Home News చైనాకి షాకిస్తూ… టిబెట్‌లో 30 ప్రాంతాల పేర్ల మార్పిడికి భారత్ కసరత్తు

చైనాకి షాకిస్తూ… టిబెట్‌లో 30 ప్రాంతాల పేర్ల మార్పిడికి భారత్ కసరత్తు

0
SHARE

చైనాకు బుద్ధి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. టిబెట్‌ లో స్వతంత్రంగా వున్న ప్రాంతంలోని 30 కి పైగా వున్న స్థలాలకు పేర్లు మార్చాలని భారత ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చి, భారత్‌ను రెచ్చగొట్టింది. ఇప్పుడు భారత ప్రభుత్వం టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌లోని 30 స్థలాల పేర్లను మార్చేందుకు రెడీ అయిపోయింది. ఈ పేర్ల మార్పుపై విస్తృతమైన చారిత్రక పరిశోధన కూడా భారత ప్రభుత్వం చేసింది. 30 ప్రాంతాలకు పెట్టే పేర్లను అతి త్వరలోనే కేంద్రం కూడా వెల్లడిరచనుంది. ఏఏ పేర్లను పెడితే చారిత్రక సందర్భం కలిసి వస్తుందని కేంద్రం కూడా కసరత్తు చేసింది. కోల్‌కతాలోని ఆసియాటిక్‌ సొసైటీ వంటి ప్రముఖ పరిశోధనా సంస్థల మదదతు తీసుకుంటోంది. ఈ పని కేంద్రం భారత సైన్యంలోని సమాచార యుద్ధ విభాగానికి అప్పగించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ వివాదాస్పద ప్రాంతాల్లోకి భారత మీడియాను కూడా కేంద్రం తీసుకెళ్లడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా వుండే ప్రజలతో మీడియా ముచ్చటించనుంది. చైనా వాదనలను వ్యతిరేకించే వారితో మాట్లాడిస్తారు. చారిత్రక, పరిశోధక, స్థానిక సాక్ష్యాలు బాగా తెలిసిన వారితో సంభాషించి, ఆ కథనాలను ప్రపంచం ముందు వుంచేందుకు భారత సర్కార్‌ రెడీ అయ్యింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రదేశాల పేర్లను చైనా అనేక సార్లు మార్చింది. తాజాగా యేడాది క్రింత చైనా విడుదల చేసిన జాబితాలో నివాస ప్రాంతాలు, పర్వతాలు, నదులు ఇలా చాలా ప్రాంతాల పేర్లు చైనా మార్చేసింది. అంతేకాకంఉడా 2017, 2021, 2023లోనూ ఇలాగే దుందుడుకు చర్యలకు పూనుకుంది. ఇలాంటి చర్యలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే వస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని, భారత్‌తో ఆ ప్రాంతానికి విడదీయరాని బంధం వుందని విదేశాంగ శాఖ చాలా సార్లు ప్రకటనలు చేసింది.