Home News శుభకార్యాల్లో పనిచేస్తూ పేద విద్యార్థులకు సేవా భారతి ద్వార చేయూతనందిస్తున్న ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు

శుభకార్యాల్లో పనిచేస్తూ పేద విద్యార్థులకు సేవా భారతి ద్వార చేయూతనందిస్తున్న ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు

0
SHARE

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో కొల్లంగోడు అనే ఊరుంది. ఆ ఊర్లో ఒక కళ్యాణమంటపం ఉంది. అక్కడ జరిగే ప్రతి పెళ్లిలో, శుభకార్యంలో అసామాన్యం అనిపించే ఒక దృశ్యం అందరినీ  ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

సుమారు ముప్పైమంది రకరకాల వయస్సులవారు, భోజనం వడ్డించడం, ఎంగిలాకులు ఎత్తడం, టేబుళ్లను శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తూ అక్కడ కనిపిస్తారు. వారిలో అనేకమంది శ్రీమంతులు, రకరకాల ఉద్యోగాలు చేసుకునేవారూ ఉంటారు. వాళ్లంతా ఈ పని ఎందుకు చేస్తున్నారని పెళ్లికి వచ్చిన చాలామంది అతిథులకు అర్థం కాదు. వాళ్ళు మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా తమ పనిలో నిమగ్నమవుతూ ఉంటా రు.

వాళ్ళు చేస్తున్న ఈ పని వెనుక ఒక కారణముంది. వాళ్లంతా ఆ ఊర్లోని ఆరెస్సెస్ స్వయం సేవకులు. ప్రతి పెళ్లిలో, శుభకార్యాలలో తాము చేసిన పనులకు గాను సంబధితుల నుండి 1000 రూపాయలు స్వీకరిస్తారు. అయితే ఆ డబ్బును వారెవరూ తమలోతాము పంచుకోరు. దాన్ని స్థానిక సేవాభారతి సంస్థకు అందజేస్తారు. సేవా భారతి ఆ డబ్బుతో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు కొని బీద విద్యార్థులకు పంచుతుంది.

ఆ విధంగా ఆ శాఖా స్వయంసేవకులు 2004 సంవత్సరంలో 92 వేల రూపాయలను సేవాభారతికి అందించారు.

సేవకోసం ‘సామూహిక సంపాదన చేసే వాళ్ల నిష్కామ కర్మ ఎంత గొప్పదో!

ఇలా అందరిలాంటివారే, సామాన్యులే మనసుపెట్టి, పనిలో దిగి పదిమంది సహకారం తీసికొని ముందుకుపోతూ ఉంటే, మన ఊళ్ళో మనం మాత్రం ఇలాంటి పనులు ఎందుకు చేయలేము?

‘పరోపకారర్థ మిదం శరీరం’
తోటివారికి ఉపయోగపడేందుకే ఈ శరీరం ఉన్నది.