అంబేద్కర్ గుర్తుకు వచ్చాడు. తెలుగు రాష్ట్రాలలో నక్సల్ ఉద్యమానికి మూల పురుషుడు అయిన నల్ల సూరీడు శ్రీ సత్యమూర్తి ఏమన్నారు? “నక్సల్ ఉద్యమంలో కూడా క్రింది స్థాయిలో పోరాటం చేస్తున్నవారు, చనిపోతున్నవారు ఎస్సీ,ఎస్టీ వర్గాల వారు, పై నాయకత్వం మాత్రం అగ్ర వర్ణాల వారిది”.

నిమ్న, పేద వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నాం అని కమ్యూనిస్టు పార్టీల పోలిట్ బ్యూరోలో ఎంతమంది ఎస్సీ,ఎస్టీ,మహిళలు ఉన్నారు?

అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా, భారత దేశం ఒకటి కాదని, ఆర్యులు బయట వారు అనీ ఈ దేశంలోని మూలవాసుల పై వచ్చి పరాయి దేశం వారు( ఆర్యులు) దాడులు చేశారని అసత్య ప్రచారం ఇప్పటికీ చేస్తున్నది కమ్యూనిస్టులు కాదా?

ఇలాంటి కాంగ్రెస్,కమ్యూనిస్టులను ఇంకా మనం నమ్ముదామా? వారి వెంట గొఱ్ఱెల వలె పరిగెడదామా?

3) 1956లో బాబా సాహెబ్ తనువు చాలించే సమయానికి కొన్ని నెలల ముందు, తాను ప్రారంభించిన షెడ్యూల్డు కాస్ట్స్ ఫెడరేషన్‌ను రద్దు చేసి రిపబ్లికన్ పార్టీని ప్రారంభించారు.ఈ పార్టీ నేటికీ మహారాష్ట్రకే పరిమితం అయింది.అనేక ముక్క చెక్కలు అయింది.దీనికి కారణం ఎవరు? ఇతర రాష్ట్రాలకు ఈ పార్టీ ఎందుకు విస్తరించలేదు?

4) కుమారి మాయావతి నేతృత్వంలో బహుజన సమాజ్ పార్టీ పలుమార్లు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు అక్కడా వెనుక బడింది.ఆమె ద్వారా ఇతర రాష్ట్రాలకు ప్రభుత్వాలు విస్తరింపబడ లేదు. దీనికి కారకులెవరు?

5) ఇక చివరగా…. 12 మే 1939 లో పూనా నగరంలో జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తల శిబిరానికి ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తల ఆహ్వానం మేరకు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా వచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్.సంస్థాపకులు డా.కేశవరావు హెడ్గేవార్ ఇతర ఆర్.ఎస్.ఎస్ స్థానిక ప్రముఖులు, బాబా సాహెబ్ అంబేద్కర్ అనుయాయి శ్రీ బాలా సాహెబ్ సాలుంకే ఉన్నారు.( వీరు 1957-62 లోక్ సభ సభ్యులు,వీరి ఆత్మ కథ పుస్తకంలో ఈ ఘటనను పేర్కొన్నారు.1957 ఏప్రిల్ 1 ఉగాది పూనా ఆర్.ఎస్.ఎస్.ఉత్సవంలో ఈ ఘటనను వారు బహిరంగ సభలో తెలియ చేసారు.) డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆర్.ఎస్.ఎస్‌ను మనువాద సంస్థగా ఎక్కడైనా విమర్శించారా?

కొందరు అంబేద్కర్ వాదులు నేడు ఆర్.ఎస్.ఎస్‌ను విమర్శిస్తున్నారు.
మారుతున్న పరిస్థితుల్లో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి మన వ్యూహాలు ఎలా ఉండాలో చర్చించకుండా బాబా సాహెబ్ అంబేద్కర్ అంతరంగాన్ని అర్థం చేసుకోకుండా కొందరు పిడివాదుల వ్యవహారం వల్లే మనం రాజకీయంగా వెనుకబడ్డాం. మన హితాన్ని కోరేవాళ్ళను అందరినీ దూరంగా పెట్టి మనం ఏకాకులం అవుతున్నాం!

ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చును. డా.బాబా సాహెబ్ అనుయాయులుగా ఉండవచ్చును. కానీ, డా.బాబా సాహెబ్ అంబేద్కర్ పేరిట ఆర్.ఎస్.ఎస్, బీజేపీలను బదనాం చేసే హక్కు ఈ సంకుచితవాదులకు ఎవరు ఇచ్చారు? మీరేమంటారు?

ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక
ఆంధ్రప్రదేశ్