కూలిన గోడ అయోధ్య కొత్త రైల్వే స్టేషన్‌ది కాదు… PIB ఫ్యాక్ట్‌ చెక్‌

    0
    SHARE

    కొత్తగా ప్రారంభించిన అయోధ్య ధామ్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ వెలుపల సరిహద్దు గోడ వర్షం కారణంగా కూలిపోయిందంటూ కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలు చేసిన గగ్గోలు పూర్తిగా తప్పని తేలిపోయింది. కూలిపోయిన గోడ పాత స్టేషన్‌లో భాగమని, కొత్త స్టేషన్‌లోది కాదని తేలిపోయింది. కొత్తగా ప్రారంభించిన రైల్వే స్టేషన్‌ గోడ వర్షాలకు కూలిపోయిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌ బృందం అక్కడి వెళ్లి తనిఖీ నిర్వహించింది.

    ఈ తనిఖీల్లో ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలు శుద్ధ తప్పని, కూలిన గోడ పాత స్టేషన్‌లో భాగమని, కొత్త స్టేషన్లోది కాదని ఆ బృందం తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్‌ వ్యక్తి తవ్వడం వల్ల ఆ గోడ దగ్గర నీరు చేరి, కూలిపోయిందని ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో తీవ్ర అవినీతి రాజ్యమేలుతోందని, కొత్తగా ప్రారంభించిన అయోధ్య ధామ్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ వెలుపల సరిహద్దు గోడ కూలిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. వీడియోలు కూడా షేర్‌ చేశాయి. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌ బృందం అసలు విషయం వెల్లడిరచడంతో ప్రతిపక్షాలు చేసిన విమర్శలు తప్పని తేలిపోయింది.